Jump to content

భావన (కన్నడ నటి)

వికీపీడియా నుండి
భావన రామన్న
ప్రెస్ మీట్ లో భావన
జననం
నందిని రామన్న

వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1996 – ప్రస్తుతం

నందిని రామన్న భారతీయ నటి. ఆమె భావనగా బాగా ప్రసిద్ది చెందింది. ఆమె ప్రధానంగా కన్నడ చిత్రాలలో నటిస్తుంది. భరతనాట్య నృత్యకారిణి కూడా అయిన ఆమె మూడు కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డులను అందుకుంది. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదుచేసుకున్న శాంతి అనే చిత్రంలో ఆమె నటించింది.

2001లో ఆమె అమ్మాయి నవ్వితే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.

కెరీర్

[మార్చు]

నందిని రామన్న పేరును భావనగా సినీ దర్శకుడు కోడ్లు రామకృష్ణ మార్చాడు. ఆమె తుళు చిత్రం మారిబలేతో తన సినీ రంగ ప్రవేశం చేసింది. నంబర్ 1 అనే కన్నడ చిత్రంలో ఆమె పోలీస్ పాత్రతో అందరిని ఆలరించిన కారణంగా ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి. తరువాత ఆమె నటించిన నీ ముడిద మలిగే చిత్రంతో మరింత నటనానుభవం గడించింది.

నర్తకి, నటిగానే కాకుండా భావన సినిమా దర్శకురాలిగా కూడా పనిచేసింది. డ్యాన్స్, మ్యూజిక్ షోలను నిర్వహించే ప్రొడక్షన్ హౌస్ హోమ్‌టౌన్ ప్రొడక్షన్స్‌కి ఆమె డైరెక్టర్ గా వ్యవహరిస్తోంది.

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ తరపున 2014 ఎన్నికల్లో పోటీచేసిన ఆమె 2013 ఎన్నికల సమయంలో ప్రచారకర్తగా కూడా పనిచేసింది. ఆమె శాసన మండలికి నామినేట్ అయింది.

ఫిల్మోగ్రఫీ

[మార్చు]
Year Film Role Language Notes
1996 మరిబలే తుళు
1997 నీ ముడిదా మల్లిగే కన్నడ విజేత, ఉత్తమ సహాయ నటిగా కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డు
1999 నం.1 కన్నడ
1999 చంద్రముకి ప్రాణసఖి కన్నడ
1999 దేవేరి కన్నడ
1999 అన్బుల్లా కధలుక్కు తమిళం
2000 దీపావళి కన్నడ
2001 యెల్లార మనే దోసెను కన్నడ
2001 నచ్చత్ర కాదల్ తమిళం
2001 కురిగాలు సార్ కురిగాలు కన్నడ
2001 రాష్ట్రగీతే కన్నడ
2001 అమ్మాయే నవ్వితే తెలుగు
2002 పర్వ కన్నడ
2002 నిన్నుగాగి కన్నడ ప్రత్యేక ప్రదర్శన
2002 క్షమా కన్నడ ఉత్తమ నటిగా కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డు గెలుచుకుంది
2002 చెల్వి కన్నడ
2003 తప్పు సంఖ్య కన్నడ
2003 హలో కన్నడ
2003 ఆహా ఎతనై అజగు తమిళం
2003 ప్రీతి ప్రేమ ప్రణయ కన్నడ
2004 శాంతి కన్నడ
2004 సాగరి కన్నడ
2004 భగవాన్ కన్నడ
2006 కుటుంబం హిందీ
2008 ఇంతి నిన్న ప్రీతియా కన్నడ
2010 విముక్తి కన్నడ
2010 ఆప్తరక్షకుడు కన్నడ
2012 చింగారి కన్నడ
2012 భాగీరథి కన్నడ ఉత్తమ నటిగా కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డు గెలుచుకుంది
2014 క్రేజీ స్టార్ కన్నడ
2016 నిరుత్తర కన్నడ

టెలివిజన్

[మార్చు]
  • గోద్రెజ్ గేమ్ ఆడి
  • లైఫ్ చేంజ్ మాడి[1]
  • రామాచారి

మూలాలు

[మార్చు]
  1. "Television beckons Bhavana". Daily News & Analysis. Retrieved 15 March 2013.