Jump to content

లసిత్ మలింగ

వికీపీడియా నుండి
లసిత్ మలింగ

1983, ఆగష్టు 28న జన్మించిన లసిత్ మలింగ శ్రీలంక క్రికెట్ జట్టుకు చెందిన క్రీడాకారుడు. ఫాస్ట్ బౌలింగ్ వేయడంలో నేర్పరి అయిన మలింగ ఇప్పటి వరకు 24 టెస్టులు, 45 వన్డేలలో శ్రీలంక జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

టెస్ట్ క్రికెట్ గణాంకాలు

[మార్చు]

లసిత్ మలింగ 24 టెస్టులలో 30.73 సగటుతో 83 వికెట్లు సాధించాడు. అందులో ఒకే ఇన్నింగ్సులో 5 వికెట్లను రెండు సార్లు పడగొట్టినాడు. అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషన 68 పరుగులకు 5 వికెట్లు. బ్యాటింగ్‌లో 132 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 42 నాటౌట్.

వన్డే క్రికెట్ గణాంకాలు

[మార్చు]

మలింగ 45 వన్డేలలో ప్రాతినిధ్యం వహించి 24.67 సగటుతో 67 వికెట్లు సాధించాడు. అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 44 పరుగులకు 4 వికెట్లు.

రిటైర్మెంట్‌

[మార్చు]

బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి వన్డేలో లంక 91 పరుగుల తేడాతో విజయం సాధించి వెటరన్‌ పేసర్‌ మలింగకు ఘనంగా వీడ్కోలు పలికింది. 2011లో టెస్టులకు వీడ్కోలు చెప్పిన మలింగ. ఇటీవలే వన్డేలకు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ఇక మలింగ టీ20లకు మాత్రమే అందుబాటులో ఉండనున్నాడు.

మూలాలు

[మార్చు]