రోషన్ మహనామా
రోషన్ మహనామా | ||||
![]() | ||||
వ్యక్తిగత సమాచారం | ||||
---|---|---|---|---|
బ్యాటింగ్ శైలి | కుడిచేతి బ్యాటింగ్ | |||
కెరీర్ గణాంకాలు | ||||
Tests | ODIs | |||
మ్యాచ్‌లు | 52 | 213 | ||
పరుగులు | 2576 | 5162 | ||
బ్యాటింగ్ సగటు | 29.27 | 29.49 | ||
100లు/50లు | 4/11 | 4/35 | ||
అత్యుత్తమ స్కోరు | 225 | 119* | ||
ఓవర్లు | 6 | 0.2 | ||
వికెట్లు | - | - | ||
బౌలింగ్ సగటు | - | - | ||
ఒకే ఇన్నింగ్స్ లో 5 వికెట్లు | - | - | ||
ఒకే మ్యాచ్ లో 10 వికెట్లు | - | n/a | ||
అత్యుత్తమ బౌలింగ్ | - | - | ||
క్యాచ్ లు/స్టంపింగులు | 56/- | 109/- | ||
As of 9 ఫిబ్రవరి, 2006 |
1966, మే 31న జన్మించిన రోషన్ మహనామా (Roshan Siriwardene Mahanama) శ్రీలంకకు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు, మ్యాచ్ రెఫరీ.
టెస్ట్ క్రికెట్ గాణాంకాల ప్రకారం మహనామా సగటు 30 పరుగుల కంటే తక్కువగా ఉన్ననూ, శతకాలు 4 మాత్రమే ఉన్ననూ అత్యధిక వ్యక్తిగత స్కోరు 225 పరుగులు సాధించిన కొలంబో టెస్టులో సనత్ జయసూర్యతో కలిసి రెండో వికెట్టుకు ప్రపంచ రికార్డు భాగస్వామ్యం నెలకొల్పినాడు. భారత్ పై జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో వీరిరువురు కలిసి 576 పరుగులు రెండో వికెట్టుకు జోడించి 63 సంవత్సరాలుగా కొనసాగుతున్న రికార్డును తిరగరాశారు.
టెస్ట్ గణాంకాలు[మార్చు]
కొలంబోలో తొలి టెస్టు 1986లో పాకిస్తాన్ పై ఆడినప్పటినుంచి చివరి టెస్ట్ మ్యాచ్ 1998లో దక్షిణాఫ్రికాపై సెంచూరియన్‌లో ఆడేవరకు రోషన్ మహనామా మొత్తం 52 టెస్టుమ్యాచ్‌లలో 89 ఇన్నింగ్సులు ఆడి 29.27 సగటుతో 4 సెంచరీలు, 11 అర్థసెంచరీలతో 2576 పరుగులు సాధించాడు. టెస్ట్ క్రికెట్‌లో అతని అత్యధిక స్కోరు కొలంబోలో సాధించిన 225 పరుగులు. టెస్టులలో రెండు సిక్సర్లు సాధించాడు.
టెస్ట్ క్రికెట్‌లో రోషన్ మహనామా సాధించిన సెంచరీలు | ||||||
---|---|---|---|---|---|---|
పరుగులు | మ్యాచ్ | ప్రత్యర్థి | నగరం | వేదిక | సంవత్సరం | |
[1] | 153 | 15 | న్యూజీలాండ్ | మొరాటువా, శ్రీలంక | టిరాన్ ఫెర్నాండో స్టేడియం | 1992 |
[2] | 109 | 16 | న్యూజీలాండ్ | కొలంబో, శ్రీలంక | సింహళీస్ స్పోర్ట్స్ గ్రౌండ్ | 1992 |
[3] | 151 | 20 | భారతదేశం | కొలంబో, శ్రీలంక | పి.శరవణముత్తు స్టేడియం | 1993 |
[4] | 225 | 44 | భారతదేశం | కొలంబో, శ్రీలంక | పి.శరవణముత్తు స్టేడియం | 1997 |
వన్డే గణాంకాలు[మార్చు]
మహనామా 213 వన్డేలలో శ్రీలంక జట్టుకి ప్రాతినిధ్యం వహించి 29.49 సగటుతో 5162 పరుగులు సాధించాడు. అందులో 4 సెంచరీలు, 35 అర్థసెంచరీలు ఉన్నాయి. వన్డేలలో అతడి అత్యధిక స్కోరు 119 (నాటౌట్).
ప్రపంచ కప్ క్రికెట్[మార్చు]
మహనామా మొదటిసారి 1987 ప్రపంచ కప్ పోటీలలో ప్రాతినిధ్యం వహించి ఆ తరువాత 1992 లోనూ, శ్రీలంక విశ్వవిజేతగా నిలిచిన 1996లో, చివరిసారిగా 1999లో పాల్గొన్నాడు.