అమ్మాయే నవ్వితే
| అమ్మాయే నవ్వితే | |
|---|---|
![]() అమ్మాయే నవ్వితే సినిమా పోస్టర్ | |
| దర్శకత్వం | వి.జ్యోతికుమార్ |
| రచన | జలదంకి సుధాకర్ (చిత్రానువాదం/మాటలు) |
| కథ | ఉదయ్ రాజ్ |
| నిర్మాత | వి. ఆనంద్ ప్రసాద్ |
| తారాగణం | రాజేంద్రప్రసాద్, భావన, జయసుధ, బ్రహ్మానందం |
| ఛాయాగ్రహణం | ఎన్.వి. సురేష్ కుమార్ |
| కూర్పు | మురళి-రామ్మయ్య |
| సంగీతం | ఎం.ఎం. శ్రీలేఖ |
నిర్మాణ సంస్థ | సుధా ఆర్ట్ ప్రొడక్షన్స్[1] |
విడుదల తేదీ | 9 నవంబర్ 2001 |
సినిమా నిడివి | 129 నిముషాలు |
| దేశం | భారతదేశం |
| భాష | తెలుగు |
అమ్మాయే నవ్వితే 2001, నవంబరు 9న విడుదలైన తెలుగు చలనచిత్రం. సుధా ఆర్ట్ ప్రొడక్షన్స్[2] పతాకంపై వి. ఆనంద్ ప్రసాద్ నిర్మాణ సారథ్యంలో వి.జ్యోతికుమార్[3] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, భావన, జయసుధ, బ్రహ్మానందం తదితరులు నటించగా, ఎం.ఎం. శ్రీలేఖ సంగీతం అదించారు.[4] ఈ చిత్రం పరాజయం పొందింది.[5]
కథా నేపథ్యం
[మార్చు]భూస్వామ్య యుగ అధిపతి శేషాద్రి నాయుడు (రంగనాథ్) పాలించిన తలమంచి గ్రామంలోని సుందరం (రాజేంద్ర ప్రసాద్) ఒక నిరుద్యోగి. నాయుడు కళాశాలలో హిందీ లెక్చరర్ పోస్ట్ ఖాళీగా ఉండడంతో సుందరం ఆ ఉద్యోగంలో చేరాలి అనుకుంటాడు. తన తెలివితేటలతో సుందరం ఆ ఉద్యోగం పొందుతాడు. నాయుడు కుమార్తైన శిరీష (భవన)ను ప్రేమిస్తాడు. ఇది గమనించిన నాయుడు, 15 రోజుల్లో శిరీషతో ఐ లవ్ యు చెప్పించుకోవాలని షరతు విధిస్తాడు. శిరిష ప్రేమను పొందడంలో సుందరం విజయవంతమవుతాడ అనేది మిగిలిన కథ.
నటవర్గం
[మార్చు]- రాజేంద్ర ప్రసాద్ (సుందరం)
- భావన (శిరీష)
- రంగనాథ్ (శేషాద్రి నాయుడు)
- ఆహుతి ప్రసాద్
- బ్రహ్మానందం (డి.డి)
- ఎం. ఎస్. నారాయణ (ప్రిన్సిపాల్)
- ఎల్. బి. శ్రీరామ్
- ప్రసాద్ బాబు
- నవభారత్ బాలాజీ
- తిరుపతి ప్రకాష్
- గౌతంరాజు
- కళ్ళు చిదంబరం (బస్ కండక్టర్)
- సత్తి బాబు
- జయసుధ (రాజేశ్వరి)
- రమాప్రభ
- శివపార్వతి
- ఢిల్లీ రాజేశ్వరి
- సన
- శోభ రాణి
- ఆలపాటి లక్ష్మి
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: వి.జ్యోతికుమార్
- నిర్మాత: వి. ఆనంద్ ప్రసాద్
- చిత్రానువాదం, మాటలు: జలదంకి సుధాకర్
- కథ: ఉదయ్ రాజ్
- సంగీతం: ఎం.ఎం. శ్రీలేఖ
- ఛాయాగ్రహణం: ఎన్.వి. సురేష్ కుమార్
- కూర్పు: మురళి-రామ్మయ్య
- నిర్మాణ సంస్థ: సుధా ఆర్ట్ ప్రొడక్షన్స్
పాటలు
[మార్చు]| అమ్మాయే నవ్వితే | ||||
|---|---|---|---|---|
| సినిమా by | ||||
| Released | 2001 | |||
| Genre | పాటలు | |||
| Length | 23:42 | |||
| Label | టిప్స్ మ్యూజిక్ | |||
| Producer | ఎం.ఎం. శ్రీలేఖ | |||
| ఎం.ఎం. శ్రీలేఖ chronology | ||||
| ||||
ఈ చిత్రానికి ఎం.ఎం. శ్రీలేఖ సంగీతం అందించింది. టిప్స్ మ్యూజిక్ కంపనీ ద్వారా పాటలు విడుదలయ్యాయి.[6]
| సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
|---|---|---|---|---|
| 1. | "కొక్కొ కోడిపెట్ట (రచన: శ్వేతనాగ)" | శ్వేతనాగ | హరిణి | 4:08 |
| 2. | "నిన్న లేదు మొన్న లేదు (రచన: కులశేఖర్)" | కులశేఖర్ | రమణ, ఎం.ఎం. శ్రీలేఖ | 4:26 |
| 3. | "ఎబిసిడి (రచన: శ్వేతనాగ)" | శ్వేతనాగ | రవివర్మ పోతేదార్, ఎం.ఎం. శ్రీలేఖ | 4:05 |
| 4. | "చిన్ని కృష్ణుడొచ్చాడు (రచన: జలదంకి సుధాకర్)" | జలదంకి సుధాకర్ | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, రాజేంద్ర ప్రసాద్, రమణ, సునీత ఉపద్రష్ట | 3:22 |
| 5. | "యమునాతీరే యమయమ (రచన: శ్వేతనాగ)" | శ్వేతనాగ | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎం.ఎం. శ్రీలేఖ | 3:18 |
| 6. | "దండాలయ్య (రచన: జలదంకి సుధాకర్)" | జలదంకి సుధాకర్ | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం | 4:23 |
మూలాలు
[మార్చు]- ↑ "Ammaye Navvithe (Overview)". IMDb.
- ↑ "Ammaye Navvithe (Banner)". Chitr.com. Archived from the original on 2020-07-23. Retrieved 2020-07-23.
- ↑ "Ammaye Navvithe (Direction)". Fullhyd.com.
- ↑ "Ammaye Navvithe (Cast & Crew)". Spice Onion. Archived from the original on 2020-05-18. Retrieved 2020-07-23.
- ↑ "Ammaye Navvithe (Review)". The Cine Bay. Archived from the original on 2020-07-23. Retrieved 2020-07-23.
- ↑ "Ammaye Navvithe (Songs)". Cineradham. Archived from the original on 2020-07-23. Retrieved 2020-07-23.
ఇతర లంకెలు
[మార్చు]- 2001 సినిమాలు
- Album articles with non-standard infoboxes
- Album articles lacking alt text for covers
- తెలుగు సాంఘిక సినిమాలు
- జయసుధ నటించిన సినిమాలు
- రాజేంద్ర ప్రసాద్ నటించిన సినిమాలు
- బ్రహ్మానందం నటించిన సినిమాలు
- యం.యం.శ్రీలేఖ సంగీతం అందించిన సినిమాలు
- తెలుగు ప్రేమకథా సినిమాలు
- రంగనాథ్ నటించిన సినిమాలు
- ఆహుతి ప్రసాద్ నటించిన సినిమాలు
- ఎం.ఎస్.నారాయణ నటించిన సినిమాలు
- ఎల్. బి. శ్రీరాం నటించిన సినిమాలు
- రమాప్రభ నటించిన సినిమాలు
