ఆలపాటి లక్ష్మి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆలపాటి లక్ష్మి

ఆలపాటి లక్ష్మి ప్రముఖ రంగస్థల, సినిమా, ధారావాహిక నటి.

జననం[మార్చు]

1952, ఫిబ్రవరి 19ఏలూరు లో జన్మించారు.

రంగస్థల ప్రస్థానం[మార్చు]

పదమూడవ ఏటనే రంగస్థల ప్రవేశం చేసి వేలాది ప్రదర్శనలు ఇచ్చారు. విశాఖపట్టణం లో నివాసం ఉంటూ ఆంధ్రప్రదేశ్ లోని అన్ని పరిషత్తులలో పాల్గొని ఉత్తమనటిగా వందలాది బహుమతలు గెలుచుకున్నారు.

మిశ్రో, ఎం.వి.ఎస్.హరనాథరావు, కె. వెంకటేశ్వరరావు, ఎ.ఆర్.కృష్ణ, కె.ఎస్.టి. సాయి, చాట్ల శ్రీరాములు వంటి ఎంతో మంది దర్శకత్వంలో నటనకు మెరుగులు దిద్దుకున్నారు.

నటించినవి[మార్చు]

నాటకాలు

  • జగన్నాధ రథచక్రాలు
  • ఓ బూతు నాటకం
  • క్షీరసాగర మథనం
  • డియర్ ఆడియన్స్
  • సిన్సియర్లీ యువర్స్
  • మరో మొహంజదారో
  • అనగనగా ఒక అమ్మాయి

నాటికలు

  • అమ్మ
  • లేడిపంజా
  • ది గేమ్

పద్య నాటకాలు

  • రాణాప్రతాప్
  • జనమేజయం

సినిమారంగం[మార్చు]

పురస్కారాలు[మార్చు]

  1. రాష్ట్రస్థాయి కందుకూరి పురస్కారం - ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర టీవీ అభివృద్ధి సంస్థ, ఆంధ్రప్రదేశ్[1]

ఇతరములు[మార్చు]

ఆకాశవాణిలో ‘ఎ’ గ్రేడ్ ఆర్టిస్ట్ గా అనేక నాటకాలలో పాల్గొన్నారు. సినిమాలలో, టి.వి. సీరియళ్లలో ప్రముఖ పాత్రలు పోషించారు.

మూలాలు[మార్చు]

  • వెబ్ ఆర్కైవ్, ఈనాడు, తాజా వార్తలు (16 April 2018). "కందుకూరి రంగస్థల అవార్డులు ప్రకటన". Retrieved 16 April 2018. Cite news requires |newspaper= (help)