Jump to content

డాన్ అరుణసిరి

వికీపీడియా నుండి
Don Anurasiri
క్రికెట్ సమాచారం
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుSlow left-arm orthodox
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలుs]]
మ్యాచ్‌లు 18 45
చేసిన పరుగులు 91 62
బ్యాటింగు సగటు 5.35 10.33
100లు/50లు -/- -/-
అత్యధిక స్కోరు 24 11
వేసిన బంతులు 3973 2100
వికెట్లు 41 32
బౌలింగు సగటు 37.75 45.75
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు - -
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు - n/a
అత్యుత్తమ బౌలింగు 4/71 3/40
క్యాచ్‌లు/స్టంపింగులు 4/- 10/-
మూలం: [1], 2006 ఫిబ్రవరి 9

1966 ఫిబ్రవరి 25న జన్మించిన డాన్ అరుణసిరి (Sangarange Don Anurasiri) శ్రీలంకకు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు. ఎడమచేతి స్పిన్నర్ అయిన ఇతడు 18 టెస్టులలో, 45 వన్డే మ్యాచ్‌లలో శ్రీలంక జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

1986 మార్చి 14న తన ఇరువది ఏటనే కొలంబోలో పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్‌తో టెస్ట్ క్రికెట్‌లో ఆరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 4 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. అప్పటికే శ్రీలంక జట్టు 8 వికెట్లతో విజయం సాధించింది. తాను ఆడిన 18 టెస్టులలో ఏ ఇన్నింగ్సులోనూ 5 వికెట్లకు మించి వికెట్లు సాధించకున్ననూ ప్రముఖ బౌలర్‌గానే కొనసాగినాడు. 1992-93లో ఆస్ట్రేలియాతో జరిగిన సీరీస్‌లో 10 వికెట్లు సాధించాడు. ఇదే అత్యుత్తమ సీరీస్ గణాంకము.

1994లో శ్రీలంక క్రికెట్‌లో వచ్చిన వివాదంతో అతని అంతర్జాతీయ క్రికెట్ తాత్కాలికంగా ఆగిననూ 1997-98లో జింబాబ్వే సీరీస్‌తో మళ్ళీ జట్టులోకి వచ్చాడు. ముత్తయ్య మరళీధరన్తో కలిసి బౌలింగ్ చేశాడు. ఆ తరువాత కొద్దికాలానికే అతని అంతర్జాతీయ క్రీడా జీవితం ముగిసింది.

టెస్ట్ క్రికెట్ గణాంకాలు

[మార్చు]

అరుణసిరి 18 టెస్టులకు ప్రాతినిధ్యం వహించి 37.75 సగటుతో 41 వికెట్లను సాధించాడు. అతని అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 71 పరుగులకు 4 వికెట్లు. బ్యాటింగ్‌లో 5.35 సగటుతో 91 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 24 పరుగులు.

వన్డే క్రికెట్ గణాంకాలు

[మార్చు]

డాన్ అరుణసిరి 45 వన్డేలు ఆడి 45.75 సగటుతో 32 వికెట్లు సాధించాడు. వన్డేలలో అతడి అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 40 పరుగులకు 3 వికెట్లు. బ్యాటింగ్‌లో అత్యధిక స్కోరు 11 పరుగులు.

ప్రపంచ కప్ క్రికెట్

[మార్చు]

అరుణసిరి రెండు సార్లు ప్రపంచ కప్ టోర్నమెంట్లలో పాల్గొన్నాడు. మొదటిసారి 1987లో ఆ తరువాత 1992లో జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.