Jump to content

గ్రాహం గూచ్

వికీపీడియా నుండి
గ్రాహం గూచ్

ఇంగ్లాండుకు చెందిన ప్రముఖ క్రికెట్ క్రీడాకారులలో ఒకడైన గ్రాహం గూచ్ (Graham Gooch) 1953, జూలై 23 న జన్మించాడు. ఇంగ్లాండు జాతీయ జట్టుకు, దేశవాళీ పోటీలలో ఎస్సెక్స్ జట్టుకు నేతృత్వం వహించాడు.

1975లో ఆస్ట్రేలియా పై టెస్ట్ క్రికెట్ ఆరంగేట్రం చేసి తొలి టెస్టులోనే రెండు ఇన్నింగ్సులలోనూ సున్నాకే అవుటై [1] రెండో టెస్టులోనూ 6, 31 పరుగులు మాత్రమే చేశాడు. దీనితో సీరీస్ నుంచి తొలిగించబడ్డాడు. ఆ తరువాత 1978 వరకు మళ్ళీ జట్టులో స్థానం పొందలేకపోయాడు. 1982లో దక్షిణాఫ్రికాకు వెళ్ళడంతో మళ్ళీ మూడేళ్ళపాటు నిషేధానికి గురైనాడు. తరువాతి కాలంలో జాతీయ జట్టుకు అనేక సంవత్సరాల పాటు సేవలందించాడు. 1990లో భారత్‌పై లార్డ్స్లో జరిగిన టెస్టులో విశ్వరూపాన్ని ప్రదర్శించి తొలి ఇన్నింగ్సులో 333 పరుగులు, రెండో ఇన్నింగ్సులో 123 పరుగులు చేశాడు. 2006 వరకు ఈ విధంగా ఒకే టెస్టులో ట్రిపుల్ సెంచరీ, సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్‌లలో ఏకైక వ్యక్తిగా నిలిచాడు.[2] అంతేకాకుండా ఒకే టెస్టులో అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఇప్పటికీ ఇతని పేరుమీదుగా ఉంది.[3]

టెస్ట్ క్రికెట్ గణాంకాలు

[మార్చు]

గ్రాహం గూచ్ 118 టెస్టులు ఆడి 42.58 సగటుతో 8900 పరుగులు చేశాడు. అందులో 20 సెంచరీలు, 46 అర్థసెంచరీలు ఉన్నాయి. టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక స్కోరు భారత్‌పై సాధించిన 333 పరుగులు. బౌలింగ్‌లో 23 వికెట్లు కూడా పడగొట్టాడు.

వన్డే గణాంకాలు

[మార్చు]

గూచ్ 125 వన్డేలలో ప్రాతినిధ్యం వహించి 36.98 సగటుతో 4290 పరుగులు చేశాడు. అందులో 8 సెంచరీలు, 23 అర్థసెంచరీలు ఉన్నాయి. వన్డేలలో అతని అత్యధిక స్కోరు 142 పరుగులు. బౌలింగ్‌లో 36 వికెట్లు తీసుకున్నాడు.

అవార్డులు

[మార్చు]
  • 1980లో గ్రాహం గూచ్ విజ్డెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికైనాడు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]

క్రిక్‌ఇన్ఫో - గ్రాహంగూచ్ ప్రొఫైల్