ఎడిటర్ మోహన్
Jump to navigation
Jump to search
ఎడిటర్ మోహన్ | |
---|---|
జననం | మహమ్మద్ జిన్నా అబ్దుల్ ఖాదర్ |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 1960–ప్రస్తుతం |
పిల్లలు | 3 (మోహన్ రాజా, జయం రవి) |
ఎడిటర్ మోహన్ (మహమ్మద్ జిన్నా అబ్దుల్ ఖాదర్) సినిమా ఎడిటర్. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషా సినిమాలకు స్క్రీన్ ప్లే రచయిత, నిర్మాత, పంపిణీదారుడిగా కూడా పనిచేశాడు.[1][2] అతను ఎంఎం మూవీ ఆర్ట్స్, ఎంఎల్ మూవీ ఆర్ట్స్ నిర్మాణ సంస్థలను స్థాపించాడు.[3]
జననం
[మార్చు]ఎడిటర్ మోహన్ తమిళనాడు, తిరుమంగళం సమీపంలోని మధురైకి చెందిన తమిళ రౌథర్ కుటుంబంలో జన్మించాడు.[4]
వ్యక్తిగత జీవితం
[మార్చు]మోహన్ కు వరలక్ష్మితో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు మోహన్ రాజా సినిమా దర్శకుడుకాగా, చిన్న కుమారుడు జయం రవి సినిమా నటుడు, కుమార్తె రోజా దంత వైద్యురాలు.[5]
సినిమారంగం
[మార్చు]మోహన్ ఎడిటర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి సుమారు 200 సినిమాలకు పనిచేశాడు. 10 తెలుగు సినిమాలు, 5 తమిళ సినిమాలను నిర్మించాడు. 60 సినిమాలను తెలుగు నుండి తమిళంలోకి అనువాదం చేశాడు.[6]
పనిచేసిన సినిమాలు (కొన్ని)
[మార్చు]- అసిస్టెంట్ ఎడిటర్‌గా
- ఎల్లారమ్ ఇన్నాట్టు మన్నార్ (1960)
- అరసిలంకుమారి (1961)
- గురువును మించిన శిష్యుడు (1963)
- నవగ్రహ పూజ మహిమ (1964)
- అగ్గి పిడుగు (1964)
- చిక్కడు దొరకడు (1967)
- కదలడు వదలడు (1969)
- ఎడిటర్‌గా
- ప్లస్ వన్ +1 (2016)
- నిర్మాతగా
- మామగారు (1991)
- బావ బావమరిది (1993)
- శుభమస్తు (1995)
- హిట్లర్ (1997)
- మనసిచ్చి చూడు (1998)
- హనుమాన్ జంక్షన్ (2001)
- జయం (తమిళం, 2003)
- తిల్లలంగడి (2010)
- స్క్రీన్ రైటర్, ఎడిటింగ్ పర్యవేక్షణ
- బావ బావమరిది (1993)
- క్షేమంగా వెళ్ళి లాభంగా రండి (2000)
- షార్ట్ ఫిల్మ్ ప్రొడ్యూసర్
- ప్రెజెంటాక్జా (చిన్న)
మూలాలు
[మార్చు]- ↑ Rayudu, Sakhamuri Venkata (21 September 2020). ""I may not be a Telugu, but my heart lies here"". theleonews.com. Archived from the original on 7 August 2022. Retrieved 2023-02-19.
- ↑ Kumar, Arun (29 January 2021). "Jayam Ravi Wiki, Age, Family, Biography, Images". TamilGlitz. Archived from the original on 24 July 2021. Retrieved 2023-02-19.
- ↑ "பாசக்காரப் பசங்க மதுரைக்காரங்க!" [Lovable Madurai Boys!]. Ananda Vikatan. 14 September 2011. Archived from the original on 8 April 2014. Retrieved 2023-02-19.
- ↑ Kumar, Arun (29 January 2021). "Jayam Ravi Wiki, Age, Family, Biography, Images". TamilGlitz. Archived from the original on 24 July 2021. Retrieved 2023-02-21.
- ↑ "Jayam Ravi's parents turn writers". The Hindu. 24 November 2019. Archived from the original on 9 July 2022. Retrieved 2023-02-21.
- ↑ Rayudu, Sakhamuri Venkata (21 September 2020). ""I may not be a Telugu, but my heart lies here"". theleonews.com. Archived from the original on 7 August 2022. Retrieved 2023-02-21.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో ఎడిటర్ మోహన్ పేజీ