లెగ్ స్పిన్

వికీపీడియా నుండి
(లెగ్ బ్రేక్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఓవర్ ది వికెట్ నుండి వేసిన లెగ్ స్పిన్ లేదా లెగ్ బ్రేక్ డెలివరీ
రౌండ్‌ ది వికెట్ లో వేసిన లెగ్ స్పిన్ లేదా లెగ్ బ్రేక్ డెలివరీ

లెగ్ స్పిన్ అనేది క్రికెట్‌లో ఒక రకమైన స్పిన్ బౌలింగు. లెగ్ స్పిన్నరు కుడిచేత్తో, మణికట్టును తిప్పుతూ బంతికి స్పిన్‌ను ఇస్తూ బౌలింగు చేస్తాడు. పిచ్‌పై బంతి బౌన్స్ అయ్యాక బంతి, కుడి నుండి ఎడమకు (బౌలరు దృక్కోణం నుండి) స్పిన్ అవుతుంది. కుడిచేతి బ్యాటరుకు, అది లెగ్ సైడ్ నుండి ఆఫ్ సైడుకు పోతుంది. అందుకే దీనికి లెగ్ బ్రేక్ అని పేరు వచ్చింది. [1]

లెగ్ స్పిన్నర్లు ఎక్కువగా లెగ్ బ్రేక్‌లను బౌల్ చేస్తారు. లైను, లెంగ్తులను మారుస్తూ వైవిధ్యం తీసుకువస్తారు. బంతి సైడ్ స్పిన్, టాప్‌స్పిన్ లను మార్చడం కూడా చేస్తారు. లెగ్ స్పిన్నర్లు సాధారణంగా గాలిలో బంతిని లూప్ చేయడం, ఫ్లైట్ చేఅయదం లోని వైవిధ్యాలను కూడా ఉపయోగిస్తారు. బంతిని బౌన్స్ అవడానికి ముందు డిప్ చేయడం, డ్రిఫ్ట్ చేయడం చేస్తారు. లెగ్ స్పిన్నర్లు గూగ్లీ వంటి ఇతర రకాల డెలివరీలను కూడా వేస్తారు.

వివిధ మూలాల్లో 'లెగ్ స్పిన్', 'లెగ్ స్పిన్నర్', 'లెగ్ బ్రేక్', 'లెగ్గీ' అంటూ వివిధ రకాలుగా దీన్ని ఉదహరిస్తారు.

టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన రెండవ, నాలుగవ బౌలర్లు షేన్ వార్న్, అనిల్ కుంబ్లేలు లెగ్ స్పిన్నర్లే. [2] లెగ్ స్పిన్‌కు ఒక ప్రసిద్ధ ఉదాహరణ వార్న్ వేసిన బాల్ ఆఫ్ ది సెంచరీ.

చరిత్ర

[మార్చు]

1970లు, 1980లలో వెస్టిండీస్, ఆ తర్వాత ఆస్ట్రేలియా జట్లు ప్రత్యేకంగా ఫాస్టు బౌలర్లను బాగా ఉపయోగించుకోవడం వల్ల, లెగ్ స్పిన్ ఆట నుండి అదృశ్యమవుతుందని భావించారు. ఈ సమయంలో పాకిస్తాన్‌కు చెందిన అబ్దుల్ ఖాదిర్ ప్రపంచంలోనే అత్యున్నత స్థాయి లెగ్ స్పిన్నరుగా "ఈ కళను సజీవంగా ఉంచిన" ఘనత పొందాడు. [3] [4] అయితే షేన్ వార్న్ సాధించిన విజయాలతో, లెగ్ స్పిన్ మళ్లీ క్రికెట్ అభిమానులతో, క్రికెట్ జట్లలో విజయవంతమైన భాగంగా వాసికెక్కింది. 1993లో మైక్ గాటింగ్ కు వార్న్ వేసిన అద్భుతమైన బాల్ ఆఫ్ ది సెంచరీతో లెగ్ స్పిన్ దశ తిరిగింది.

ఇతర రకాల బౌలింగ్‌లతో పోలిక

[మార్చు]

లెగ్ స్పిన్నర్ యాక్షను లాగానే (మణికట్టు స్పిన్) ఉండే ఎడమచేతి వాటం బౌలర్‌ను లెఫ్ట్ ఆర్మ్ అనార్థడాక్స్ స్పిన్ బౌలర్ అని పిలుస్తారు. బంతి కూడా వ్యతిరేక దిశలో తిరుగుతుంది.

బంతి పథం లెగ్ స్పిన్ లాగే ఉండి, పిచ్‌పై కుడి నుండి ఎడమకు స్పిన్ అయ్యేలా ఎడమ చేతి బౌలరును వేస్తే దాన్ని లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్ బౌలింగు అంటారు. [5] [6]

అందరు స్పిన్నర్ల మాదిరిగానే, లెగ్ స్పిన్నర్లు బంతిని ఫాస్టు బౌలర్ల కంటే చాలా నెమ్మదిగా బౌలింగు చేస్తారు (70–90 కిమీ/గం లేదా 45–55 mph) . అత్యంత వేగవంతమైన లెగ్ స్పిన్నర్లు కొన్నిసార్లు టాప్ 100 కిమీ/గం లో ఉంటారు. ఖచ్చితత్వంతో బౌలింగు చేయడం చాలా కష్టమైనప్పటికీ, కుడిచేతి వాటం బ్యాటరుకు లెగ్ స్పిన్‌ను ఆడడం అత్యంత ప్రమాదకరంగా ఉంటుంది. ఎందుకంటే ఫ్లైటు, పదునైన మలుపుల కారణంగా బంతిని అంచనా వేయడం చాలా కష్టతరం చేస్తుంది. పైగా బంతి కుడీచేతి బ్యాటరు నుండి దూరంగా పోతుంది. అంచనా సరిగ్గా లేకపోతే, బ్యాటు వెలుపలి అంచుకు తగిలి క్యాచ్ పోతుంది. ఎడమచేతి వాటం బ్యాటరుకు లెగ్ స్పిన్‌ను ఎదుర్కోవడంలో తక్కువ కష్టం ఉంటుంది. ఎందుకంటే బంతి బ్యాటర్ మీదికి వస్తుంది. అంటే బ్యాట్‌ను తప్పిపోయినా లేదా ఎడ్జ్ తీసుకున్నా బ్యాటర్ కాళ్లు సాధారణంగా బంతి మార్గంలో ఉంటాయి. ఇది బౌలర్‌కు బ్యాటర్‌ను బౌల్డ్ చేయడం లేదా లెగ్ బ్రేక్ నుండి క్యాచ్ చేయడం కష్టతరం చేస్తుంది.

లెగ్ స్పిన్: కొన్ని మూలాధారాలు 'లెగ్ స్పిన్' అనే పదాన్ని లెగ్ బ్రేక్‌కి పర్యాయపదంగా సూచిస్తాయి, [7] [8] [9] లెగ్ స్పిన్నర్ వేసిన ఇతర డెలివరీలు 'లెగ్ స్పిన్'గా పరిగణించబడవని ఇది సూచిస్తుంది. అయితే, మరి కొందరు లెగ్ స్పిన్నర్ వేసే డెలివరీలను, నాన్-లెగ్ బ్రేక్ డెలివరీలతో సహా అన్నిటినీ 'లెగ్ స్పిన్' అనే అంటారు.[10] [11] [12]

2017–18 యాషెస్ సిరీస్‌లో లెగ్ బ్రేక్ బౌలింగు చేస్తున్న మాసన్ క్రేన్

లెగ్ బ్రేక్: లెగ్ బ్రేక్ నిర్వచించె కొన్ని సందర్భాల్లో బౌలరు లెగ్ స్పిన్నరు అని ఉంటుంది.[13] [14] [15] అంటే లెగ్ స్పిన్నర్లు మాత్రమే లెగ్ బ్రేక్‌లు వేయగలరని ఇది సూచిస్తుంది; అన్ని లెగ్ బ్రేక్‌లు లెగ్ స్పిన్నర్లే వేస్తారు. మరి కొన్ని లెగ్ బ్రేక్ నిర్వచనాల్లో వేసే బౌలరు లెగ్ స్పిన్నరే అని చెప్పలేదు. లెగ్ బ్రేక్ అనేది కేవలం లెగ్ సైడ్ నుండి ఆఫ్ సైడ్ కు స్పిన్ చేసే డెలివరీ అని , [16] [17] [18] ఇతర రకాల బౌలర్లు కూడా అలా వేయవచ్చు అనీ చెబుతాయి.[19] [20] [21] [22] ఈ సందర్భంలో, లెగ్ బ్రేక్‌లను ఎక్కువగా లెగ్ స్పిన్నర్లే వేస్తారు.[23]

లెగ్ స్పిన్నర్: లెగ్ స్పిన్నర్ అనే పదాన్ని బౌలరుకు, [24] [25] లెగ్ బ్రేక్ బంతికీ కూడా వాడతారు.[26] [27]

లెగ్గీ: లెగ్గీ అనే పదాన్ని బౌలరు [28] లేదా లెగ్ బ్రేక్ డెలివరీ అనే అర్థంలో కూడా ఉపయోగించవచ్చు. [29]

సాంకేతికత

[మార్చు]

బంతిని అరచేతిలో పట్టుకుని, సీమ్‌ అడ్డంగా అన్ని వేళ్ళనూ తాకేలా పట్టుకుని లెగ్ బ్రేక్ వేస్తారు. బంతి విడుదలైనప్పుడు, మణికట్టును ఎడమవైపుకు తిప్పుతారు. బంతిని వదిలేటపుడు ఉంగరపు వేలితో విదిలిస్తారు. దాంతో బంతి అపసవ్య దిశలో (వెనకనుండి చూసినపుడు) స్పిన్ అవుతుంది.

లెగ్-స్పిన్నింగ్ డెలివరీ కోసం బంతి సీమ్‌ అరచేతికి సమాంతరంగా ఉండేలా అరచేతిలో పట్టుకుంటారు. మొదటి రెండు వేళ్ళు ఎడంగా ఉండి బంతిని పట్టుకుంటాయి. మూడవ, నాల్గవ వేళ్లు ఒకదానికొకటి దగ్గరగా ఉండి బంతికి సైడున ఆనుకుని ఉంటాయి. మూడవ వేలు మొదటి కణుపు సీమ్‌ను పట్టుకుని ఉంటుంది. బంతికి సైడున ఉన్న బొటనవేలు బంతిపై ఒత్తిడిని కలిగించదు. బంతిని వేసినప్పుడు, మూడవ వేలు బంతిని ఎక్కువగా స్పిన్‌ చేస్తుంది. చేయి కటి వద్ద నుండి పైకి లేచేటపుడు మణికట్టు కుడీ నుండీ ఎడమ వైపుకు బాగా తిరిగి, బంతిని విడుదల చేస్తూ బంతికి మరింత స్పిన్‌ను ఇస్తుంది. బంతికి ఫ్లైటును ఇచ్చేందుకు బంతిని పైకి వేస్తారు. బంతిని విడుదల చేసినప్పుడు అరచేయి బ్యాటరును చూస్తూ ఉంటుంది.

ప్రముఖ లెగ్ స్పిన్ బౌలర్లు

[మార్చు]
లెగ్ స్పిన్ బంతిని వేస్తున్న షేన్ వార్న్

లెగ్ స్పిన్ బౌలింగు కళలో గణనీయమైన విజయాన్ని సాధించినట్లు సాధారణ క్రికెట్ ప్రజలు గుర్తించే నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా దిగువ జాబితా చేయబడిన ఆటగాళ్లు చేర్చబడ్డారు. ఉదాహరణకు: ప్రముఖ వికెట్ టేకర్లు, కొత్త డెలివరీలను కనుగొన్నవారు.

  • షేన్ వార్న్ - 708 టెస్టు వికెట్లు (సార్వకాలిక రెండవ స్థానం), ఐదుగురు విస్డెన్ క్రికెటర్స్ ఆఫ్ ది సెంచరీలో ఒకరు [30]
  • బెర్నార్డ్ బోసాంక్వెట్ - గూగ్లీని కనిపెట్టిన ఘనత
  • బిఎస్ చంద్రశేఖర్ - 16 సార్లు ఐదు వికెట్ల పంట తీశాడు
  • క్లారీ గ్రిమ్మెట్ - 216 టెస్టు వికెట్లు
  • అనిల్ కుంబ్లే – 619 టెస్టు వికెట్లు (ప్రస్తుతం సార్వకాలిక అత్యధిక టెస్టు వికెట్ల జాబితాలో 4వ స్థానం), 10/74 ఇన్నింగ్స్‌లో అత్యుత్తమ బౌలింగ్
  • అబ్దుల్ ఖాదిర్ - ఐదు సందర్భాలలో ఒక టెస్టు మ్యాచ్‌లో 10 వికెట్లు తీశాడు
  • టిచ్ ఫ్రీమాన్ - 3776 ఫస్ట్-క్లాస్ వికెట్లు, ఆల్ టైమ్ రెండోది, లెగ్ స్పిన్ బౌలర్లలో అత్యధిక వికెట్లు. [31]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "The Science of Spin Bowling: Basics of a Leg Break". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 27 June 2019.
  2. "Records / Test matches / Bowling records / Most wickets in career". ESPNcricinfo. Retrieved 28 July 2020.
  3. Abdul Qadir, player profile Scyld Berry et al., Cricinfo, 1998 and November 2008.
  4. Farewell to Shane Warne as cricket's great teaser bowls his final ball Mike Selvey, The Guardian, 19 May 2011.
  5. "How to bowl leg spin". BBC. 23 August 2005. Retrieved 17 May 2019.
  6. "Learn to bowl leg spin". BBC. 30 October 2003. Retrieved 17 May 2019.
  7. "ESPN glossary of cricket terms". ESPN. 17 April 2007. Retrieved 11 July 2020. Leg-break/spin - When the ball pitches and turns from leg to off for a right-hander.
  8. "Spin". BBC. 23 August 2005. Retrieved 11 July 2020. Leg spin involves turning a ball off the pitch from the leg-side of a right-handed batter, to the off-side.
  9. "Leg-spin". The West Yorkshire Cricket website. Archived from the original on 23 July 2020. Retrieved 23 July 2020. Leg spin involves turning a ball off the pitch from the leg-side of a right-handed batter, to the off-side.
  10. "Bowling leg-spin with Adil Rashid". wisden.com. 31 January 2020. Retrieved 11 July 2020. I've got four deliveries: the leg-break, the top-spinner, the googly (also known as the wrong'un) and the slider. Which deliveries the bowler bowls depends on the situation on the ball and the pitch.
  11. "R Ashwin, now a legspinner too?". ESPN. 23 December 2017. Retrieved 25 July 2020. The ESPNcricinfo style sheet makes a fine distinction between legbreak and legspin. Legbreak is a delivery, legspin is an art form of which legbreak is a part. Legbreak is a delivery that turns away from a right-hand batter, legspin is the whole set: legbreaks, wrong'uns, topspinners, sliders, flippers; zooters, if you believe Shane Warne.
  12. "Shane Warne Masterclass: Australia great talks leg-spin in The Zone". skysports.com. 12 June 2016. Retrieved 23 July 2020. Shane Warne lit up a drizzly Lord's when he entered The Zone to deliver a masterclass on the art of leg spin... Warne went into huge detail on the pace leg-spinners should bowl at and when to bowl your variations, including the wrong 'un and flipper.
  13. "Leg-break". yourdictionary.com. Retrieved 23 July 2020. (cricket) a normal ball bowled by a leg spin bowler, moving from leg to off (for a right-handed batter).
  14. "Glossary of Cricket terms". 888sport.com. Retrieved 23 July 2020. Leg break - A spin bowling delivery bowled by a leg spinner that turns from the leg side to the offside of a right-handed batter.
  15. "Leg Break". definitions.net. Retrieved 25 July 2020. leg break (Noun) a normal ball bowled by a leg spin bowler, moving from leg to off (for a right-handed batter).
  16. "Leg-break". dictionary.com. Retrieved 23 July 2020. a ball deviating to the off side from the leg side when bowled.
  17. "Leg break". Collins. Retrieved 23 July 2020. a bowled ball that spins from leg to off on pitching.
  18. "Leg-break". Merriam-Webster. Retrieved 23 July 2020. a bowled ball in cricket that breaks from the leg side to the off side.
  19. "Dananjaya – the offspinner picking wickets with leg-breaks and googlies". ICC. 25 August 2017. Retrieved 23 July 2020. When asked about what sort of a bowler he was, Dananjaya's response was: "I am an offspinner. My wicket-taking balls are leg-spin and the googly."
  20. "Sonny Ramadhin: A self-taught bowler of remarkable merit – Almanack". Wisden. 9 May 2020. Archived from the original on 25 జూలై 2020. Retrieved 25 July 2020. His orthodox attack was the off-break... His variations, which kept the batsmen on tenterhooks, were the leg-break and plain straight ball.
  21. "Off-spinner with leg-breaks is like a multi-lingual: Sachin Tendulkar". economictimes. 24 April 2018. Retrieved 25 July 2020. An off-spinner who can bowl leg-breaks is like a multi-lingual, said Sachin Tendulkar.
  22. "Ashwin set to bowl leggies in IPL". cricket.com.au. 7 February 2018. Retrieved 23 July 2020. I am just trying to build my armoury," Ashwin said after bowling leggies in a domestic 50-over match in Chennai on Monday. "I used to bowl good leg-breaks with my off-spin action when I was playing league cricket in Chennai.
  23. "Leg Break". sportspundit.com. Retrieved 25 July 2020. A leg break is a kind of delivery bowled usually by leg spinners.
  24. "How does a leg-spinner get a stress fracture?". Wisden. 20 May 2020. Retrieved 7 August 2020. Mason Crane, the Hampshire leg-spinner
  25. "The Cricket World Cup's greatest leg-spinners". ICC. 30 September 2018. Retrieved 7 August 2020. we look back at the top leg-spinners to have graced the ICC Cricket World Cup
  26. "England And The Leg-Spinner: A Terribly Awkward Romance". Wisden. 10 June 2014. Archived from the original on 25 సెప్టెంబరు 2020. Retrieved 7 August 2020. Then there was Eric Hollies. Doing Bradman with a googly was no fluke; the week before he'd bowled him with a regulation leg-spinner but noticed The Don couldn't pick the wrong 'un.
  27. "Learn Warne's five spin deliveries". BBC. 2 August 2005. Retrieved 7 August 2020. Leg-spinners have five different balls in their armoury: Leg-spinner Top-spinner Googly Slider Flipper
  28. "Ben Stokes the hero again as England secure thrilling last-gasp Test victory in Cape Town to level South Africa series". Daily Telegraph. 7 January 2020. Archived from the original on 11 January 2022. Retrieved 8 January 2020. Well that wasn't the way I expected him to pick up the wicket, but that's why you throw the ball to your leggie.
  29. "The doosra ain't the only game in town". ESPN. 27 February 2017. Retrieved 26 July 2020. And indeed, I never bowled another leggie in international cricket... Having bowled offies and leggies as a kid.
  30. "Wisden – Five cricketers of the century". Cricinfo. 23 October 2008.
  31. "Tich Freeman profile and biography". Cricinfo. Retrieved 23 October 2021.