సామ్రాట్ పృథ్వీరాజ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సామ్రాట్ పృథ్వీరాజ్
(1962 తెలుగు సినిమా)
Pruthviraj.jpg
దర్శకత్వం హర్ సుఖ్ భట్
నిర్మాణం టి.దశరథరామిరెడ్డి
తారాగణం పైడి జైరాజ్,
అనితా గుహ,
చాంద్ ఉస్మానీ,
సప్రూ
సంగీతం వసంత్ దేశాయ్,
బి.గోపాలం
గీతరచన అనిసెట్టి
సంభాషణలు అనిసెట్టి
నిర్మాణ సంస్థ శ్రీ విజయభారతీ ఫిలింస్
భాష తెలుగు

సామ్రాట్ పృథ్వీరాజ్ 1962,ఫిబ్రవరి 24న విడుదలైన సినిమా. ఇది హిందీ నుండి తెలుగులోనికి అనువాదం చేయబడింది.

తారాగణం[మార్చు]

 • జయరాజ్ - పృథ్వీరాజ్
 • అనితా గుహ - కర్ణాటకి (రాజనర్తకి)
 • ఉల్లాస్ - జయచంద్రుడు
 • చాంద్ ఉస్మానీ - రాణీ సంయుక్త
 • సప్రూ - ఘజనీ మహమ్మద్
 • బి.ఎం.వ్యాస్ - కవిచంద్
 • ప్రేమ్ అదిబ్- కైమాస్
 • భగవాన్
 • సుందర్

సాంకేతికవర్గం[మార్చు]

 • దర్శకత్వం: హర్ సుఖ్ భట్
 • సంగీతం: వసంత్ దేశాయ్, బి. గోపాలం
 • మాటలు, పాటలు: అనిసెట్టి
 • నిర్మాత: టి.దశరథరామిరెడ్డి

కథ[మార్చు]

అనేక దేశాలను జయించి విజయదుందుభి మ్రోగించిన పృథ్వీరాజుకు కర్ణాటకి అనే రాజనర్తకి పట్టుబడింది. ఆమె గూఢచారిణి అని తెలిసివుండి కూడా పృథ్వీరాజ్ ఆమెను ఆస్థానంలో నర్తకిగా నియమించాడు. తన మంత్రి కైమాస్ ఆమెను బలాత్కరించబోతున్న సమయంలో అతడిని చంపివేసి ఆమెను కాపాడుతాడు. ఆమె తననే మోహించబోగా తప్పని హితోపదేశం చేస్తాడు. జయచంద్రుని కుమార్తె సంయుక్త పృథ్వీరాజును ప్రేమిస్తుంది. ఆమె స్వయంవర సమయంలో జయచంద్రుడు ద్వారంవద్ద ఉంచిన పృథ్వీరాజ్ శిలావిగ్రహానికి పూలదండ వేస్తుంది. చాటున పొంచివున్న పృథ్వీరాజు ఆమెను ఎత్తుకుపోతాడు. తదుపరి ఘజనీమహమ్మదును యుద్ధంలో ఖైదీగా పట్టుకుని ఉదారహృదయంతో వదిలివేస్తాడు. ఘజనీ జయచంద్రులు ఏకమై యుద్దానికి వస్తారు.పృథ్వీరాజ్ ఓడిపోతాడు. ఘజనీ పృథ్వీరాజ్ కళ్ళు పొడిపించివేశాడు. ఆ సమయంలో కవిచంద్ వస్తాడు. పృథ్వీరాజ్ అంధుడి ఉండి కూడా ఘజనీ గొంతు విని బాణంతో అతని ప్రాణం తీస్తాడు. కవిచంద్, పృథ్వీరాజ్‌లు బాకులతో తమ ప్రాణాలు తీసుకొని వీరస్వర్గం పొందుతారు[1].

పాటలు[మార్చు]

ఈ చిత్రంలోని పాటలను ఘంటసాల, పిఠాపురం,పి.బి.శ్రీనివాస్, పి.సుశీల, ఎస్.జానకి తదితరులు పాడారు[2].

 1. అపజయమెరుగని వీరుడా ఆవేదన చెందకురా - ఘంటసాల
 2. ఆ జయచంద్రుడే రాజ నీతిలో తానే రామచంద్రుడు - పిఠాపురం
 3. ఘుమఘుమలా వెదజల్లే యవ్వనమే నీదోయి - పి.సుశీల
 4. నీ మాతృభూమియే ప్రీతి మీర పిలిచేనోయి - పి.బి.శ్రీనివాస్,ఎస్.జానకి
 5. భారతమాత వీరపుత్రుడీ పావనమూర్తీ - ఘంటసాల
 6. మన దారి కనిపించెరా మానవా మన దారి కనిపించెరా - ఘంటసాల బృందం
 7. మాతృభూమి స్వేఛ్చకై జీవలే అర్పిన్పగ రా రా - ఘంటసాల బృందం
 8. యీ రేయీ మేఘమాలా కన్నె మనసే కలచుటేల - ఎస్.జానకి

మూలాలు[మార్చు]

 1. సంపాదకుడు (4 March 1962). "చిత్రసమీక్ష - సామ్రాట్ పృథ్వీరాజ్". ఆంధ్రప్రభ దినపత్రిక. Retrieved 21 February 2020.
 2. కొల్లూరి భాస్కరరావు. "సామ్రాట్ పృధ్వీరాజ్ - 1962 (డబ్బింగ్)". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Retrieved 20 February 2020.

బయటి లింకులు[మార్చు]