అరవింద డి సిల్వ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అరవింద డి సిల్వా
අරවින්ද ද සිල්වා.
SPGPECT120.jpg
1996 ప్రపంచ కప్పు ఫైనల్లో శతకం కొట్టాక విజయ నాదం చేస్తున్న అరవింద డి సిల్వా (ఎడమ)
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు పిన్నడువాగే అరవింద డి సిల్వా
జననం (1965-10-17) 1965 అక్టోబరు 17 (వయసు 57)
Colombo, Ceylon
ఇతర పేర్లు మ్యాడ్ మ్యాక్స్
బ్యాటింగ్ శైలి Right-handed
బౌలింగ్ శైలి Right-arm off break
పాత్ర బ్యాట్స్‌మన్
అంతర్జాతీయ సమాచారం
జాతీయ జట్టు శ్రీలంక
టెస్టు అరంగ్రేటం(cap 27) 23 August 1984 v England
చివరి టెస్టు జూలై 23 2002 v బంగ్లాదేశ్
వన్డే లలో ప్రవేశం(cap 37) ఏప్రిల్ 31 1984 v న్యూ జీలాండ్
చివరి వన్డే మార్చి 18 2003 v ఆస్ట్రేలియా
దేశవాళీ జట్టు సమాచారం
సంవత్సరాలు జట్టు
1989–2002 క్రికెట్ క్లబ్
1995 కెంట్
1996/1997 ఆక్లండ్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్డేలు ఫస్ట్ క్లాస్ ఎ లిస్టు
మ్యాచ్‌లు 93 308 220 392
సాధించిన పరుగులు 6,361 9,284 15,000 12,095
బ్యాటింగ్ సగటు 42.97 34.90 48.38 36.32
100s/50s 20/22 11/64 43/71 17/77
ఉత్తమ స్కోరు 267 145 267 158*
బాల్స్ వేసినవి 2,595 5,148 9,005 7,377
వికెట్లు 29 106 129 156
బౌలింగ్ సగటు 41.65 39.40 29.17 36.30
ఇన్నింగ్స్ లో 5 వికెట్లు 0 0 8 0
మ్యాచ్ లో 10 వికెట్లు 0 0 1 0
ఉత్తమ బౌలింగ్ 3/30 4/30 7/24 4/28
క్యాచులు/స్టంపింగులు 43/– 95/– 108/– 116/–
Source: Cricinfo, ఆగస్టు 25 2007

అరవింద డి సిల్వ (ఆంగ్లం Aravinda de Silva) శ్రీలంకకు చెందిన ప్రముఖ క్రికెట్ ఆటగాడు. ఇతడు 17 అక్టోబర్, 1965న కొలంబోలో జన్మించాడు. ఈ శతాబ్దంలోనే శ్రీలంకకి చెందిన ప్రముఖ క్రికెటర్‌గా పరిగణించబడతాడు.[1]

క్రీడా జీవితం[మార్చు]

అరవింద డి సిల్వ 1984లో ఇంగ్లాండుతో లార్డ్స్|లో జరిగిన మ్యాచ్ ద్వారా టెస్ట్ క్రికెట్ ఆరంగేట్రం చేశాడు.[2] 1996లో జరిగిన ప్రపంచ కప్ క్రికెట్‌లో శ్రీలంక విజయానికి చాలా సహకారం అందించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ పోటీలో బ్యాటింగ్‌లో సెంచరీ, బౌలింగ్‌లో 3 వికెట్లు సాధించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు పొందినాడు. టెస్ట్ క్రికెట్‌లో రెండు ఇన్నింగ్సులలోనూ సెంచరీలు రెండు సార్లు సాధించాడు. భారత్కు చెందిన సునీల్ గవాస్కర్, ఆస్ట్రేలియాకు చెందిన రికీ పాంటింగ్ ల తరువాత (వీరు మూడేసి సార్లు ఈ ఘనత సాధించారు) స్థానం ఇతనిదే.

టెస్ట్ క్రికెట్ గణాంకాలు[మార్చు]

అరవింద డి సిల్వ 93 టెస్టులకు ప్రాతినిధ్యం వహించి 42.97 సగటుతో 6361 పరుగులు సాధించాడు. అందులో 20 సెంచరీలు, 22 అర్థసెంచరీలు ఉన్నాయి. టెస్ట్ క్రికెట్‌లో అతని అత్యధిక స్కోరు 267 పరుగులు. బౌలింగ్‌లో 29 వికెట్లు కూడా సాధించాడు. టెస్ట్ క్రికెట్‌లో ఇతని అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 30 పరుగులకు 3 వికెట్లు.

వన్డే క్రికెట్[మార్చు]

అరవింద డి సిల్వ 308 వన్డేలు ఆడి 34.90 సగటుతో 9284 పరుగులు సాధించాడు. అందులో 11 సెంచరీలు, 64 అర్థసెంచరీలు ఉన్నాయి. వన్డేలలో అతని అత్యధిక స్కోరు 145 పరుగులు. బౌలింగ్‌లో 106 వికెట్లు కూడా సాధించాడు. వన్డేలలో అతడి అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 30 పరుగులకు 4 వికెట్లు.

మూలాలు[మార్చు]

  1. "Aravinda de Silva". Cricinfo. Retrieved 2007-10-27.
  2. TEST: England v Sri Lanka at Lord's, 23–28 Aug 1984. Cricinfo. Retrieved on 2007-08-03.