బెజవాడ (సినిమా)
స్వరూపం
బెజవాడ (2011 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | వివేక్ కృష్ణ |
---|---|
నిర్మాణం | రాంగోపాల్ వర్మ |
కథ | రాంగోపాల్ వర్మ |
తారాగణం | నాగ చైతన్య అమలా పాల్ ప్రభు గణేశన్ |
నిర్మాణ సంస్థ | శ్రేయా ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
కథ
[మార్చు]శివకృష్ణ(నాగచైతన్య) కాలేజి స్టూడెంట్. శివకృష్ణ సిటీ కమీషనర్(ఆహుతి ప్రసాద్)కూతురు గీతాంజలి(అమలా పౌల్)ని ప్రేమిస్తాడు.శివకృష్ణ అన్నయ్య విజయ కృష్ణ(ముకుల్ దేవ్) విజయవాడ గాడ్ ఫాదర్ కాళి (ప్రభు)కి నమ్మిన బంటు.అయితే కాళికి తన తమ్ముడు శంకర్(అబిమన్యు సింగ్)కంటే కూడా విజయ కృష్ణ అంటేనే ఎంతో అభిమానం.దాంతో రగిలిపోయిన శంకర్ తన అన్న కాళిని,ఆ తర్వాత విజయకృష్ణని చంపేసి తనే గాడ్ ఫాధర్ అవుతాడు. అప్పుడు తన అన్నని చంపిన వారిపై పగ తీర్చుకోవటానికి శివకృష్ణ బయలుదేరుతాడు.తన ప్రతీకార ఎలా తీర్చుకున్నాడు అన్నది మిగిలిన కథ.[1]
తారాగణం
[మార్చు]- నాగచైతన్య (శివ కృష్ణ)
- అమలా పాల్ (గీతాంజలి)
- కోట శ్రీనివాసరావు (రమణ)
- బ్రహ్మానందం (స్కెచ్ గోపి)
- ప్రభు
- ముకుల్ దేవ్ (విజయ్ కృష్ణ)
- అజయ్
- అభిమన్యు సింగ్ (శంకర్ ప్రసాద్)
- సత్యప్రకాష్
- అంజనాసుఖాని
- శుభలేఖ సుధాకర్
- శ్రీకాంత్
- నవదీప్
- సుబ్బరాజు
- మురళీ శర్మ
- సుప్రీత్
పాటలు
[మార్చు]క్రమ సంఖ్య | పాటలు[2] | గాయకులు | సాహిత్యం |
---|---|---|---|
1 | దుర్గమ్మ కృష్ణమ్మా | జోజో నతానియేల్ | రెహ్మాన్ |
2 | అడగక నన్నేమి | జావేద్ ఆలీ, చంద్రాయీ భట్టాచార్య | కలువ సాయి |
3 | నిన్ను చూసిన | జావేద్ ఆలీ, శ్వేతా పండిట్ | సిరా శ్రీ |
4 | కొంటె చూపులు | హేమచంద్ర, గీతా మాధురి | రెహ్మాన్ |
5 | రమ్ము జిన్ను | దీప్తి చారి | సిరా శ్రీ |
6 | అలిగిరి నందిని | రవిశంకర్ | ఆది శంకరాచార్యులు |
7 | బేజా బేజా | జో జో నతానియేల్ | సిరా శ్రీ |
8 | లే లెగర | శ్రీకాంత్ | చైతన్య ప్రసాద్ |
మూలాలు
[మార్చు]- ↑ Srikanya (2011-12-01). "బలివాడ ('బెజవాడ' రివ్యూ)". telugu.filmibeat.com. Retrieved 2020-07-21.
- ↑ "ఆడియో రివ్యూ : పవర్ ఫుల్ ఎమోషన్స్ మెలోడి – 'బెజవాడ' |" (in అమెరికన్ ఇంగ్లీష్). 2011-11-09. Retrieved 2020-07-21.