Jump to content

దులీప్ మెండిస్

వికీపీడియా నుండి

1952, ఆగష్టు 25న జన్మించిన దులీప్ మెండిస్ (Duleep Mendis) శ్రీలంకకు చెందిన మాజీ క్రికెట్ ఆటగాడు. 1985లో శ్రీలంకకు తొలి టెస్ట్ సీరీస్ విజయాన్ని అందించిన కెప్టెన్ కూడా ఇతడే. 1982 నుంచి 1985 వరకు బ్యాట్స్‌మెన్‌గా ఇతడు చక్కగా రాణించాడు.

1972లో శ్రీలంకలో పర్యటించిన తమిళనాడు క్రికెట్ టీంతో తొలిసారిగా శ్రీలంక తరఫున ఆడినాడు. అంతర్జాతీయ మ్యాచ్‌గా గుర్తింపు లేని ఆ మ్యాచ్‌లో మెండిస్ తొలి ఇన్నింగ్సులో 52 రెండో ఇన్నింగ్సులో 34 పరుగులు చేసిననూ ఇన్నింగ్సు ఓటమిని ఆపలేకపోయాడు. 1975 ప్రపంచ కప్ పోటీలలో వెస్ట్‌ఇండీస్ పై తొలి అంతర్జాతీయ వన్డే పోటీ ఆడినాడు. 1982లో ఇంగ్లాండుతో తొలి టెస్ట్ మ్యాచ్ ఆడినాడు.

టెస్ట్ క్రికెట్ గణాంకాలు

[మార్చు]

మెండిస్ 24 టెస్టులు ఆడి 31.64 సగటుతో 1329 పరుగులు సాధించాడు. అందులో 4 సెంచరీలు, 8 అర్థసెంచరీలు ఉన్నాయి. టెస్ట్ క్రికెట్‌లో అతడి అత్యధిక స్కోరు 124 పరుగులు.

వన్డే క్రికెట్ గణాంకాలు

[మార్చు]

మెండీస్ 79 వన్డే మ్యాచ్‌లలో 23.49 సగటుతో 7 అర్థసెంచరీలతో 1527 పరుగులు సాధించాడు. వన్డేలలో అతడి అత్యధిక స్కోరు 80 పరుగులు.

ప్రపంచ కప్ క్రికెట్

[మార్చు]

దులీప్ మెండిస్ 1975లో తొలి ప్రపంచ కప్ నుంచి వరుసగా 4 ప్రపంచ కప్ పోటీలలో పాల్గొన్నాడు. 1979 ప్రపంచ కప్‌లో తన తొలి వన్డే అర్థసెంచరీని పూర్తిచేసుకున్నాడు. ప్రారంభంలో టెస్ట్ హోద్ఫా కూడా లేని శ్రీలంక జట్టు పసికూనగా ప్రపంచ కప్‌లో పాల్గొన్ననూ 1996లో అందరినీ ఆశ్చర్యపరుస్తూ చాంపియన్ అయిన శ్రీలంక క్రికెట్ జట్టుకు మేనేజర్‌గా దులీప్ మెండిస్ కావడం గమనార్హం.