Jump to content

నన్నపునేని నరేందర్

వికీపీడియా నుండి
నన్నపునేని నరేందర్‌
నన్నపునేని నరేందర్


పదవీ కాలం
2018 - ప్రస్తుతం
నియోజకవర్గం వరంగల్(తూర్పు) శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 5 ఆగష్టు 1972
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు నర్సింహమూర్తి , కాంతమ్మ
జీవిత భాగస్వామి వాణి
సంతానం లోకేష్‌ పటేల్, మనుప్రీత్ పటేల్

నన్నపునేని నరేందర్‌, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి పార్టీ తరపున వరంగల్(తూర్పు) శాసనసభ నియోజకవర్గ శాసన సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[1] ఈయన 2016 మార్చి 15 నుంచి 2018 డిసెంబర్ 24 వరకు వరంగల్ మహానగర పాలక సంస్థ (జీడబ్ల్యూఎంసీ) మేయర్‌గా పనిచేశాడు.[2]

జననం

[మార్చు]

నరేందర్ 1972, ఆగస్టు 5న నర్సింహమూర్తి - కాంతమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ లో జన్మించాడు. ఇంటర్మీడియట్ వరకు చదివాడు.[3]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

నరేందర్ కు మెహర్ వాణితో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు (లోకేష్‌ పటేల్, మనుప్రీత్ పటేల్) ఉన్నారు.

రాజకీయ విశేషాలు

[మార్చు]

2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వద్దిరాజు రవీంద్ర పై 28,782 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[4][5]

రాజకీయ జీవితం

[మార్చు]
  • 1995 తెలుగుదేశం పార్టీలో చేరాడు ... కల్పలత సూపర్‌బజార్ డైరక్టర్‌గా ఎన్నిక
  • 1997లో టీడీపీ డివిజన్ కార్యదర్శి, డివిజన్ అధ్యక్షుడు
  • 2004 టీడీపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు
  • 2005లో గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ కార్పోరేటర్‌గా ఎన్నికయ్యాడు
  • 2008లో టీడీపీ జిల్లా ఉపాధ్యక్ష్యుడు
  • 2009లో టీఆర్‌ఎస్‌లో చేరాడు
  • 2010 ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ నగర అధ్యక్షుడు
  • 2011లో ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు
  • 2012లో తెలంగాణ మజ్దూర్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు
  • 2014లో టీఆర్‌ఎస్ గ్రేటర్ అధ్యక్షుడు
  • 2016లో వరంగల్ మేయర్ [6]
  • 2018లో వరంగల్(తూర్పు) శాసనసభ నియోజకవర్గ శాసన సభ్యుడు గా గెలిచాడు[7]

మూలాలు

[మార్చు]
  1. Telangana Legislature (2018). "Member's Profile - Telangana-Legislature". Archived from the original on 13 జూలై 2021. Retrieved 13 July 2021.
  2. "TRS's Narendar elected as Warangal Mayor". Business Standard. 15 March 2016. Archived from the original on 5 ఆగస్టు 2021. Retrieved 5 August 2021.
  3. Eenadu (17 November 2023). "ప్రధాన అభ్యర్థులు విద్యావంతులే". Archived from the original on 17 November 2023. Retrieved 17 November 2023.
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2018-12-12. Retrieved 2019-06-01.
  5. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-06-01. Retrieved 2019-06-01.
  6. The Hindu (16 March 2016). "Nannapuneni Narender elected Warangal Mayor" (in Indian English). Archived from the original on 6 ఆగస్టు 2021. Retrieved 6 August 2021.
  7. telugu, NT News (22 August 2023). "వరంగల్‌ ఉమ్మడి జిల్లా బరిలో వీరే.. బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల బయోడేటా." www.ntnews.com. Archived from the original on 14 April 2024. Retrieved 14 April 2024.