ఉప్పెన (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉప్పెన
సినిమా పోస్టర్
దర్శకత్వంబుచ్చిబాబు సానా
రచనబుచ్చిబాబు సానా
నిర్మాతన‌వీన్ ఎర్నేని, వై. ర‌విశంక‌ర్
తారాగణంవైష్ణవ్‌ తేజ్‌, కృతి శెట్టి,విజయ్​ సేతుపతి
ఛాయాగ్రహణంషమ్‌దత్ సైనూదీన్
కూర్పునవీన్ నూలి
సంగీతందేవి శ్రీ ప్రసాద్
నిర్మాణ
సంస్థలు
మైత్రి మూవీ మేకర్స్
సుకుమార్ రైటింగ్స్
విడుదల తేదీ
12 ఫిబ్రవరి 2021 (2021-02-12)
సినిమా నిడివి
147 నిమిషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు
బాక్సాఫీసుest. 84 కోట్లు [1]

ఉప్పెన 2021 లో విడుదలైన తెలుగు సినిమా. సుకుమార్ రైటింగ్స్, మైత్రి మువీ మేకర్స్ లు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు సానా బుచ్చిబాబు దర్శకత్వం వహించాడు.[2] ఈ చిత్రం ద్వారా పంజా వైష్ణవ్ తేజ్, కృతుశెట్టిలు పరిచయమయ్యారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.[3] ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతాన్నందించాడు.[4] ఈ సినిమా 14 ఏప్రిల్ 2021న నెట్‌ఫ్లిక్స్‌ విడుదలైంది.[5][6]

69వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్‌లో ఈ సినిమా జాతీయ ఉత్తమ తెలుగు సినిమాగా జాతీయ అవార్డుకు ఎంపికయింది.[7]

తారాగణం

[మార్చు]

ఆశీ (వైష్ణవ్ తేజ్) ఉప్పాడ గ్రామంలోని మత్య్సకార కుటుంబానికి చెందిన సాధారణ యువకుడు.తండ్రి చేసే చేపల వ్యాపారానికి సహాయం చేస్తూ ఉంటాడు. ఉప్పాడ గ్రామానికి గ్రామ పెద్ద, రాయణం (విజయ సేతుపతి) తన కూతురు బేబమ్మ అలియాస్‌ సంగీత (కృతి శెట్టి). ఆశీ (వైష్ణవ్ తేజ్)చిన్నప్పటి నుంచి బేబమ్మను ప్రేమిస్తుంటాడు. కానీ ఈ విషయం బేబమ్మకు తెలియదు. మరోవైపు రాయణానికి పరువు అంటే ప్రాణం. పరువు కోసం ఎంతటి దారుణానికికైనా పాల్పడుతాడు.తన కూతురు ఎక్కడ ప్రేమలో పడి తన పరువు తీస్తుందనే భయంతో కుర్రాళ్ల గాలి తగలకుండా ఉమెన్స్‌ కాలేజీలో జాయిన్‌ చదివిస్తాడు.తన కూతురు కోసం స్పెషల్‌గా గ్రామానికి ఓ బస్సును కూడా వేయిస్తాడు. అయినప్పటికీ కొన్ని కారణాల వల్ల బేబమ్మ ఆశీతో ప్రేమలో పడిపోతుంది. ఈ విషయం రాయణానికి తెలిసి తన కూతురు బేబమ్మను కట్టడి చేసే ప్రయత్నం చేస్తాడు. దీంతో బేబమ్మ ఆశీతో కలిసి లేచిపోతుంది.కానీ కొన్ని ఊహించని పరిణామాల రీత్యా కథ మరో విధంగా మలుపు తిరుగుతుంది. చివరకు ఈ జంట ఎలా ఒక్కటైందనేదే మిగతా కథ.[10][11]

సాంకేతిక వర్గం

[మార్చు]

సంగీతం-పాటలు

[మార్చు]
Original Motion Picture Track List
సం.పాటపాట రచయితSinger(s)పాట నిడివి
1."నీ కన్ను నీలి సముద్రం"శ్రీమణి, రకీబ్ అలంజావేద్ అలీ, శ్రీకాంత్ చంద్ర5:12
2."ధక్ ధక్ ధక్"చంద్రబోస్శరత్ సంతోష్, హరిప్రియ1:45
3."రంగులద్దుకున్నా"శ్రీమణియాసిన్ నిజార్, హరిప్రియ4:23
4."జలజల జలపాతం నువ్వు"శ్రీమణిశ్రేయా ఘోషాల్, జస్‌ప్రీత్ జాజ్4:13
5."ఈశ్వరా"చంద్రబోస్దేవిశ్రీ ప్రసాద్3:28
6."Sandram Lone Neerantha"దేవిశ్రీ ప్రసాద్Sean Roldan3:58
7."Ninne Naa Ninne"చంద్రబోస్Sameera Bharadwaj1:28
8."సిలకా సిలకా"శ్రీమణికైలాష్ ఖేర్3:26
మొత్తం నిడివి:27:09

మూలాలు

[మార్చు]
 1. https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/box-office/uppena-mints-rs-70-crore-in-first-week-vaishnav-tej-and-vijay-sethupathi-starrer-is-unstoppable/articleshow/81106896.cms
 2. "అఫీషియల్.. 'ఉప్పెన'లా వస్తోన్న వైష్ణవ్ తేజ్". Telugu Samayam. Retrieved 2019-08-22.
 3. "Panja Vaisshnav Tej's debut film titled Uppena". Indian Express. Retrieved 2019-08-13.
 4. Boy, Zupp (2021-02-12). "Uppena Review: Vaishnav Tej and Krithi Shetty starrer is Predictable but emotional". Moviezupp (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-02-13.
 5. NTV-Telugu News (14 April 2021). "నెట్ ఫ్లిక్స్ లో "ఉప్పెన"". NTV-Telugu News. Archived from the original on 18 మే 2021. Retrieved 18 May 2021.
 6. Andhrajyothy (2 July 2021). "టాలీవుడ్‌ రివ్యూ: కరోనా కాటేసిన ఆరు నెలల్లో!". andhrajyothy. Archived from the original on 2 జూలై 2021. Retrieved 2 July 2021.
 7. "National Awards 2023: జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్‌.. 69వ జాతీయ చలన చిత్ర అవార్డుల విజేతలు వీళ్లే". EENADU. 2023-08-24. Archived from the original on 2023-08-24. Retrieved 2023-08-24.
 8. https://www.youtube.com/watch?v=xzunlLhgcfs
 9. https://www.youtube.com/watch?v=mrqgz4_a4PU
 10. "'ఉప్పెన'మూవీ రివ్యూ". Sakshi. 2021-02-12. Retrieved 2021-02-12.
 11. "Uppena Movie Review in Telugu |" (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-02-12. Retrieved 2021-02-12.

బాహ్య లంకెలు

[మార్చు]
భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు
భారత జాతీయ చలనచిత్ర పురస్కారం : ఫీచర్ ఫిల్మ్స్
ఉత్తమ సినిమా|ఉత్తమ ప్రజాదరణ పొందిన సినిమా|ఉత్తమ నటుడు|ఉత్తమ నటి|ఉత్తమ సహాయ నటుడు|ఉత్తమ సహాయ నటి
ఉత్తమ కళా దర్శకుడు|ఉత్తమ బాల నటుడు|ఉత్తమ ఛాయా గ్రహకుడు|ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్|ఉత్తమ దర్శకుడు|ఉత్తమ స్క్రీన్ ప్లే
ఉత్తమ నృత్య దర్శకుడు|ఉత్తమ గీత రచయిత|ఉత్తమ సంగీత దర్శకుడు|ఉత్తమ నేపథ్య గాయకుడు|ఉత్తమ నేపథ్య గాయని
ఉత్తమ శబ్దగ్రహణం|ఉత్తమ కూర్పు|ఉత్తమ స్పెషల్ అఫెక్ట్స్|ఉత్తమ బాలల సినిమా|ఉత్తమ కుటుంబ కధా చిత్రం
ప్రత్యేక జ్యూరీ పురస్కారం|ఉత్తమ ఏనిమేషన్ సినిమా
ఉత్తమ అస్సామీ సినిమా|ఉత్తమ బెంగాలీ సినిమా|ఉత్తమ ఆంగ్ల సినిమా|ఉత్తమ హిందీ సినిమా
ఉత్తమ కన్నడ సినిమా|ఉత్తమ మళయాల సినిమా|ఉత్తమ మరాఠీ సినిమా
ఉత్తమ ఒరియా సినిమా|ఉత్తమ పంజాబీ సినిమా|ఉత్తమ కొంకణి సినిమా|ఉత్తమ మణిపురి సినిమా
ఉత్తమ తమిళ సినిమా|ఉత్తమ తెలుగు సినిమా
జాతీయ సినిమా పురస్కారం : విరమించిన పురస్కారాలు
ఉత్తమ ద్వితీయ సినిమా
ఇందిరా గాంధీ జాతీయ ఉత్తమ నూతన దర్శకుడు పురస్కారం
ఇందిరా గాంధీ పురస్కారం
నర్గీస్ దత్ జాతీయ ఉత్తమ సమైక్యత సినిమా పురస్కారం
నర్గీస్ దత్ పురస్కారం
జీవితకాల గుర్తింపు పురస్కారం
దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారము
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినీ విమర్శకుడు
ఉత్తమ సినీ విమర్శకుడు