షేర్షా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
షేర్షా
Shershaah film poster.jpg
దర్శకత్వంవిష్ణువర్థన్‌
కథా రచయితసందీప్‌ శ్రీవాత్సవ
నిర్మాతయష్‌ జోహార్‌
కరణ్ జోహార్
అపూర్వ మెహతా
షబ్బీర్‌
అజయ్‌ షా
హిమాన్షు గాంధీ
తారాగణంసిద్ధర్థ్ మల్హోత్రా
కియారా అడ్వాణీ
ఛాయాగ్రహణంకమల్‌జీత్‌ నేగి
కూర్పుఅక్కినేని శ్రీకర్ ప్రసాద్
సంగీతంనేపథ్య సంగీతం:
జాన్‌ స్టీవర్ట్‌ ఎడురి
పాటలు
తనిష్‌బాగ్చి
బి ప్రాక్‌
జానీ
జస్లీన్‌ రాయల్‌
జావేద్‌ మోషిన్‌
విక్రమ్‌ మంత్రోస్
నిర్మాణ
సంస్థలు
ధర్మ ప్రొడక్షన్స్
కాష్ ఎంట‌ర్‌టైన్‌మెంట్
పంపిణీదారుఅమెజాన్‌ ప్రై
విడుదల తేదీ
2021 ఆగస్టు 12 (2021-08-12)
సినిమా నిడివి
135 నిమిషాలు
దేశం భారతదేశం
భాషహిందీ

షేర్షా 2021లో విడుదలైన హిందీ సినిమా. ధర్మ ప్రొడక్షన్స్, కాష్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై యష్‌ జోహార్‌, కరణ్‌ జోహార్‌, అపూర్వ మెహతా, షబ్బీర్‌, అజయ్‌ షా, హిమాన్షు గాంధీ నిర్మించిన ఈ సినిమాకు విష్ణువర్థన్‌ దర్శకత్వం వహించాడు. సిద్ధార్థ్‌ మల్హోత్రా, కియారా అడ్వాణీ, శివ్‌ పండిట్‌, నిఖిత్‌ ధీర్, హిమాన్షో, అనిల్‌ చరణ్‌జీత్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను జులై 25,[1] 2021న విడుదల చేసి, 12 ఆగష్టు 2021న అమెజాన్‌ ప్రైమ్‌లో సినిమాను విడుదల చేశారు.ఈ సినిమా పరమ్‌ వీర్‌ చక్ర అవార్డు పొందిన కెప్టెన్‌ విక్రమ్‌ భాత్రా జీవిత కథ ఆధారంగా నిర్మించారు.

కథ[మార్చు]

విక్రమ్‌ బాత్రా (సిద్ధార్థ్‌ మల్హోత్రా) చిన్నతనం నుంచే ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలనీ కలలు కంటూ అందుకు సిద్ధమవుతుంటాడు. ఈ క్రమంలోనే ఆయన డింపుల్ (కియారా అద్వానీ)తో ప్రేమలో పడతాడు. వారి పెళ్లికి డింపుల్ తండ్రి అడ్డుపడతాడు. ఆర్మీలో చేరాలనే తన కల కోసం ప్రేమను పక్కకు పెట్టి సైన్యంలో చేరతాడు. ఆర్మీ బెటాలియన్‌ లో చేరాక కార్గిల్‌ యుద్ధంలో పాల్గొనాల్సి వస్తుంది. అప్పుడు విక్రమ్‌ శత్రు సైన్యంతో ఎలా పోరాడాడు? భారత జాతీయ జెండాను సగర్వంగా ఎగిరేలా చేసేందుకు విక్రమ్ చేసిన త్యాగం ఏంటి? చివరకు విక్రమ్ కథ ఎలా ముగిసింది? విక్రమ్ తన ప్రేమను పొందాడా ? లేదా ? అనేదే మిగతా సినిమా కథ.[2]

నటీనటులు[మార్చు]

 • సిద్ధార్థ్‌ మల్హోత్రా
 • కియారా అడ్వాణీ
 • శివ్‌ పండిట్‌
 • నిఖిత్‌ ధీర్
 • హిమాన్షో
 • అనిల్‌ చరణ్‌జీత్‌
 • రుక్మన్ ఖన్నా
 • శతాఫ్ ఫిగర్
 • సాహిల్ వైద్
 • రాజ్ అర్జున్
 • అంకిత గోరయ
 • రాకేష్ దుబె
 • అభిరోయ్ సింగ్
 • ప్రణయ్ సింగ్ పచౌరి
 • రహాయో
 • పవన్ చోప్రా
 • మీర్ సర్వార్

సాంకేతిక నిపుణులు[మార్చు]

 • బ్యానర్: ధర్మ ప్రొడక్షన్స్, కాష్ ఎంట‌ర్‌టైన్‌మెంట్
 • నిర్మాతలు: యష్‌ జోహార్‌, కరణ్‌ జోహార్‌, అపూర్వ మెహతా, షబ్బీర్‌, అజయ్‌ షా, హిమాన్షు గాంధీ
 • కథ, స్క్రీన్ ప్లే: సందీప్‌ శ్రీవాత్సవ
 • దర్శకత్వం: విష్ణువర్థన్‌
 • సంగీతం: తనిష్‌బాగ్చి
  బి ప్రాక్‌
  జానీ
  జస్లీన్‌ రాయల్‌
  జావేద్‌ మోషిన్‌
  విక్రమ్‌ మంత్రోస్
 • సినిమాటోగ్రఫీ: కమల్‌జీత్‌ నేగి

మూలాలు[మార్చు]

 1. EENADU (26 July 2021). "కార్గిల్‌ వార్‌ హీరో కథ.. ట్రైలర్‌ వచ్చేసింది". Archived from the original on 13 ఆగస్టు 2021. Retrieved 13 August 2021. Check date values in: |archivedate= (help)
 2. Eenadu (12 August 2021). "రివ్యూ: షేర్షా". Archived from the original on 13 ఆగస్టు 2021. Retrieved 13 August 2021. Check date values in: |archivedate= (help)
"https://te.wikipedia.org/w/index.php?title=షేర్షా&oldid=3316492" నుండి వెలికితీశారు