రవి రత్నాయకె

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రవి రత్నాయకె

1960, మే 2న జన్మించిన రవి రత్నాయకె (Ravi Ratnayeke) శ్రీలంకకు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు. రవి రత్నాయకె 1982 నుండి 1990 వరకు 22 టెస్టులలో, 78 వన్డేలలో శ్రీలంక జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. పాకిస్తాన్ లోని సియాల్‌కోట్‌లో కల జిన్నా స్టేడియంలో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో 83 పరుగులకే 8 వికెట్లు సాధించాడు. అది అప్పటికి శ్రీలంక తరఫున రికార్డుగా కొనసాగింది. అర్జున రణతుంగ నాయకత్వంలో ఉపసారథిగా కూడా రవి రత్నాయకె వ్యవహరించాడు.[1]

ప్రారంభ రోజులు[మార్చు]

కాండీలోని ట్రినిటి కళాశాలలో విద్యనభ్యసించిన రవి రత్నాయకె 1981-82లో మొట్టమొదటి ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్ శ్రీలంక అండర్-25 తరఫున తమిళనాడు అండర్-25 పై ఆడినాడు. అందులో అశాంత డి మెల్తో బౌలింగ్ ప్రారంభించి ఆ మ్యాచ్‌లో 3 వికెట్లు పడగొట్టి శ్రీలంక సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. తద్వారా 1981లో ఇంగ్లాండు పర్యటించే శ్రీలంక జట్టులో స్థానం సంపాదించి 15 మ్యాచ్‌ల పర్యటనలో[2] 6 మ్యాచ్‌లకు ఆడి[3] 9 వికెట్లను సాధించాడు.[4] సస్సెక్స్‌లో జరిగిన ఒకే మ్యాచ్‌లో 5 వికెట్లను పడగొట్టినాడు.[5]

టెస్ట్ క్రికెట్ గణాంకాలు[మార్చు]

రవి రత్నాయకె 1982 మార్చి 5న పాకిస్తాన్ పై కరాచిలో తొలి టెస్ట్ ఆడినప్పటినుంచి 1989 డిసెంబర్లో ఆస్ట్రేలియాపై చివరి టెస్ట్‌మ్యాచ్ ఆడేవరకు మొత్తం 22 మ్యాచ్‌లలో 35.21 సగటుతో 56 వికెట్లను సాధించాడు. టెస్టులలో అతడి అత్యున్నత బౌలింగ్ విశ్లేషణ 83 పరుగులకు 8 వికెట్లు. ఒకే ఇన్నింగ్సులో 5 వికెట్లను 4 సార్లు సాధించాడు. బ్యాటింగ్‌లో 25.21 సగటుతో 807 పరుగులు చేశాడు. టెస్ట్ క్రికెట్‌లో అతడి అత్యధిక స్కోరు 93 పరుగులు. మొత్తం 5 అర్థసెంచరీలు సాధించాడు.

వన్డే గణాంకాలు[మార్చు]

రత్నాయకె 1982 మార్చి 12న పాకిస్తాన్‌పై కరాచిలో తొలి వన్డే ఆడి 1990 మేలో ఆస్ట్రేలియాపై షార్జాలో చివరి వన్డే ఆడేవరకు మొత్తం 78 మ్యాచ్‌లలో జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. వన్డేలలో 33.71 సగటుతో 85 వికెట్లను సాధించాడు. అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 23 పరుగులకు 4 వికెట్లు. బ్యాటింగ్‌లో 824 పరుగులు సాధించాడు. వన్డేలలో అతడి అత్యధిక స్కోరు 50 పరుగులు.

మూలాలు[మార్చు]

  1. Vaas: Lanka`s unsung hero from LankaNewspapers.com, retrieved 1 May 2006
  2. Sri Lanka in England 1981 Archived 2012-06-03 at the Wayback Machine from CricketArchive, retrieved 1 May 2006
  3. First-Class Matches played by Ravi Ratnayeke (71) Archived 2007-10-01 at the Wayback Machine from CricketArchive, retrieved 1 May 2006
  4. First-class Bowling in England for 1981 (Ordered by Average) Archived 2008-09-05 at the Wayback Machine, from CricketArchive, retrieved 1 May 2006
  5. Sussex v Sri Lankans in 1981 Archived 2007-10-01 at the Wayback Machine, from CricketArchive, published on 1 May 2006