మేరా భారత్ మహాన్
మేరా భారత్ మహాన్ | |
---|---|
దర్శకత్వం | భరత్ |
నిర్మాత | డాక్టర్ శ్రీధర్ రాజు , డాక్టర్ తాళ్ల రవి , డాక్టర్ పల్లవి రెడ్డి |
తారాగణం | అఖిల్ కార్తీక్ , ప్రియాంక శర్మ , డాక్టర్ శ్రీధర్ రాజు |
ఛాయాగ్రహణం | ముజీర్ మాలిక్ |
కూర్పు | మేనగ శ్రీను |
సంగీతం | లలిత్ సురేష్ |
నిర్మాణ సంస్థ | ప్రథ ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 26 ఏప్రిల్ 2019 |
సినిమా నిడివి | 132 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
మేరా భారత్ మహాన్ 2019లో విడుదలైన తెలుగు సినిమా. ప్రథ ప్రొడక్షన్స్ బ్యానర్ పై డా. శ్రీధర్ రాజు ఎర్ర, డా. తాళ్ల రవి, డా. టిపిఆర్ నిర్మించిన ఈ సినిమాకు భరత్ దర్శకత్వం వహించాడు. అఖిల్ కార్తీక్, ప్రియాంకాశర్మ , తణికెళ్ల భరణి, పోసాని కృష్ణ మురళి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఏప్రిల్ 26, 2019 న విడుదలైంది.
చిత్ర నిర్మాణం
[మార్చు]మేరా భారత్ మహాన్ సినిమా షూటింగ్ 29 నవంబర్ 2017న హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభించారు.[1] ఈ సినిమా ఆడియోను 21 జులై 2018న హన్మకొండ ములుగు రోడ్ లోని వజ్ర గార్డెన్స్ లో ఎమ్మెల్యే బాబూమోహన్, వరంగల్ మేయర్ నన్నపనేని నరేందర్ విడుదల చేశారు.[2]
కథ
[మార్చు]మహాన్ (శ్రీధర్‌రాజు) ఓ ప్రొఫెసర్. ఆయన భార్య ఆమని. ఓ కుమార్తె. హాయిగా సాగిపోతున్న వారి జీవితంలో జరిగిన ఓ సంఘటన సమాజంపై తిరుగుబాటు చేసేలా చేస్తుంది. అస్తవ్యస్తంగా ఉన్న పాలకులన్ని ఎండగట్టడంతోపాటు అవసరమైతే శిక్షించడం చేస్తుంటాడు. అతని భావాలకు కొంతమంది యువత ఆకర్షితులవుతారు. ఓ దశలో అఖిల్ కార్తిక్ అనే యువకుడిపై మహాన్ పెద్ద బాధ్యత పెడతాడు. ఆ తర్వాత ఏమయింది? కథ ఎటువైపు తిరిగింది? అనేది మిగతా సినిమా కథ.
నటీనటులు
[మార్చు]- అఖిల్ కార్తీక్
- ప్రియాంకాశర్మ
- బాబు మోహన్
- గిరిబాబు
- శ్రీధర్‌రాజు
- ఆమని
- తనికెళ్ళ భరణి
- పోసాని కృష్ణ మురళి
- సాయిచంద్
- విజయ్‌చందర్
- సుమన్ శెట్టి
- ఎల్. బి. శ్రీరాం
- సన
- ప్రగతి
- జయప్రకాశ్ రెడ్డి
- సురేఖావాణి
- ఝాన్సీ
- అనితా చౌదరి
- అపూర్వ
- దాసన్న
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: ప్రథ ప్రొడక్షన్స్
- నిర్మాతలు:డా.శ్రీధర్ రాజు ఎర్ర, డా.తాళ్ల రవి, డా. టిపిఆర్
- కథ: డా.శ్రీధర్ రాజు ఎర్ర
- స్క్రీన్ ప్లే, దర్శకత్వం: భరత్
- సంగీతం: లలిత్ సురేష్
- పాటలు:చంద్రబోస్, పెద్దాడమూర్తి, చిలకరెక్క గణేష్
- సినిమాటోగ్రఫీ: ముజీర్ మాలిక్
- ఎడిటర్: మేనగ శ్రీను
- ఫైట్స్: విజయ్
- ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సోమర్తి సాంబేష్
- కొరియోగ్రాఫర్స్: స్వర్ణ, దిలీప్
మూలాలు
[మార్చు]- ↑ Vaartha (29 November 2017). "`మేరా భారత్ మహాన్` షూటింగ్ ప్రారంభం!". Archived from the original on 11 ఆగస్టు 2021. Retrieved 11 August 2021.
- ↑ Mana Telangana (23 July 2018). "డబ్బున్న వాళ్లకే విద్య, వైద్యం". Archived from the original on 11 ఆగస్టు 2021. Retrieved 11 August 2021.