నన్నపునేని నరేందర్
స్వరూపం
(నన్నపనేని నరేందర్ నుండి దారిమార్పు చెందింది)
నన్నపునేని నరేందర్ | |||
| |||
పదవీ కాలం 2018 - ప్రస్తుతం | |||
నియోజకవర్గం | వరంగల్(తూర్పు) శాసనసభ నియోజకవర్గం | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 5 ఆగష్టు 1972 | ||
రాజకీయ పార్టీ | భారత్ రాష్ట్ర సమితి | ||
తల్లిదండ్రులు | నర్సింహమూర్తి , కాంతమ్మ | ||
జీవిత భాగస్వామి | వాణి | ||
సంతానం | లోకేష్ పటేల్, మనుప్రీత్ పటేల్ |
నన్నపునేని నరేందర్, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి పార్టీ తరపున వరంగల్(తూర్పు) శాసనసభ నియోజకవర్గ శాసన సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[1] ఈయన 2016 మార్చి 15 నుంచి 2018 డిసెంబర్ 24 వరకు వరంగల్ మహానగర పాలక సంస్థ (జీడబ్ల్యూఎంసీ) మేయర్‌గా పనిచేశాడు.[2]
జననం
[మార్చు]నరేందర్ 1972, ఆగస్టు 5న నర్సింహమూర్తి - కాంతమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ లో జన్మించాడు. ఇంటర్మీడియట్ వరకు చదివాడు.[3]
వ్యక్తిగత జీవితం
[మార్చు]నరేందర్ కు మెహర్ వాణితో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు (లోకేష్ పటేల్, మనుప్రీత్ పటేల్) ఉన్నారు.
రాజకీయ విశేషాలు
[మార్చు]2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వద్దిరాజు రవీంద్ర పై 28,782 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[4][5]
రాజకీయ జీవితం
[మార్చు]- 1995 తెలుగుదేశం పార్టీలో చేరాడు ... కల్పలత సూపర్‌బజార్ డైరక్టర్‌గా ఎన్నిక
- 1997లో టీడీపీ డివిజన్ కార్యదర్శి, డివిజన్ అధ్యక్షుడు
- 2004 టీడీపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు
- 2005లో గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ కార్పోరేటర్‌గా ఎన్నికయ్యాడు
- 2008లో టీడీపీ జిల్లా ఉపాధ్యక్ష్యుడు
- 2009లో టీఆర్‌ఎస్‌లో చేరాడు
- 2010 ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ నగర అధ్యక్షుడు
- 2011లో ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు
- 2012లో తెలంగాణ మజ్దూర్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు
- 2014లో టీఆర్‌ఎస్ గ్రేటర్ అధ్యక్షుడు
- 2016లో వరంగల్ మేయర్ [6]
- 2018లో వరంగల్(తూర్పు) శాసనసభ నియోజకవర్గ శాసన సభ్యుడు గా గెలిచాడు[7]
మూలాలు
[మార్చు]- ↑ Telangana Legislature (2018). "Member's Profile - Telangana-Legislature". Archived from the original on 13 జూలై 2021. Retrieved 13 July 2021.
- ↑ "TRS's Narendar elected as Warangal Mayor". Business Standard. 15 March 2016. Archived from the original on 5 ఆగస్టు 2021. Retrieved 5 August 2021.
- ↑ Eenadu (17 November 2023). "ప్రధాన అభ్యర్థులు విద్యావంతులే". Archived from the original on 17 November 2023. Retrieved 17 November 2023.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2018-12-12. Retrieved 2019-06-01.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-06-01. Retrieved 2019-06-01.
- ↑ The Hindu (16 March 2016). "Nannapuneni Narender elected Warangal Mayor" (in Indian English). Archived from the original on 6 ఆగస్టు 2021. Retrieved 6 August 2021.
- ↑ telugu, NT News (22 August 2023). "వరంగల్ ఉమ్మడి జిల్లా బరిలో వీరే.. బీఆర్‌ఎస్ అభ్యర్థుల బయోడేటా." www.ntnews.com. Archived from the original on 14 April 2024. Retrieved 14 April 2024.
వర్గాలు:
- CS1 Indian English-language sources (en-in)
- తెలంగాణ రాష్ట్ర సమితి రాజకీయ నాయకులు
- తెలంగాణ శాసన సభ్యులు (2018)
- 1972 జననాలు
- వరంగల్లు జిల్లా వ్యక్తులు
- వరంగల్లు గ్రామీణ జిల్లా రాజకీయ నాయకులు
- వరంగల్లు గ్రామీణ జిల్లా వ్యక్తులు
- వరంగల్లు గ్రామీణ జిల్లా ఉద్యమకారులు
- జీవిస్తున్న ప్రజలు
- పార్టీలు ఫిరాయించిన రాజకీయ నాయకులు