Jump to content

కృతి శెట్టి

వికీపీడియా నుండి
కృతి శెట్టి
జననం (2003-09-21) 2003 సెప్టెంబరు 21 (వయసు 21)[1]
వృత్తిసినీ నటి
క్రియాశీల సంవత్సరాలు2019 – ప్రస్తుతం

కృతి శెట్టి భారతీయ చలనచిత్ర నటి. ఆమె తొలిసారిగా 2021 తెలుగు సినిమా "ఉప్పెన"[2] ద్వారా సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆమె తెలుగులో రెండో సినిమా నాని హీరోగా నటించిన "శ్యామ్‌ సింగరాయ్‌"‌ లో, మూడవ సినిమా నాగచైతన్య హీరోగా నటించిన 'బంగార్రాజు' లో నటించింది.[3] కృతిశెట్టి హీరోయిన్‌గా నటించిన తొలి మూడు చిత్రాలూ వరుసగా విజయం సాధించడంతో ఆమె హ్యాట్రిక్‌ హీరోయిన్‌గా తెలుగుసిని రంగంలో రికార్డు క్రియేట్‌ చేసింది.[4]

జననం

[మార్చు]

కృతి శెట్టి‌ 2003 సెప్టెంబరు 21లో కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరులో జన్మించింది. ఆమె నాన్న పేరు కృష్ణ శెట్టి, నీతి శెట్టి. కృతి చిన్ననాటి నుండే ఐడియా, షాప్పర్స్ స్టాప్, పార్లే, లైఫ్ బాయ్, బ్లూ స్టార్ వంటి సంస్థల యాడ్స్ లో నటించింది. కృతి శెట్టి చదువు అనంతరం అప్పుడ‌ప్పుడే మోడ‌లింగ్ మొద‌లు పెట్టిన ఆమెకు హిందీలో 2019లో హృతిక్ రోషన్ హీరోగా వచ్చిన 'సూపర్ 30' సినిమాలో విద్యార్థిగా నటించే అవకాశం వచ్చింది.[5][6]

నటించిన చిత్రాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర భాష ఇతర వివరాలు మూలాలు
2019 సూపర్ 30 హిందీ
2021 ఉప్పెన సంగీత "బేబమ్మ" తెలుగు హీరోయిన్ గా తొలి చిత్రం
శ్యామ్‌ సింగరాయ్‌ కీర్తి తెలుగు
2022 బంగార్రాజు నాగలక్ష్మి తెలుగు
ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి తెలుగు
ది వారియర్ విజిల్‌ మహాలక్ష్మి[7] తెలుగు
తమిళ్
మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం తెలుగు [8]
2023 కస్టడీ తెలుగు \ తమిళ్[9]
2024 మనమే తెలుగు
ఎఆర్‌ఎం మలయాళం

మూలాలు

[మార్చు]
  1. "Krithi Shetty Birthday Special: Unseen Photos of the 'Uppena' actress". The Times of India. 2020-09-21. Retrieved 20 April 2021.
  2. TV9 Telugu (9 March 2020). "'ధక్ ధక్ ధక్'.. ఎంతో కొత్తగా.. డీఎస్పీ నువ్వు కేక..!". Archived from the original on 20 April 2021. Retrieved 20 April 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. TV9 Telugu, TV9 (5 January 2021). "Uppena Fame Krithi Shetty: మొదటి సినిమా విడుదల కాకుండానే మంచి ఆఫర్స్ అందుకుంటున్న కృతి లక్కీ ఛామ్ - Uppena Fame Krithi". Archived from the original on 20 April 2021. Retrieved 20 April 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. Prajasakti (17 January 2022). "హ్యాట్రిక్‌ హీరోయిన్‌!". Archived from the original on 18 January 2022. Retrieved 18 January 2022.
  5. News18 Telugu (23 February 2021). "Krithi Shetty: ఉప్పెనలో నటించకముందు హృతిక్ రోషన్ మూవీలో క‌నిపించిన‌ కృతి.. ఏ సినిమానో తెలుసా". Archived from the original on 19 April 2021. Retrieved 20 April 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  6. Telangana Today (9 February 2021). "'Felt proud working on Uppena'". Archived from the original on 24 April 2021. Retrieved 24 April 2021.
  7. Prajasakti (14 February 2022). "'విజిల్‌ మహాలక్ష్మి' పాత్రలో కృతిశెట్టి". Archived from the original on 16 February 2022. Retrieved 16 February 2022.
  8. "Nithiin- Krithi Shetty starrer titled Macherla Niyojakavargam - Moviezupp" (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-09-10. Retrieved 2022-07-16.
  9. "Naga Chaitanya and Krithi Shetty starrer Custody shoot wraps up; Actor shares BTS video from the sets". Pinkvilla. Archived from the original on 26 ఫిబ్రవరి 2023. Retrieved 26 February 2023.
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.