అబ్దుల్ ఖాదిర్ (క్రికెటర్)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అబ్దుల్ ఖాదిర్
అబ్దుల్ ఖాదిర్ ఖాన్ (1990)
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
అబ్దుల్ ఖాదిర్ ఖాన్
పుట్టిన తేదీ(1955-09-15)1955 సెప్టెంబరు 15
లాహోర్, పంజాబ్, పాకిస్తాన్
మరణించిన తేదీ2019 సెప్టెంబరు 6(2019-09-06) (వయసు 63)
లాహోర్, పంజాబ్, పాకిస్థాన్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి లెగ్ బ్రేక్
పాత్రబౌలర్
బంధువులుసులామాన్ ఖదీర్ (కొడుకు)
ఇమ్రాన్ ఖాదిర్ (కొడుకు)
ఉస్మాన్ ఖాదిర్ (కొడుకు)
ఉమర్ అక్మల్ (అల్లుడు)[1]
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 78)1977 డిసెంబరు 14 - ఇంగ్లాండ్ తో
చివరి టెస్టు1990 డిసెంబరు 6 - వెస్టిండీస్ తో
తొలి వన్‌డే (క్యాప్ 43)1983 జూన్ 11 - వెస్టిండీస్ తో
చివరి వన్‌డే1993 నవంబరు 2 - శ్రీలంక తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 67 104 209 147
చేసిన పరుగులు 1029 641 3,740 869
బ్యాటింగు సగటు 15.36 15.26 18.33 14.01
100లు/50లు 0/3 0/0 2/8 0/0
అత్యుత్తమ స్కోరు 61 41* 112 41*
వేసిన బంతులు 16864 5,100 49,036 7,014
వికెట్లు 236 132 960 202
బౌలింగు సగటు 32.81 26.16 23.24 23.09
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 15 2 75 3
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 5 0 21 0
అత్యుత్తమ బౌలింగు 9/56 5/44 9/49 5/31
క్యాచ్‌లు/స్టంపింగులు 15/– 21/– 83/– 92/–
మూలం: ESPNcricinfo, 2019 జనవరి 9

అబ్దుల్ ఖాదిర్ ఖాన్ (1955, సెప్టెంబరు 15 - 2019, సెప్టెంబరు 6)[2] పాకిస్తాన్ తరపున లెగ్ స్పిన్ బౌలింగ్ చేసిన అంతర్జాతీయ క్రికెటర్.[3] 1970లు - 1980ల నుండి లెజెండరీ లెగ్ స్పిన్నర్‌గా పరిగణించబడ్డాడు. లెగ్ స్పిన్నర్లకు రోల్ మోడల్ గా నిలిచాడు.[4] తరువాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వ్యాఖ్యాతగా, చీఫ్ సెలెక్టర్‌గా పనిచేశాడు. పాకిస్తాన్ క్రికెట్ నిర్వాహకులతో అభిప్రాయ భేదాల కారణంగా రాజీనామా చేశాడు.

1977 - 1993 మధ్యకాలంలో 67 టెస్టులు, 104 వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో ఆడాడు. ఐదు వన్డేలలో పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. టెస్ట్ క్రికెట్‌లో, 1987లో ఇంగ్లాండ్‌పై స్వదేశంలో మూడు టెస్టు మ్యాచ్‌లలో 437 పరుగులకు 30 వికెట్లు తీశాడు. ఇది ఇతని అత్యుత్తమ ప్రదర్శన. 1987లో అదే సిరీస్‌లో గడ్డాఫీ స్టేడియంలో అదే జట్టుపై 56 పరుగులకు తొమ్మిది వికెట్లు తీసుకున్న టెస్ట్ ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్ అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను సాధించాడు.[5] 2022 నవంబరులో, ఇతను ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి ప్రవేశించాడు.[6]

వన్డేలలో, 1983 క్రికెట్ ప్రపంచ కప్ సందర్భంగా శ్రీలంకపై 44 పరుగులకు ఐదు వికెట్లు తీశాడు. ఇది అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలుగా నమోదయింది. 1983, 1987 క్రికెట్ ప్రపంచ కప్‌లలో పాకిస్తాన్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.

అంతర్జాతీయ కెరీర్[మార్చు]

టెస్ట్ కెరీర్[మార్చు]

అబ్దుల్ ఖాదిర్ 1977, డిసెంబరు 14న తన సొంత మైదానమైన గడ్డాఫీ స్టేడియంలో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యచ్ లో అరంగేట్రం చేశాడు. 1977-90 సమయంలో 67 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు, 236 వికెట్లు తీశాడు, 32.80 సగటుతో 15 ఐదు వికెట్లు సాధించాడు. 1987లో లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియంలో ఇంగ్లాండ్‌పై అతని అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన. మూడు అర్ధసెంచరీలతో సహా 1,029 పరుగులు చేశాడు.[3] 1990 డిసెంబరులో గడాఫీ స్టేడియంలో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్ లో చివరి టెస్ట్ ఆడాడు.[7]

వన్ డే ఇంటర్నేషనల్ కెరీర్[మార్చు]

1983 క్రికెట్ ప్రపంచ కప్ సందర్భంగా ఎడ్జ్‌బాస్టన్‌లో న్యూజిలాండ్‌పై అబ్దుల్ ఖాదిర్ తన వన్డే క్రికెట్ అరంగేట్రం చేశాడు; 12 ఓవర్లలో 21 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీశాడు. ఇతనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.[8] ఆ టోర్నమెంట్‌లో 22.00 సగటుతో 264 పరుగులకు 12 వికెట్లు తీశాడు.[9]

కెప్టెన్సీ[మార్చు]

అబ్దుల్ ఖాదిర్ కెప్టెన్‌గా రాణించలేకపోయాడు. 1987-88, 1988-89 మధ్యకాలంలో ఐదు టెస్ట్ మ్యాచ్‌లలో పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు నాయకత్వం వహించాడు, వాటిలో నాలుగింటిలో ఓడిపోయాడు.[10] రెగ్యులర్ కెప్టెన్ జావేద్ మియాందాద్ లేకపోవడంతో ఇంగ్లాండ్‌పై మొదటిసారి పాకిస్థాన్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు.[11] వన్డే మ్యాచ్‌లలో, 1988 ఆసియా కప్‌లో వరుసగా నాలుగో, ఐదవ మ్యాచ్‌లో బంగ్లాదేశ్, భారత్ తో జరిగిన మ్యాచ్ లలో పాకిస్తాన్‌కు నాయకత్వం వహించాడు; బంగ్లాదేశ్‌ను 173 పరుగుల తేడాతో ఓడించిన పాకిస్థాన్, భారత్ చేతిలో నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయింది.[12][13]

చీఫ్ సెలెక్టర్ గా[మార్చు]

2008 నవంబరులో భారతదేశంతో జరిగే సిరీస్‌కి చీఫ్ సెలెక్టర్‌గా నియమించబడ్డాడు.[14] మూడు టెస్టులు, ఐదు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌కి పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వడానికి షెడ్యూల్ చేయబడింది; 2008 ముంబై దాడుల తర్వాత ఇరు దేశాల దౌత్య సంబంధాలు క్షీణించడంతో సిరీస్ జరగలేదు.[15] 2009 జూన్ లో తన పదవికి రాజీనామా చేశాడు.[16]

వ్యక్తిగత జీవితం[మార్చు]

అబ్దుల్ ఖాదిర్ 1955 సెప్టెంబర్ 15న పాకిస్థాన్‌లోని పంజాబ్‌లోని లాహోర్‌లో జన్మించాడు.[3] ఇతని సోదరుడు, అలీ బహదూర్, 1986-87లో 10 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లలో పాల్గొన్న లెగ్-స్పిన్నర్ గా రాణించాడు.[17] అబ్దుల్ ఖాదిర్ ముగ్గురు కుమారులు రెహ్మాన్ ఖాదిర్, ఇమ్రాన్ ఖాదిర్, సులామాన్ ఖాదిర్ కూడా ఫస్ట్-క్లాస్ పోటీలో వివిధ పాకిస్తాన్ జట్లకు ప్రాతినిధ్యం వహించారు.[18] [19][20] ఇతని చిన్న కుమారుడు ఉస్మాన్ ఖాదిర్ 12 లిస్ట్ ఎ మ్యాచ్‌లలో ఆడాడు.[21] ఇతని కుమార్తె, నూర్ అమీనా, ఉమర్ అక్మల్‌ను వివాహం చేసుకుంది.[22]

మరణం[మార్చు]

అబ్దుల్ ఖాదిర్ 64వ పుట్టినరోజుకు తొమ్మిదిరోజుల ముందు[23] 2019 సెప్టెంబరు 7న గుండెపోటుతో లాహోర్‌లో మరణించాడు.[24][25] ఖదీర్ తన మరణించాడు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ అబ్దుల్ ఖాదిర్‌కు నివాళులు అర్పించింది.[26]

మూలాలు[మార్చు]

 1. "Umar Akmal in trouble over wedding celebrations". The National. 16 April 2014.
 2. "Pakistan's Abdul Qadir dies aged 63". ESPNcricinfo. Retrieved 2023-09-19.
 3. 3.0 3.1 3.2 "Player profile: Abdul Qadir". ESPNcricinfo. Retrieved 2023-09-19.
 4. Mason, Peter (13 September 2019). "Abdul Qadir obituary". The Guardian. Retrieved 13 September 2019.
 5. "Records | Test matches | Bowling records | Best figures in an innings | ESPNcricinfo.com". Cricinfo. Retrieved 2023-09-19.
 6. "Shivnarine Chanderpaul, Charlotte Edwards, Abdul Qadir inducted into ICC Hall of Fame". ESPNcricinfo. Retrieved 2023-09-19.
 7. "West Indies tour of Pakistan, 1990/91: Test series – 3rd Test". ESPNcricinfo. Retrieved 2023-09-19.
 8. "Prudential World Cup, 1983 – 6th match, Group A". ESPNcricinfo. Retrieved 2023-09-19.
 9. "Records / Prudential World Cup, 1983 / Most wickets". ESPNcricinfo. Retrieved 2023-09-19.
 10. "Pakistan / Records / One-Day Internationals / List of captains". ESPNcricinfo. Retrieved 2023-09-19.
 11. "Pakistan vs England in 1987–88". ESPNcricinfo. Retrieved 2023-09-19.
 12. "Wills Asia Cup, 1988/89 – 4th ODI". ESPNcricinfo. Retrieved 2023-09-19.
 13. "Wills Asia Cup, 1988/89 – 5th ODI". ESPNcricinfo. Retrieved 2023-09-19.
 14. "Qadir appointed Pakistan's chief selector". ESPNcricinfo. 20 November 2008. Retrieved 2023-09-19.
 15. Staff, Cricinfo (18 December 2008). "India call off Pakistan tour on government advice". ESPNcricinfo. Retrieved 2023-09-19.
 16. "Abdul Qadir resigns as Pakistan's chief selector". The Guardian. 8 June 2009. Retrieved 2023-09-19.
 17. "Player profile: Ali Bahadur". ESPNcricinfo. Retrieved 2023-09-19.
 18. "Player profile: Rehman Qadir". ESPNcricinfo. Retrieved 2023-09-19.
 19. "Player profile: Imran Qadir". ESPNcricinfo. Retrieved 2023-09-19.
 20. "Player profile: Sulaman Qadir". ESPNcricinfo. Retrieved 2023-09-19.
 21. "Player profile: Usman Qadir". ESPNcricinfo. Retrieved 2023-09-19.
 22. "Abdul Qadir". ESPNcricinfo. 8 June 2020.
 23. "Obituary: Abdul Qadir". International Cricket Council. Retrieved 2023-09-19.
 24. Bilal, Abu Bakar; Siddique, Imran (2023-09-19). "Cricket legend Abdul Qadir Khan dies of cardiac arrest in Lahore". dawn.com.
 25. "I have lost a good friend: Pakistan PM Imran Khan mourns Abdul Qadir's death". India Today. 2023-09-19.
 26. "PCB pays tribute to Abdul Qadir". Pakistan Cricket Board. Retrieved 2023-09-19.

బాహ్య లింకులు[మార్చు]