Jump to content

అడూర్ గోపాలక్రిష్ణన్

వికీపీడియా నుండి
అడూర్ గోపాలక్రిష్ణన్
అడూర్ గోపాలక్రిష్ణన్
జననం
మౌతట్టు గోపాలక్రిష్ణన్ ఉన్నిథాన్

(1941-07-03) 1941 జూలై 3 (వయసు 83)
పల్లిక్కల్, అడూర్, ట్రావెంకోర్, బ్రిటిష్ ఇండియా
ఇతర పేర్లుAdoor
వృత్తిDirector, Screenwriter, Producer
క్రియాశీల సంవత్సరాలు1965 – present
తల్లిదండ్రులుMadhavan Unnithan, Gauri Kunjamma
పురస్కారాలుBest Director,
1973 Swayamvaram,
1985 Mukhamukham,
1988 Anantharam,
1990 Mathilukal,
Best Film,
1973 Swayamvaram,
1996 Kathapurushan,
Best Screenwriter,
1985 Mukhamukham
,1988 Anantharam
వెబ్‌సైటుhttp://www.adoorgopalakrishnan.com

మౌతట్టు "అడూర్" గోపాలక్రిష్ణన్ ఉన్నిథాన్ (జననం 1941 జూలై 3) జాతీయ అవార్డు పొందిన భారతీయ చలన చిత్ర దర్శకుడు, స్క్రిప్ట్ రచయిత, నిర్మాత. మలయాళం సినిమా పరిశ్రమలోని విప్లవాత్మక మార్పులలో అతని పాత్ర ఉంది. అతని మొదటి సినిమా స్వయంవరం (1972) కేరళ సినిమా ఉద్యమంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఇతని సినిమాలలో ఎక్కువ భాగం ప్రపంచ వ్యాప్తంగా చిత్రోత్సవాలకి వెళుతూ వుంటాయి. స్వయంవరం నుండి ఓరు పెన్నుం రాన్డానుం వరకు అతను దర్శకత్వం వహించిన పదకొండు సినిమాలూ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో ప్రదర్శింపబడ్డాయి. అతనికి అనేక జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలను సంపాదించిపెట్టాయి. అతను పదిహేనుసార్లు జాతీయ చలనచిత్ర అవార్డులు, పదిహేడుసార్లు కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు, అనేక అంతర్జాతీయ చలనచిత్ర అవార్డులు గెలుచుకున్నాడు. ఎలిప్పట్టయానికి గాను అతను ప్రసిద్ధ బ్రిటిష్ ఫిలిం ఇనిస్టిట్యూట్ అవార్డును గెలుచుకున్నాడు. అడూర్ 1984లో పద్మశ్రీ , 2006లో పద్మ విభూషణ్ పురస్కారాలను స్వీకరించాడు. అతను భారతీయ సినిమాకు చేసిన విలువైన సేవలకు గాను 2004 సంవత్సరంలో అతనికి భారత అత్యున్నత సినిమా పురస్కారము దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ఇచ్చి దేశం అతనిని గౌరవించింది. అంతర్జాతీయ చలనచిత్ర సమాజములో పేరుగల అతి కొద్దిమంది భారతీయ సినిమా నిర్మాతలలో ఇతను కూడా ఒకడు.

జీవిత చరిత్ర

[మార్చు]

గోపాలక్రిష్ణన్ 1941 జూలై 3 న ప్రస్తుతం భారతదేశములోని కేరళలో అడూర్ కి సమీపములో గల పల్లిక్కల్ (మేడయిల్ బంగళా) లో మాధవన్ ఉన్నిథాన్, మౌత్తతు గౌరీ కుంజమ్మలకు జన్మించాడు. అతను 8 సంవత్సరాల వయసులో ఔత్సాహిక ప్రదర్శనలతో నటునిగా తన కళా జీవితాన్ని ఆరంభించాడు. తర్వాత అతను తన వ్యాసంగాన్ని రచన, దర్శకత్వం వైపు మళ్ళించి కొన్ని నాటికలు రచించి దర్శకత్వం వహించాడు. గాంధిగ్రామ్ రూరల్ ఇన్స్టిట్యూట్[1] నుండి అర్ధ శాస్త్రము, రాజనీతి శాస్త్రము, ప్రభుత్వ పాలనా శాస్త్రములలో 1961లో పట్టా పుచ్చుకున్న తర్వాత అతను తమిళనాడులోని దిండిగల్ దగ్గర ప్రభుత్వ అధికారిగా పనిచేసాడు. పూణే ఫిలిం ఇనిస్టిట్యూట్ లో స్క్రీన్ రైటింగ్, దర్శకత్వాలలో శిక్షణ పొందడానికి, అతను 1962లో ఉద్యోగాన్ని వదిలిపెట్టాడు. అక్కడ అతను భారత ప్రభుత్వ ఉపకార వేతనంతో తన శిక్షణను పూర్తి చేశాడు. తన సహచరులు, స్నేహితులతో, అడూర్ చిత్రలేఖ ఫిలిం సొసైటీ, చలచిత్ర సహకారణ సంఘంను స్థాపించాడు; ఈ సంఘం కేరళలో చలనచిత్రాలకు సంబంధించి మొదటిది. ఇది సహకారరంగంలో చలనచిత్రాల నిర్మాణం, పంపిణీ, ప్రదర్శనలపై దృష్టి సారించింది.

అడూర్ పదకొండు చలనచిత్రాలకు దాదాపు ముప్పై లఘు చిత్రాలకు, డాక్యుమెంటరీలకు దర్శకత్వం వహించడమే కాక స్క్రిప్ట్ ను సమకూర్చాడు. అతని నాన్-ఫీచర్ ఫిల్మ్స్ లో ముఖ్యమైనవి కేరళ రాష్ట్ర ప్రదర్శక కళలు.

అడూర్ యొక్క మొదటి సినిమా, జాతీయ అవార్డు పొందిన స్వయంవరం (1972) మలయాళం చలనచిత్ర చరిత్రలో ఒక మైలురాయి. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మాస్కో, మెల్ బోర్న్, లండన్, పారిస్ లాంటి నగరాలలో నిర్వహించబడిన వివిధ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో విరివిగా ప్రదర్శించబడింది. దీని తర్వాత వచ్చిన చిత్రాలైన కొడియెట్టం, ఎలిప్పట్టాయం, ముఖాముఖం, అనంతరం, మతిలుకల్, విధేయన్ , కథాపురుషన్లు మొదటి చిత్రం స్థాయిని నిలబెట్టుకుంటూ వివిధ చలనచిత్రోత్సవాలలో విమర్శకులచేత ప్రశంశలు పొంది అతనికి అనేక పురస్కారాలు సాధించి పెట్టాయి. అయినప్పటికీ, ముఖాముఖం కేరళలో విమర్శలకు గురి అయినది అదేవిధంగా విధేయన్ చిత్ర రచయిత సాఖారియ, అడూర్ల మధ్య గల అభిప్రాయ భేదాల వలన చర్చలకు కేంద్రబిందువైంది.

అడూర్ తరువాతి చిత్రం నిజహళ్ కుత్తు, నిరపరాధిని ఉరి తీసానని తెలిసిన ఒక తలారి (ఉరితీసేవాడు) యొక్క అనుభవాల క్రోడీకరణ,, నాలు పెన్నుంగాల్, తకజ్హి శివశంకర పిళ్ళై యొక్క 4 లఘు కథల సంగ్రహం.

అతని అన్ని చిత్రాలు జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలను గెలుచుకున్నాయి (జాతీయ అవార్డు ఉత్తమ చిత్రానికి గాను రెండుసార్లు, ఉత్తమ దర్శకునికి ఐదుసార్లు, ఉత్తమ స్క్రిప్ట్ కి రెండుసార్లు. అతని చిత్రాలలోని నటులు , సాంకేతిక నిపుణులు కూడా అనేక జాతీయ అవార్డులు పొందారు). అడూర్ మూడవ చిత్రం, ఎలిప్పట్టాయం ది కోవేటేడ్ బ్రిటిష్ ఫిలిం ఇన్స్టిట్యూట్ అవార్డును 'ది మోస్ట్ ఒరిజినల్, ఇమాజినేటివ్ ఫిలిం' 1982 గాను గెలుచుకుంది. ముఖాముఖం, అనంతరం, మతిలుకల్, విధేయన్, కథాపురుషన్. నిజాల్కుతూలకు ది ఇంటర్ నేషనల్ ఫిలిం క్రిటిక్స్ ప్రైజ్ (FIPRESCI) వరుసగా ఆరుసార్లు అతను పొందాడు. ది UNICEF ఫిలిం ప్రైజ్ (వెనిసు), OCIC ఫిలిం ప్రైజ్ (అమ్నిఎన్స్), ఇంటర్ ఫిలిం ప్రైజ్ (మనహెం) మొదలగు అంతర్జాతీయ అవార్డుల విజేత, అతని చిత్రాలు కాన్న్స్, వెనిసు, బెర్లిన్, టొరోంటో, లండన్, రొట్టేర్డం, ప్రపంచంలోని ముఖ్యమైన ప్రతి చిత్రోత్సవాలలో ప్రదర్శించబడ్డాయి. భారతీయ సినిమాలకు అతను చేసిన సేవలకు గాను, దేశము అతనిని పద్మశ్రీ బిరుదుతో 1984లో సత్కరించింది.

అడూర్ కుమార్తె అస్వతి దోర్జ్ IPS (అస్సాం కాడర్ లో భాగము, 2000 బ్యాచ్) జూన్ 2010న ముంబైలో డిప్యుటీ కమిషనర్ ఆఫ్ పోలీసుగా బాధ్యతలు స్వీకరించింది.[2][3]

డాక్యుమెంటరీలు, 'కొత్త సినిమా' ఉద్యమము

[మార్చు]

తొమ్మిది చలనచిత్రాలతో పాటు 30 లఘుచిత్రాలు, డాక్యుమెంటరీలు అతని ఖాతాలో జమయై ఉన్నాయి. హెల్సింకి చిత్రోత్సవము అతని చిత్రాలకు సంబంధించిన తొలి చిత్రోత్సవము. జాతీయ చలనచిత్ర అవార్డులు, అనేక అంతర్జాతీయ చిత్రోత్సవాలలో అతను జ్యూరీలో ముఖ్యుడు.

అతని చిత్రాలతో పాటు, కేరళలో కొత్త సినీ సంస్కృతిని ప్రవేశపెట్టడానికి ఏర్పాటు చేయబడిన కేరళలోని మొదటి ఫిలిం సొసైటీ "చిత్రలేఖ ఫిలిం సొసైటీ" నిర్వహణలో అడూర్ పాలుపంచుకున్నాడు. చిత్ర నిర్మాణానికి సంబంధించిన కేరళ తొలి ఫిలిం కో-ఆపరేటివ్ సొసైటీ "చిత్రలేఖ" నిర్వహణలో అతను చురుకుగా పాల్గొన్నాడు. ఈ ఉద్యమాలు చిత్రాలను కొత్త దారికి మళ్ళించాయి, ఇవి జి. అరవిందన్, పి.ఎ. బెకెర్, కె.జి. జార్జి, పవిత్రన్, రవీంద్రన్ వంటి దర్శకులచే "కళాత్మక సినిమాలు"గా పిలవబడ్డాయి. ఈ ఉద్యమం బలంగా ఉన్న ఆ సమయంలో జనరంజక చిత్రాలు కూడా కళాత్మక సినిమాలతో మేళవించి ఒక కొత్త చిత్రకళా శైలి రూపుదిద్దుకుంది.

అవార్డులు, మైలురాళ్ళు

[మార్చు]

గోపాలక్రిష్ణన్ తన చిత్రాలకు సాధించిన అవార్డులలో కొన్ని:

  • 2010 -యునివర్సిటీ అఫ్ కేరళ నుండి గౌరవ డాక్టరేటు [డి.లిట్ ]
  • 2006 - పద్మ విభూషణ్ — భారత ప్రభుత్వం యొక్క రెండవ అత్యున్నత పౌర పురస్కారము[4]
  • 2004 -భారత ప్రభుత్వం నుండి జీవిత సాఫల్య చిత్ర పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
  • 1984 -పద్మశ్రీ —భారత ప్రభుత్వం యొక్క నాల్గవ అత్యున్నత పౌర పురస్కారము[5]
  • 1984 - లెజియన్ ఆఫ్ ఆనర్ — ఫ్రెంచ్ ఆర్డర్, ఫ్రాన్సులోని అత్యున్నత అలంకరణ
  • జాతీయ చలనచిత్ర అవార్డులు — వివిధ విభాగాలకు చెందిన స్వయంవరం, కొడియెట్టం, ఎలిప్పట్టాయం, ముఖాముఖం, అనంతరం, మథిలుకల్, విధేయన్, కథాపురుషన్, నిజాల్క్కుతూ, నాలు పెన్నుంగాల్
  • కేరళ రాష్ట్ర చలనచిత్ర పురస్కారాలు: — వివిధ కేటగిరీలకు చెందిన కొడియెట్టం, ఎలిప్పట్టాయం, ముఖాముఖం, అనంతరం, విధేయన్, ఓరు పెన్నుం రాన్డానుం
  • ఇంటర్ నేషనల్ ఫిలిం క్రిటిక్స్ ప్రైజ్ (FIPRESCI) — గెలుపొందిన ఆరు చలనచిత్రాలు వరుసగా (ముఖాముఖం, అనంతరం, మథిలుకల్, విధేయన్, కథాపురుషన్, నిజాల్కుతు )[6]
  • లండన్ ఫిలిం ఫెస్టివల్ — సుతెర్లాండ్ ట్రోఫి — 1982లో ఎలిప్పట్టాయం గాను
  • బ్రిటిష్ ఫిలిం ఇన్స్టిట్యూట్ అవార్డు — మోస్ట్ ఒరిజినల్ ఇమాజినేటివ్ ఫిలిం ఆఫ్ 1982 — ఎలిప్పట్టాయం
  • ఫ్రెంచ్ ప్రభుత్వము (2003) చే కమాండర్ ఆఫ్ ది ఆర్డే డేస్ ఆర్ట్స్ ఎట్ డేస్ లేట్ట్రేస్[7]
  • కైరో అంతర్జాతీయ చిత్రోత్సవాలలో లైఫ్ టైం ఎచివ్మేంట్ అవార్డు.

జాతీయ చలనచిత్ర అవార్డులు (సవివరముగా) :

కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు (సవివరంగా) :

  • 1977 - ఉత్తమ చిత్రం - కొడియెట్టం
  • 1981 - ఉత్తమ చిత్రం - ఎలిప్పట్టాయం
  • 1984 - ఉత్తమ చిత్రం - ముఖాముఖం
  • 1993 - ఉత్తమ చిత్రం - విధేయన్
  • 2008 - ఉత్తమ చిత్రం - ఓరు పెన్నుం రాన్డానుం
  • 1977 - ఉత్తమ దర్శకుడు - కొడియెట్టం
  • 1984 - ఉత్తమ దర్శకుడు - ముఖాముఖం
  • 1987 - ఉత్తమ దర్శకుడు - అనంతరం
  • 1993 - ఉత్తమ దర్శకుడు - విధేయన్
  • 2008 - ఉత్తమ దర్శకుడు - ఓరు పెన్నుం రాన్డానుం
  • 1977 - ఉత్తమ కథ - కొడియెట్టం
  • 1993 - ఉత్తమ స్క్రీన్ ప్లే - విధేయన్
  • 2008 - ఉత్తమ స్క్రీన్ ప్లే - ఓరు పెన్నుం రాన్డానుం
  • 1982 - ఉత్తమ డాక్యుమెంటరి చిత్రం - క్రిష్ణనట్టం
  • 1999 - ఉత్తమ డాక్యుమెంటరి చిత్రం - కాలమండలం గోపి
  • 2005 - ఉత్తమ డాక్యుమెంటరి - కాలమండలం రామన్కుట్టి నైర్
  • 2004 - చలనచిత్రాలపై ఉత్తమ గ్రంథం - సినిమానుభవం

అతని చిత్రాల పునరావలోకన ప్రదర్శనలు నిర్వహింపబడిన ప్రదేశాలు

  • కోల్ కత్తా, బై సీగుల్ ఫౌండేషన్ ఫర్ ది ఆర్ట్స్, నందన్, 2009.[8]
  • ది స్లోవేనియన్ ఇంటర్ నేషనల్ ఫిలిం ఫెస్టివల్, 2009.[9]
  • ది మునిచ్ ఫిలిం మ్యూజియం, 2009.[10]
  • ది ఫ్రెంచ్ సినిమాతేక్వే, పారిస్, 1999.[11]

పదవుల నిర్వహణ

[మార్చు]

అడూర్ చిత్ర పరిశ్రమలో కూడా అనేక గౌరవప్రథమైన పదవులలో పనిచేసాడు. భారత ప్రభుత్వం చే ఒక జాతీయ చిత్ర విధానము కొరకు ఏర్పాటు చేయబడిన శివరామకారత్ కమిటీలో అతను ఒక సభ్యుడు. 1974లో ఇతను జాతీయ చిత్ర అవార్డు కమిటీలో ఒక సభ్యుడు. అతడు వెనిసు, సింగపూర్, హవాయి, ఢిల్లీ అంతర్జాతీయ చిత్రోత్సవాలలో జూరీ సభ్యుడు. అతను 1999లో కేరళలో జరిగిన అంతర్జాతీయ చిత్రోత్సవాలకి ఛైర్మన్. 1980–1983 సంవత్సరాలలో నేషనల్ ఫిలిం డెవలప్మెంట్ కార్పోరేషన్ కి ఇతను అధికారి. పూణే ఫిలిం, టెలివిజన్ ఇన్స్టిట్యూట్ లకు ఇతను దర్శకుడు. ఇతను 1975–1977 సంవత్సరాలలో ది అడ్వైజరీ బోర్డు ఫర్ నేషనల్ ఫిలిం ఆర్చివ్స్, పూణేలో ఒక సభ్యుడు.

ఫిల్మోగ్రఫీ

[మార్చు]
సంవత్సరం పేరు పదవీకాలం వర్గం తారాగణం పురస్కారాలు
1965 ఏ గ్రేట్ డే 20 నిమిషములు లఘు కల్పన
1966 ఏ డే ఎట్ కోవలం 30 నిమిషములు డాక్యుమెంటరి
1967 ది మిత్ 30 సెకెండ్స్ లఘు కల్పన మెరిట్ సర్టిఫికేట్, ఎక్స్పో-67, మాన్ట్రియాల్
1968 డేంజెర్ ఎట్ యువర్ డోర్-స్టెప్ 20 నిమిషములు డాక్యుమెంటరి
1968 అండ్ మాన్ క్రియేటెడ్ 8 నిమిషములు డాక్యుమెంటరి
1968 మన్న్తరికల్ మన్న్తరికల్ (ఇసుక రేణువులు) 20 నిమిషములు డాక్యుమెంటరి
1969 టూవర్డ్స్ నేషనల్ STD 20 నిమిషములు డాక్యుమెంటరి
1969 ఏ మిజన్ ఆఫ్ లవ్ 30 నిమిషములు డాక్యుమెంటరి
1966 యువర్ ఫుడ్ 60 నిమిషములు డాక్యుమెంటరి
1970 ప్రతిసంధి ప్రతిసంధి (రహదారి) 55 నిమిషములు లఘు-నాటకము
1971 రొమాన్స్ ఆఫ్ రబ్బర్ 30 నిమిషములు డాక్యుమెంటరి
1972 స్వయంవరం (ఒకరి స్వయం ఎంపిక) 125 నిమిషములు చలనచిత్రం మధు, శారద, భరత్ గోపి, తిక్కురిస్సి సుకుమారన్ నైర్, K. P. A. C. లలిత జాతీయ అవార్డులు ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి, ఉత్తమ సినిమాటోగ్రాఫర్
1973 కిలిమనూరిల్ ఓరు దాసలక్షాధిపతి కిలిమనూరిల్ ఓరు దాసలక్షాధిపతి (ఒక లక్షాధికారి పుట్టుక) ' 20 నిమిషములు డాక్యుమెంటరి
1974 గురు చెంగన్నూర్ 17 నిమిషములు డాక్యుమెంటరి
1975 పాస్ట్ ఇన్ పెర్స్పెక్టివ్ 20 నిమిషములు డాక్యుమెంటరి
1976 ఇడుక్కి 60 నిమిషములు డాక్యుమెంటరి
1977 కొడియెట్టం (అధిరోహణం) 128 నిమిషములు చలనచిత్రం భరత్ గోపి, K. P. A. C. లలిత, తిక్కురిస్సి సుకుమరాన్ నైర్, అడూర్ భవాని, అజీజ్ జాతీయ అవార్డులు ఉత్తమ మలయాళ చలన చిత్రం, ఉత్తమ నటుడు
1978 ఫోర్ షార్ట్స్ ఆన్ ఫ్యామిలీ ప్లానింగ్ 16 నిమిషములు డాక్యుమెంటరి
1979 యక్షగాణ 20 నిమిషములు డాక్యుమెంటరి
1980 చోళ హెరిటేజ్ 20 నిమిషములు డాక్యుమెంటరి
1981 ఎలిప్పట్టాయం (ర్యాట్-ట్రాప్) 121 నిమిషములు చలనచిత్రం కరమణ జనార్దనన్ నైర్, శారద, జలజ, రాజం K. నైర్, సోమన్ సుతెర్లాండ్ ట్రోఫి ఎట్ 1982 లండన్ ఫిలిం ఫెస్టివల్
జాతీయ అవార్డుs ఉత్తమ మలయాళ చలన చిత్రం, ఉత్తమ Audiography
1982 క్రిష్ణనట్టం 20 నిమిషములు డాక్యుమెంటరి
1984 ముఖాముఖం (పేస్ టూ పేస్) 107 నిమిషములు చలనచిత్రం గంగా, బాలన్ K. నైర్, కరమణ జనార్దనన్ నైర్, కవియూర్ పొన్నమ్మ, అశోకన్, K. P. A. C. లలిత FIPRESCI ప్రైజ్, న్యూఢిల్లీ, జాతీయ అవార్డులుఉత్తమ దర్శకుడు, ఉత్తమ స్క్రీన్ ప్లే, ఉత్తమ ఆడియోగ్రాఫి
1985 ఎయు/గంగా (గంగా-జలము) 140 నిమిషములు గ్రాండ్ ప్రైజ్, సినిమా డు రీల్, పారిస్
1987 అనంతరం (ఏకపాత్రాభినయనము) 125 నిమిషములు చలనచిత్రం మమ్మూట్టి, అశోకన్, శోభన, బాలన్ K. నైర్, బహదూర్ ఫిప్రేస్కి ప్రైజ్, కర్లోవి వారీ. జాతీయ అవార్డులు ఉత్తమ దర్శకుడు, ఉత్తమ స్క్రీన్ ప్లే,, ఉత్తమ ఆడియోగ్రాఫి
1990 మథిలుకల్ (ది వాల్స్) 117 నిమిషములు చలనచిత్రం మమ్మూట్టి, మురళి, తిలకాన్, K. P. A. C. లలిత (స్వరము), కరమణ జనార్దనన్ నైర్ ఫిప్రేస్కి ప్రైజ్, వెనిస్, UNICEF ఫిలిం ప్రైజ్, వెనిస్, OCIC ప్రైజ్, అమ్నిఎన్స్. జాతీయ అవార్డు ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ ప్రాంతీయ చిత్రం, ఉత్తమ ఆడియోగ్రాఫి
1993 విధేయన్ (బానిస) 112 నిమిషములు చలనచిత్రం మమ్మూట్టి, తన్వి అజ్మి, M.R. గోపకుమార్, సబితా ఆనంద్ ఫ్యూచర్ FIPRESCI, స్పెషల్ జూరీ ప్రైజ్, సింగపూర్. ఇంటర్ ఫిలిం జూరీ ప్రైజ్, మాన్నహెం. నేట్పక్ ప్రైజ్, రొట్టేర్డం. జాతీయ అవార్డు ఉత్తమ నటుడు, ఉత్తమ ప్రాంతీయ చిత్రం
1995 కథాపురుషన్ (మనిషి కథ) 107 నిమిషములు చలనచిత్రం విశ్వనాథన్, మినీ నైర్, నరేంద్ర ప్రసాద్, అరణ్ముల పొన్నమ్మ, ఊర్మిళ ఉన్ని FIPRESCI ప్రైజ్, జాతీయ అవార్డు ఉత్తమ చిత్రం
1995 కాలమండలం గోపి 43 నిమిషములు డాక్యుమెంటరి
2001 కూడియట్టం 180 నిమిషములు డాక్యుమెంటరి
2002 నిజాల్క్కుతూ (షాడో కిల్) 90 నిమిషములు చలనచిత్రం ఒడువిల్ ఉన్నికృష్ణన్, సుకుమారి, మురళి, నేడుముడి వేణు, జగతి శ్రీకుమార్, నరైన్ FIPRESCI, ముంబై. జాతీయ అవార్డు ఉత్తమ ప్రాంతీయ చిత్రం
2005 కాలమండలం రామన్కుట్టి నైర్ 73 నిమిషములు డాక్యుమెంటరి
2007 డాన్సు ఆఫ్ ది ఎన్చాన్ట్రెస్ 72 నిమిషములు డాక్యుమెంటరి
2007 నాలు పెన్నుంగాల్ (నలుగురు స్త్రీలు) 105 నిమిషములు చలనచిత్రం నందితా దాస్, కావ్య మాధవన్, గీతూ మోహన్దాస్, పద్మప్రియ, మంజు పిళ్ళై, మురళి, ముకేష్, మనోజ్ K. జయన్ జాతీయ అవార్డు ఉత్తమ దర్శకుడు
2008 ఓరు పెన్నుం రాన్డానుం (ఏ క్లైమేట్ ఫర్ క్రైం) 115 నిమిషములు చలనచిత్రం నేడుముడి వేణు, మనోజ్ K. జయన్, జగదీష్, విజయరాఘవన్, ఇంద్రాన్స్, రవి వల్లతోల్, ప్రవీణ 2009 గాను కేరళ రాష్ట్ర ఉత్తమ దర్శకుడు అవార్డు

మూలాలు

[మార్చు]
  1. "Page on Adoor Gopalakrishnan at Kerala tourism". Archived from the original on 17 జూలై 2011. Retrieved 8 February 2008.
  2. http://www.mid-day.com/news/2010/jun/020610-mumbai-dcp-husband-wife-chhering-dorje-aswati.htm
  3. http://www.telegraphindia.com/1050123/asp/look/story_4279220.asp
  4. "Adoor honoured with Padma award". Rediff.com. 21 March 2006. Retrieved 28 May 2009.
  5. "Official Website of Adoor Gopalakrishnan". Archived from the original on 13 అక్టోబరు 2008. Retrieved 28 May 2009.
  6. "Official Website of Adoor Gopalakrishnan". Archived from the original on 3 సెప్టెంబరు 2011. Retrieved 28 May 2009.
  7. "Adoor receives French honour". The Times of India. 22 October 2003. Retrieved 14 July 2008.
  8. "Adoor Gopalakrishnan's Retrospective in Kolkata". Sify. 9 March 2009. Retrieved 29 May 2009. [dead link]
  9. "Adoor retrospective at Slovenian festival". The Hindu. 15 November 2008. Archived from the original on 1 జూలై 2012. Retrieved 29 May 2009.
  10. "Adoor retrospective". The Hindu. 5 September 2009. Archived from the original on 1 జూలై 2012. Retrieved 29 May 2009.
  11. "Interview: Adoor". Cinema of Malayalam. Archived from the original on 19 ఆగస్టు 2009. Retrieved 29 May 2009.

వనరులు

[మార్చు]

బాహ్య లింకులు

[మార్చు]
భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు
భారత జాతీయ చలనచిత్ర పురస్కారం : ఫీచర్ ఫిల్మ్స్
ఉత్తమ సినిమా|ఉత్తమ ప్రజాదరణ పొందిన సినిమా|ఉత్తమ నటుడు|ఉత్తమ నటి|ఉత్తమ సహాయ నటుడు|ఉత్తమ సహాయ నటి
ఉత్తమ కళా దర్శకుడు|ఉత్తమ బాల నటుడు|ఉత్తమ ఛాయా గ్రహకుడు|ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్|ఉత్తమ దర్శకుడు|ఉత్తమ స్క్రీన్ ప్లే
ఉత్తమ నృత్య దర్శకుడు|ఉత్తమ గీత రచయిత|ఉత్తమ సంగీత దర్శకుడు|ఉత్తమ నేపథ్య గాయకుడు|ఉత్తమ నేపథ్య గాయని
ఉత్తమ శబ్దగ్రహణం|ఉత్తమ కూర్పు|ఉత్తమ స్పెషల్ అఫెక్ట్స్|ఉత్తమ బాలల సినిమా|ఉత్తమ కుటుంబ కధా చిత్రం
ప్రత్యేక జ్యూరీ పురస్కారం|ఉత్తమ ఏనిమేషన్ సినిమా
ఉత్తమ అస్సామీ సినిమా|ఉత్తమ బెంగాలీ సినిమా|ఉత్తమ ఆంగ్ల సినిమా|ఉత్తమ హిందీ సినిమా
ఉత్తమ కన్నడ సినిమా|ఉత్తమ మళయాల సినిమా|ఉత్తమ మరాఠీ సినిమా
ఉత్తమ ఒరియా సినిమా|ఉత్తమ పంజాబీ సినిమా|ఉత్తమ కొంకణి సినిమా|ఉత్తమ మణిపురి సినిమా
ఉత్తమ తమిళ సినిమా|ఉత్తమ తెలుగు సినిమా
జాతీయ సినిమా పురస్కారం : విరమించిన పురస్కారాలు
ఉత్తమ ద్వితీయ సినిమా
ఇందిరా గాంధీ జాతీయ ఉత్తమ నూతన దర్శకుడు పురస్కారం
ఇందిరా గాంధీ పురస్కారం
నర్గీస్ దత్ జాతీయ ఉత్తమ సమైక్యత సినిమా పురస్కారం
నర్గీస్ దత్ పురస్కారం
జీవితకాల గుర్తింపు పురస్కారం
దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారము
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినీ విమర్శకుడు
ఉత్తమ సినీ విమర్శకుడు