మహేలా జయవర్థనే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మహేలా జయవర్థనే
Flag of Sri Lanka.svg Sri Lanka
వ్యక్తిగత సమాచారం
బ్యాటింగ్ శైలి కుడిచేతి బ్యాట్స్‌మన్
బౌలింగ్ శైలి రైట్-ఆర్మ్ మీడియం
కెరీర్ గణాంకాలు
TestsODIs
మ్యాచ్‌లు 93 261
పరుగులు 7271 7232
బ్యాటింగ్ సగటు 51.93 33.17
100లు/50లు 21/30 10/42
అత్యుత్తమ స్కోరు 374 128
ఓవర్లు 78 - 97
వికెట్లు 4 - 7
బౌలింగ్ సగటు 58.00 - 79.71
ఒకే ఇన్నింగ్స్ లో 5 వికెట్లు 0 -
ఒకే మ్యాచ్ లో 10 వికెట్లు 0 n/a
అత్యుత్తమ బౌలింగ్ 2/32 2/56
క్యాచ్ లు/స్టంపింగులు 129/- 132/-

As of డిసెంబర్ 7, 2007
Source: [1]

1977, మే 27న కొలంబోలో జన్మించిన మహేలా జయవర్థనే (Mahela Jayawardene) శ్రీలంకకు చెందిన క్రికెట్ క్రీడాకారుడు. 2006లో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌చే అత్యుత్తమ కెప్టెన్‌గా పరిగణించబడ్డాడు. ఇతడు మంచి ఫీల్డర్ కూడా. 1999 ప్రపంచ కప్ తరువాత అత్యధిక రనౌట్లు చేసిన ఫీల్డర్‌గా 2005లో క్రికెట్ ఇన్ఫో తయారుచేసిన నివేదిక ప్రకారం తెలుస్తుంది. [1]

టెస్ట్ క్రీడా జీవితం[మార్చు]

1997లో భారత్‌పై మహేలా జయవర్థనే కొలంబోలో టెస్ట్ క్రికెట్ ఆరంగేట్రం చేశాడు. ఆ టెస్టులో శ్రీలంక 6 వికెట్ల నష్టానికి 952 పరుగులు సాధించి ప్రపంచ రికార్డు సృష్టించింది. అమ్దులో జయవర్థనే 66 చేశాడు. శ్రీలంక క్రికెట్ జట్టు ప్రపంచ రికార్డు అధికమించే సమయంలో మహేలా జయవర్థనే క్రీసులో ఉన్నాడు. 2006లో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో కుమార సంగక్కరతో కలిసి 624 పరుగుల భాగస్వామ్య ప్రపంచ రికార్డు సృష్టించాడు.

మొత్తం 93 టెస్టులు ఆడి 51.93 సగటుతో 7271 పరుగులు సాధించాడు. అందులో 21 సెంచరీలు మరియు 30 అర్థసెంచరీలు ఉన్నాయి. టెస్ట్ క్రికెట్‌లో అతడి అత్యధిక స్కోరు 374 పరుగులు.

వన్డే గణాంకాలు[మార్చు]

మహేలా జయవర్థనే 1998లో జింబాబ్వేపై తొలి వన్డే ఆడినాడు. ఆ వన్డేలో జయవర్థెనే విజయానికి కావల్సిన పరుగుతీసి శ్రీలంకను గెలిపించాడు. 11 వన్డేల తరువాత ఇంగ్లాండ్‌పై తొలి సెంచరీ నమోదుచేశాడు. ఇప్పటి వరకు వన్డేలలో 13 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు పొందగా వాటన్నింటిలో శ్రీలంక గెలుపొందటం విశేషం.

జయవర్థనే 261 వన్డేలు ఆడి 33.17 సగటుతో 7232 పరుగులు సాధించాడు. అందులో 10 సెంచరీలు మరియు 42 అర్థసెంచరీలు ఉన్నాయి. వన్డేలలో అతడి అత్యధిక స్కోరు 128 పరుగులు.

ప్రపంచ కప్ క్రికెట్[మార్చు]

మహేలా జయవర్థనే 3 ప్రపంచ కప్ క్రికెట్ పోటీలలో శ్రీలంక క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. తొలిసారిగా 1999లో ప్రపంచ కప్ క్రికెట్ ఆడినాడు. ఆ తరువాత 2003 మరియు 2007లలో కూడా ప్రపంచ కప్ టోర్నమెంటులో పాల్గొన్నాడు.

మూలాలు[మార్చు]

  1. Basevi, Trevor (2005-11-08). "Statistics - Run outs in ODIs". Retrieved 2007-02-05. Text " publisher Cricinfo" ignored (help); Cite web requires |website= (help); Check date values in: |date= (help)