మాల్కం మార్షల్
మాల్కం మార్షల్ | ||||
![]() | ||||
దస్త్రం:West Indies Cricket Board Flag.svg West Indies | ||||
వ్యక్తిగత సమాచారం | ||||
---|---|---|---|---|
బ్యాటింగ్ శైలి | కుడిచేతి బ్యాట్స్‌మన్ | |||
బౌలింగ్ శైలి | రైట్-ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ | |||
కెరీర్ గణాంకాలు | ||||
Tests | ODIs | |||
మ్యాచ్‌లు | 81 | 136 | ||
పరుగులు | 1810 | 955 | ||
బ్యాటింగ్ సగటు | 18.85 | 14.92 | ||
100లు/50లు | 0/10 | 0/2 | ||
అత్యుత్తమ స్కోరు | 92 | 66 | ||
ఓవర్లు | 2930.4 | 1195.5 | ||
వికెట్లు | 376 | 157 | ||
బౌలింగ్ సగటు | 20.94 | 26.96 | ||
ఒకే ఇన్నింగ్స్ లో 5 వికెట్లు | 22 | 0 | ||
ఒకే మ్యాచ్ లో 10 వికెట్లు | 4 | n/a | ||
అత్యుత్తమ బౌలింగ్ | 22/7 | 18/4 | ||
క్యాచ్ లు/స్టంపింగులు | 25/- | 15/- | ||
1958, ఏప్రిల్ 18న జన్మించిన మాల్కం మార్షల్ (Malcolm Denzil Marshall) వెస్టీండీస్కు చెందిన ప్రముఖ మాజీ క్రికెట్ బౌలర్. ఇప్పటి వరకు టెస్ట్ క్రికెట్ ఆడిన అత్యుత్తమ బౌలర్లలో ఒకడిగా పేరుపొందినాడు. మరికొందరి ప్రకారం అతడే క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాడు [1]. మార్షల్ టెస్ట్ క్రికెట్‌లో 20.94 సగటుతో 200 పైగా వికెట్లు సాధించాడు. ఈ గణాంకాలే అతడిని అత్యుత్తమ బౌలర్‌గా నిలబెట్టినాయి.
అతడి సమకాలీన బౌలర్లతో పోలిస్తే ఇతడు పొట్టివాడు. 5 అడుగుల 11 అంగుళాల ఎత్తు ఉండే ఇతడు ఆరున్నర అడుగుల ఎత్తు ఉండే జోయెల్ గార్నర్, కర్ట్‌లీ ఆంబ్రోస్, కోర్ట్‌నీ వాల్ష్, కొలిన్ క్రాప్ట్ లతో పోలిస్తే ఎత్తుతక్కువే. సాధారణంగా 8 వ స్థానంలో బ్యాటింగ్ చేసే మార్షల్ దిగువ ఆర్డర్‌లో ప్రత్యర్థులను ఆటపట్టించేవాడు. ఆ స్థానంలో ఆడి కూడా టెస్టులలో 10 అర్థ శతకాలు సాధించడం విశేషం. అతడి అత్యధిక టెస్ట్ మ్యాచ్ స్కోరు భారత్‌పై సాధించిన 92 పరుగులు. టెస్టులలో 376 వికెట్లు, వన్డేలలో 157 వికెట్లు సాధించాడు.
బాల్యం[మార్చు]
1958, ఏప్రిల్ 18 న బార్బడస్ లోని బ్రిడ్జిటౌన్లో మాల్కం మార్షల్ జన్మించాడు. అతడి తండ్రి ఇతనికి క్రికెట్‌పై మంచి ప్రాత్సాహాన్ని ఇచ్చాడు. దురదృష్టవశాత్తు ఇతని విజయాలు చూడకనే తండ్రి రోడ్డు ప్రమాదంలో మరణించాడు.
క్రీడా జీవితం[మార్చు]
1979 ప్రపంచ కప్ కు ఇతడు ఎన్నికైననూ ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం దొరకలేదు. 1980లో ఓల్డ్ ట్రఫోర్డ్లో జరిగిన టెస్టుమ్యాచ్‌తో అంతర్జాతీయ క్రీడా జీవితాన్ని ఆరంగేట్రం చేసాడు. 1982-83 నుంచి 1985-86 వరకు 7 టెస్టు సీరీలను ఆడి ప్రతిసారి 21 అంతకు మించి వికెట్లు సాధించాడు. 1983-84 లో భారత్తో జరిగిన సీరీస్‌లో 33 వికెట్లు పడగొట్టినాడు. అదే సీరీస్‌లో కాన్పూర్లో జరిగిన టెస్టులో బ్యాటింగ్‌లో రాణించి తన అత్యుత్తమ స్కోరు 92 పరుగులు సాధించాడు. 1984 నాటికి ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్‌గా పేరుపొందినాడు. అదే సంవత్సరం ఇంగ్లాండుతో హెడింగ్లీలో జరిగిన మ్యాచ్‌లో 53 పరుగులకే 7 వికెట్లు తీసి ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌ను పేకమేడలా కూల్చివేశాడు. అంతకు ముందు తొలి ఇన్నింగ్సులో ఫీల్డింగ్ చేస్తూ బొటనవ్రేలికి గాయం చేసుకొని కూడా అత్యుత్తమ బౌలింగ్ చేయడం అతనికే చెల్లింది. బ్యాటింగ్‌లో కూడా 11 వ స్థానంలో వచ్చి ఒంటిచేత్తో బ్యాటింగ్ చేశాడు.
1988లో ఇంగ్లాండుతో జరిగిన ఒళ్డ్ ట్రపోర్ద్ మ్యాచ్‌లో 22 పరుగులకే 7 వికెట్లు సాధించాడు. ఆ సీరీస్‌లో 12.65 సగటుతో 35 వికెట్లు పడగొట్టినాడు. ఆ తరువాత భారత్‌తో జరిగిన పోర్ట్ ఆప్ స్పెయిన్ టెస్టులో 11 వికెట్లు సాధించాడు. 1991లో జరిగిన ఓవల్ టెస్ట్ అతని చివరి టెస్ట్. అక్కడ గ్రాహం గూచ్ను ఔట్ చేసి తన చివరి వికెట్ (376 వ) ను ఖాతాలో వేసుకున్నాడు.
టెస్ట్ క్రికెట్ నుంచి నిష్క్రమించిననూ వన్డే పోటీలలో ఆడుతూ 1992 ప్రపంచ కప్ క్రికెట్ పోటీలకు ప్రాతినిధ్యం వహించాడు. కాని అంతగా ప్రభావితం చేయలేకపోయాడు. 5 పోటీలలో కేవలం 2 వికెట్లు మాత్రమే సాధించి నిరాశ కలిగించాడు.
జీవిత చరమాంకం[మార్చు]
అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్‌మెంట్ అయిన పిదప వెస్టీండీస్, హాంప్‌షైర్ జట్లకు కోచింగా బాధ్యతలు చేపట్టాడు. కాని ఆ దశలో వెస్టీండీస్ పతనావస్థ దశకు చేరుకొనడంతో మార్షల్ విమర్శలను ఎదుర్కొన్నాడు. దీన్ని మరుపించే దశలో 1999 ప్రపంచ కప్ క్రికెట్ సమయంలో క్యాన్సర్కు గురై, నవంబర్ 11 న తుదిశ్వాస విడిచాడు.
గుర్తింపులు[మార్చు]
మరణానంతరం అతని పేరుమీదుగా వెస్టీండీస్- ఇంగ్లాండు జట్ల మధ్య జరిగే టెస్టు సీరీస్ కు మాల్కం మార్షల్ ట్రోపీ అని నామకరణం చేశారు.