క్రిస్ గేల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
క్రిస్ గేల్

1979, సెప్టెంబర్ 21న జమైకా లోని కింగ్‌స్టన్లో జన్మించిన క్రిస్టోఫర్ క్రిస్ హెన్రీ గేల్ (Christopher "Chris" Henry Gayle) వెస్ట్‌ఇండీస్కు చెందిన క్రికెట్ క్రీడాకారుడు. ఎడమ చేతితో బ్యాటింగ్, కుడి చేతితో బౌలింగ్ చేయగల నైపుణ్యం ఇతనికి ఉంది. 2001 జూలైలో క్రిస్ గేల్స్, డారెన్ గంగాతో కలిసి జింబాబ్వేపై బులావయో మ్యాచ్‌లో తొలి వికెట్టుకు 215 పరుగుల భాగస్వామ్యం చేసి రికార్డు సృష్టించారు.

టెస్ట్ క్రికెట్[మార్చు]

క్రిస్ గేల్స్ ఇంతవరకు 70 టెస్టుమ్యాచ్‌లు ఆడి 4658 పరుగులు చేశాడు. అందులో 7 సెంచరీలు, 28 అర్థసెంచరీలు ఉన్నాయి. అతని అత్యధిక టెస్ట్ స్కోరు 333 పరుగులు. బౌలింగ్‌లో 59 టెస్ట్ వికెట్లు కూడా సాధించాడు.

వన్డే క్రికెట్[మార్చు]

వన్డేలలో 176 మ్యాచ్‌లు ఆడి 6244 పరుగులు సాధించాడు. అందులో 15 సెంచరీలు, 34 అర్థసెంచరీలు ఉన్నాయి. వన్డేలలో అతని అత్యధిక స్కోరు 153 (నాటౌట్) . బౌలింగ్‌లో 142 వన్డే వికెట్లు కూడా సాధించాడు.

ప్రపంచ కప్ క్రికెట్[మార్చు]

క్రిస్ గేల్ 2003, 2007 20l9ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్లలో వెస్ట్‌ఇండీస్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు.

ట్రిపుల్ సెంచరీ[మార్చు]

2005లో దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగవ టెస్ట్ మ్యాచ్‌లో క్రిస్ గేల్ 317 పరుగులు సాధించి తన ప్రతిభను నిరూపించాడు. అంతకు ముందు అదే సీరీస్ తొలి టెస్టులో జట్టు తరఫున స్పాన్సర్‌షిప్ వివాదం వల్ల మరో ఆరుగురు వెస్ట్‌ఇండీస్ క్రికెటర్లతో పాటు ఆడలేకపోయాడు. రెండో, మూడవ టెస్టు మ్యాచ్ ఆడిననూ అంతగా రాణించలేడు. ఆ తరువాత నాలుగవ మ్యాచ్‌లో తన విశ్వరూపాన్ని ప్రదర్శించి దక్షిణాఫ్రికా బౌలింగ్‌ను చితకబాది తన క్రీడా జీవితంలోనే అత్యధిక టెస్ట్ స్కోరును సాధించాడు.

రికార్డ్[మార్చు]

ఢాకా వేదికగా జరిగిన బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్) టోర్నీలో రంగ్‌పూర్ రైడ‌ర్స్‌ తరపున ఏకంగా 18 సిక్సర్లు బాది, కేవలం 69 బంతుల్లో 146 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో నాలుగు ఫోర్లు కూడా ఉన్నాయి. స్ట్రైక్ రేట్ 211.59గా ఉంది.

C.Gayle's record in Twenty20 matches[1]
  Matches Runs HS 100s 50s Avg.
T20I[2] 50 1519 117 2 13 35.33
IPL[3] 96 3563 175* 5 21 42.93
CLT20[4] 6 257 92 0 2 42.83

బయటి లింకులు[మార్చు]

  1. "Statistics / Statsguru / CH Gayle / Twenty20 Internationals". ESPNcricinfo. Archived from the original on 30 అక్టోబర్ 2015. Retrieved 28 మార్చి 2018. {{cite web}}: Check date values in: |archive-date= (help)
  2. "Records / Twenty20 Internationals / Batting records / Most runs in career". ESPNcricinfo. Retrieved 30 June 2015.
  3. "IPL Records-Most Runs". ESPNcricinfo. Archived from the original on 3 ఫిబ్రవరి 2013. Retrieved 28 మార్చి 2018.
  4. "CLT20 Records-Most Runs". ESPNcricinfo. Archived from the original on 1 అక్టోబర్ 2013. Retrieved 28 మార్చి 2018. {{cite web}}: Check date values in: |archive-date= (help)