షేన్ వార్న్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
షేన్ వార్న్
Shane Warne February 2015.jpg
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు షేన్ కీత్ వార్న్
జననం (1969-09-13)1969 సెప్టెంబరు 13
విక్టోరియా , ఆస్ట్రేలియా
మరణం 2022 మార్చి 4(2022-03-04) (వయసు 52)
కోహ్ సముయ్, థాయిలాండ్
ఇతర పేర్లు వార్ని
ఎత్తు 1.83 మీ. (6 అ. 0 అం.)
బ్యాటింగ్ శైలి కుడి చేతి
బౌలింగ్ శైలి కుడి చేతి లెగ్‌స్పిన్నర్‌
పాత్ర బౌలర్
అంతర్జాతీయ సమాచారం
జాతీయ జట్టు ఆస్ట్రేలియా
టెస్టు అరంగ్రేటం(cap 350) 2 జనవరి 1992 v [[ భారతదేశం cricket team| భారతదేశం]]
చివరి టెస్టు 2 జనవరి 2007 v ఇంగ్లాండ్
వన్డే లలో ప్రవేశం(cap 110) 24 మార్చి 1993 v న్యూజీలాండ్
చివరి వన్డే 10 జనవరి 2005 v ఆసియ XI
ఒ.డి.ఐ. షర్టు నెం. 23
దేశవాళీ జట్టు సమాచారం
సంవత్సరాలు జట్టు
1990/91–2006/07 విక్టోరియా (squad no. 23)
2000–2007 హాంప్షైర్ (squad no. 23)
2008–2011 రాజస్తాన్ రాయల్స్ (squad no. 23)
2011/12–2012/13 మెల్బోర్న్ స్టార్స్ (squad no. 23)
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్ట్ క్రికెట్ వన్డే ఫస్ట్ - క్లాస్ లిస్ట్ ఏ క్రికెట్
మ్యాచ్‌లు 145 194 301 311
సాధించిన పరుగులు 3,154 1,018 6,919 1,879
బ్యాటింగ్ సగటు 17.32 13.05 19.43 11.81
100s/50s 0/12 0/1 2/26 0/1
ఉత్తమ స్కోరు 99 55 107 నాటౌట్ 55
బాల్స్ వేసినవి 40,705 10,642 74,830 16,419
వికెట్లు 708 293 1,319 473
బౌలింగ్ సగటు 25.41 25.73 26.11 24.61
ఇన్నింగ్స్ లో 5 వికెట్లు 37 1 69 3
మ్యాచ్ లో 10 వికెట్లు 10 0 12 0
ఉత్తమ బౌలింగ్ 8/71 5/33 8/71 6/42
క్యాచులు/స్టంపింగులు 125/– 80/– 264/– 126/–
Source: ESPNcricinfo, 29 మార్చి 2008

షేన్ వార్న్ (1969 సెప్టెంబరు 13 - 2022 మార్చి 4) ఆస్ట్రేలియా దేశానికి చెందిన అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుడు. ఆయన ఆస్ట్రేలియా తరపున అంతర్జాతీయ క్రికెట్‌లో 1000 వికెట్లు తీశాడు. షేన్ వార్న్ టెస్టుల్లో అత్యధిక వికెట్లు (708), 194 వన్డేలు ఆడిన వార్న్ 293 వికెట్లు, ఐపీఎల్‌లో 55 మ్యాచ్‌లు ఆడి 57 వికెట్లు తీశాడు. షేన్ వార్న్ టెస్టుల్లో అత్యధిక వికెట్లు (708) సాధించిన రెండో బౌలర్‌గా రికార్డుల్లోకి ఎక్కి, 2013 జులై లో క్రికెట్‌లో అన్ని రకాల ఫార్మాట్స్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించి, తర్వాత మరణించేదాకా వ్యాఖ్యాతగా కొనసాగాడు.

క్రీడా జీవితం[మార్చు]

వార్న్ 1992లో భారత్ పై సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో టెస్ట్ క్రికెట్ ద్వారా అరంగేట్రం చేసి ఆస్ట్రేలియా తరుఫున బౌలర్‌గా 145 టెస్టులు మ్యాచ్‌లు ఆడి 708 వికెట్లు, 194 వన్డేలు ఆడి 293 వికెట్లు, బ్యాట్స్ మెన్ గా 3,154 పరుగులు చేశాడు. ఆయన టెస్టుల్లో ఒక ఇన్నింగ్స్ లో అత్యధికంగా ఎనిమిది వికెట్లు, ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఒక మ్యాచ్ లో 12 వికెట్లు, టెస్టుల్లో 37 సార్లు 5 వికెట్లు, 10 సార్లు 10 వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు.

షేన్ వార్న్ 1999లో ప్రపంచ కప్ గెలిచిన ఆస్ట్రేలియా టీమ్‌లో సభ్యుడిగా, 1993, 2003 మధ్య ఐదు కాలంలో ఆస్ట్రేలియా యాషెస్ గెలిచిన టీమ్‌లో సభ్యుడిగా ఉన్నాడు. ఆయన 2007 జనవరి 7న అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం 2008లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభ సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి మొత్తం 55 ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లో 57 వికెట్లు తీశాడు.[1]

మరణం[మార్చు]

52 ఏళ్ల షేన్‌ వార్న్‌ 2022 మార్చి 4న థాయ్‌లాండ్‌లోని కోహ్ సమీపంలో తన విల్లాలో గుండెపోటుతో మరణించాడు.[2][3]

ఆస్ట్రేలియా మాజీ వికెట్‌ కీపర్‌ రాడ్‌ మార్ష్‌ క్వీన్స్‌ల్యాండ్‌లో 2022 మార్చి 4న ఉదయం కన్నుముశారు. ఆయన మరణానికి సంతాపం తెలుపుతూ షేన్‌ వార్న్‌ ట్వీట్‌ చేశాడు. ఆ తరువాత సరిగ్గా 12 గంటలకే వార్న్‌ మరణించాడు.[4]

మూలాలు[మార్చు]

  1. Namasthe Telangana (4 March 2022). "2013లో అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు షేన్ వార్న్ వీడ్కోలు.. ఆయ‌న క్రికెట్ ప్ర‌స్థానం ఇదీ". Retrieved 4 March 2022.
  2. 10TV (4 March 2022). "ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ షేన్ వార్న్ హఠాన్మరణం" (in telugu). Retrieved 4 March 2022.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
  3. TV9 Telugu (4 March 2022). "క్రికెట్ లెజెండ్ షేన్ వార్న్ కన్నుమూత.. దిగ్భ్రాంతికి గురైన క్రికెట్ ప్రేమికులు". Retrieved 4 March 2022. క్రికెట్ లెజెండ్ షేన్ వార్న్ కన్నుమూత.. దిగ్భ్రాంతికి గురైన క్రికెట్ ప్రేమికులు
  4. "Shane Warne: విధి అంటే ఇదేనేమో క్రికెటర్‌ మృతికి సంతాపం తెలిపిన కొన్ని గంటలకే". EENADU. Retrieved 2022-03-04.

బయటి లింకులు[మార్చు]