రాజ్‌కుమార్ అపహరణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కన్నడ సినీ నటుడు రాజ్కుమార్

కన్నడ సినీనటుడు రాజ్‌కుమార్ను 2000 జూలై 30లో గంధపు చెక్కల, ఏనుగుదంతాల స్మగ్లర్ వీరప్పన్ అపహరించారు. 2000 జూలై 30 తేదీన గజనూర్, తమిళనాడులోని రాజ్ కుమార్ ఫాంహౌస్ పై వీరప్పన్, అనుచరులు చేసిన సాయుధ దాడిలో రాజ్ కుమార్ ను అపహరించారు.[1] 108 రోజుల పాటు వీరప్పన్ అపహరణలో ఉన్న రాజ్ కుమార్ 2000 నవంబరు 15లో విడుదల అయ్యారు.[2] అప్పటికే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య దెబ్బతిన్న సంబంధాలను ఈ అపహరణ మరింత దిగజార్చింది, రెండు రాష్ట్రాల్లో ఆందోళన కలగజేసింది.

నేపథ్యం

[మార్చు]

తన పనులు సాధించుకోవడం కోసం మనుషులను అపహరించడం వీరప్పన్ చేసే పనుల్లో భాగంగా ఉంటూ వచ్చింది. 1997 లో, కొళ్ళెగల్ తాలూకా లోని బురుడే అడవుల్లో మరపల వద్ద తొమ్మిది మంది అటవీ అధికారులను అపహరించాడు. వాళ్ళను విడుదల చెయ్యాలంటే, తనపై ఉన్న కేసులను మాఫీ చెయ్యాలని షరతు పెట్టాడు. అయితే, 7 వారాల తరువాత తన డిమాండ్లేవీ నెరవేరకుండానే వారందరినీ విడుదల చేసాడు.

వీరప్పన్‌ను పట్టుకునేందుకు ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్సు, అతడు తన తండ్రిని కిడ్‌న్యాప్ చేసే అవకాశం ఉందని ఆయన్ను హెచ్చరించిందని రాజ్‌కుమార్ కుమారుడు రాఘవేంద్ర రాజ్‌కుమార్ చెప్పాడు.[3] కానీ రాజ్‌కుమార్ దాన్ని పట్టించుకోలేదు.[3] తనను అపహరిస్తే వీరప్పన్‌కు దొరికేది ఒక చొక్కా, ఒక లుంగీయేనని అతడు చెతురాడాడు.[4]

దాడి, అపహరణ

[మార్చు]

2000 జూలై 30 రాత్రి 9:30 ప్రాంతంలో, తమిళనాడు లోని గాజనూరు వద్ద ఉన్న రాజ్‌కుమార్ ఫార్మ్‌హౌసుపై వీరప్పన్ పది పన్నెండు మంది అనుచరులతో కలిసి దాడి చేసాడు..[5] అక్కడ తాను కొత్తగా కట్టించుకున్న ఇంటి గృహప్రవేశం కోసం రాజ్‌కుమార్ జూలై 27 న అక్కడికి చేరుకున్నాడు. వీరప్పన్ దళం ఇంట్లోకి చొరబడినప్పుటికి రాజ్‌కుమార్ భోజనం పూర్తైంది.[5] రాజ్‌కుమార్, అతడి కుటుంబం టీవీ చూస్తూండగా వీరప్పన్ లోపలికి వచ్చి "మాకు సార్ కావాలి" అని కన్నడంలో అడిగాడని రాజ్‌కుమార్ భార్య పార్వతమ్మ చెప్పింది.[6] జోరున కురుస్తున్న వర్షం లోనే వాళ్ళు రాజ్‌కుమార్‌ను ఇంట్లోంచి తీసుకువెళ్ళారు.[6] ఇంటి బయటకు వెళ్ళాక, ఇంట్లో ఇంకా ఎవరెవరు ఉన్నారని వీరప్పన్ రాజ్‌కుమార్‌ను అడిగాడు. రాజ్‌కుమార్ చెప్పిన సమాచారం విన్నాక, అతడు లోపలికి వెళ్ళి, రాజ్‌కుమార్ అల్లుడు ఎస్ ఎ గోవిందరాజ్‌ను, నగేష్ అనే బంధువును, నాగప్ప అనే సినిమా సహాయ దర్శకుడినీ కూడా తనతో బయటికి తీసుకువెళ్ళాడు.[6]

ఈ అపహరణ జరుగుతూండగా, తమిళనాడు ఐజిపి ఎం. బాలచంద్రన్, టాస్క్ ఫోర్సు కమాండరు హర్షవర్ధన రాజు అక్కడికి 55 కి.మీ. దూరంలో ఉన్న డింబం వద్ద ఒక సమావేశంలో ఉన్నారు.[5] డింబం వద్ద ఉన్న ఒక దేవాలయానికి దర్శనం కోసం వీరప్పన్‌ రానున్నాడని వారికి ఉప్పందడంతో వాళ్ళు అతడి కోసం వలపన్ని కాచుకుని ఉన్నారు. [5]

విడుదల

[మార్చు]

108 రోజుల పాటు తన వద్ద చెరలో ఉంచి, 2000 నవంబరు 15 న వీరప్పన్, రాజ్‌కుమార్‌ను విడుదల చేసాడు.[7] అతడిని విడుదల చేసేందుకు వీరప్పన్‌కు ఏం ముట్టిందనేది బహిరంగంగా ప్రకటించలేదు. కానీ 40 కోట్ల రూపాయలు వీరప్పన్‌కు అందినట్లు అతడి అనుచరుడు కనకరాజ్ చెప్పాడు. [7]

మూలాలు

[మార్చు]
  1. Jayaraman, A. (August 1, 2000). "Veerappan kidnaps Rajkumar, three others". The Hindu. Archived from the original on 2013-01-05. Retrieved 2016-05-07.
  2. "Death of a legendary bandit". BBC. October 18, 2004.
  3. 3.0 3.1 Sharma, Ravi (August 5–18, 2000). "Veerappan's prize catch". Frontline. 17 (16). Archived from the original on 2012-11-10. Retrieved 2020-06-03.
  4. Jayaraman, A. (August 1, 2000). "Veerappan kidnaps Rajkumar, three others". The Hindu. Archived from the original on 2013-01-05. Retrieved 2016-05-07.
  5. 5.0 5.1 5.2 5.3 Sharma, Ravi (August 5–18, 2000). "Veerappan's prize catch". Frontline. 17 (16). Archived from the original on 2012-11-10. Retrieved 2020-06-03.
  6. 6.0 6.1 6.2 Jayaraman, A. (August 1, 2000). "Veerappan kidnaps Rajkumar, three others". The Hindu. Archived from the original on 2013-01-05. Retrieved 2016-05-07.
  7. 7.0 7.1 Sep 9, TNN /; 2006; Ist, 04:16. "'Rs 40 cr paid for Rajkumar release' | India News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 2020-06-03. Retrieved 2020-06-03. {{cite web}}: |last2= has numeric name (help)CS1 maint: numeric names: authors list (link)

వెలుపలి లంకెలు

[మార్చు]