రాడ్ మార్ష్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రాడ్ మార్ష్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు రాడ్నీ విలియం మార్ష్
జననం (1947-11-04) 1947 నవంబరు 4 (వయసు 75)
ఆర్మడేల్, ఆస్ట్రేలియా
ఇతర పేర్లు బచ్చూస్, ఐరన్ గ్లోవ్స్
బ్యాటింగ్ శైలి ఎడమ చేతి వాటం
బౌలింగ్ శైలి రైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్
పాత్ర వికెట్ కీపర్, క్రికెట్ శిక్షకుడు
సంబంధాలు గ్రాహం మార్ష్ (సోదరుడు)
డేనియల్ మార్ష్ (కుమారుడు)
అంతర్జాతీయ సమాచారం
జాతీయ జట్టు ఆస్ట్రేలియా
టెస్టు అరంగ్రేటం(cap 249) 27 November 1970 v England
చివరి టెస్టు 6 January 1984 v Pakistan
వన్డే లలో ప్రవేశం(cap 7) 5 January 1971 v England
చివరి వన్డే 12 February 1984 v West Indies
దేశవాళీ జట్టు సమాచారం
సంవత్సరాలు జట్టు
1969–1984 Western Australia
కెరీర్ గణాంకాలు
పోటీ Tests ODI FC LA
మ్యాచ్‌లు 96 92 257 140
సాధించిన పరుగులు 3,633 1,225 11,067 2,119
బ్యాటింగ్ సగటు 26.51 20.08 31.17 23.03
100s/50s 3/16 0/4 12/55 0/9
ఉత్తమ స్కోరు 132 66 236 99*
బాల్స్ వేసినవి 72 0 142 23
వికెట్లు 0 1 0
బౌలింగ్ సగటు 84.00
ఇన్నింగ్స్ లో 5 వికెట్లు
మ్యాచ్ లో 10 వికెట్లు
ఉత్తమ బౌలింగ్ 1/0
క్యాచులు/స్టంపింగులు 343/12 120/4 803/66 182/6
Source: Cricinfo, 20 November 2008

రాడ్ మార్ష్ (ఆగ్లం: Rodney William Marsh) (నవంబర్ 4, 1947 - మార్చి 4, 2022) ఆస్ట్రేలియాకు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు. ఇతను వికెట్ కీపర్‌గా జట్టులో బాగా స్థిరపడ్డాడు. 1970-71 వరకు టెస్ట్ క్రికెట్ ఆడి 96 టెస్టులలో వికెట్ కీపర్‌గా 355 బ్యాట్స్‌మెన్లను ఔట్ చేసిన ఘనత పొందినాడు. ఇది అప్పటికి ప్రపంచ రికార్డు. సహచరుడు డెన్నిస్ లిల్లీ కూడా ఇదే సంఖ్యలో బ్యాట్స్‌మెన్లను పెవిలియన్ పంపించాడు. బౌలింగ్, కీపింగ్ లలో ఈ జంటను మంచి భాగస్వామ్య జంటగా పరిగణిస్తారు. లిల్లీ బౌలింగ్‌లోనే మార్ష్ 95 బ్యాట్స్‌మెన్లను ఔట్ చేయడంలో తన పాత్ర వహించాడు.

టెస్ట్ క్రికెట్ గణాంకాలు[మార్చు]

రాడ్ మార్ష్ 95 టెస్టులలో ప్రాతినిధ్యం వహించి 343 క్యాచ్‌లు, 12 స్టంపింగ్‌లతో 355 బ్యాట్స్‌మెన్‌లను ఔట్ చేశాడు. బ్యాటింగ్‌లో 26.51 సగటుతో 3633 పరుగులు సాధించాడు. అందులో 3 సెంచరీలు, 16 అర్థసెంచరీలు ఉన్నాయి. టెస్టులలో అతడి అత్యధిక స్కోరు 132 పరుగులు.

వన్డే క్రికెట్ గణాంకాలు[మార్చు]

రాడ్ మార్ష్ 92 వన్డేలు ఆడి 120 క్యాచ్‌లు, 4 స్టంపింగ్‌లతో 124 బ్యాట్స్‌మెన్లను పెవిలియన్ పంపడంలో సఫలుడైనాడు. బ్యాటింగ్‌లో 20.08 సగటుతో 1225 పరుగులు సాధించాడు. అందులో 4 సెంచరీలు ఉన్నాయి. వన్డేలలో అతడి అత్యధిక స్కోరు 66 పరుగులు.

ప్రపంచ కప్ క్రికెట్[మార్చు]

మార్ష్ 1975లో జరిగిన తొలి ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంటులో ఇయాన్ చాపెల్ నేతృత్వంలో ఆస్ట్రేలియా జట్టుకు ప్రాతినిధ్యం వహించి వికెట్ కీపర్ విధులను నిర్వహించాడు. 1983లో మూడవ ప్రపంచ కప్‌లో కిమ్ హ్యుగ్స్ నాయకత్వంలోని జట్టుకు కూడా ప్రాతినిధ్యం వహించాడు.

మరణం[మార్చు]

74 ఏళ్ల వయసులో రాడ్ మార్ష్ 2022 మార్చి 4న క్వీన్స్‌లాండ్ రాష్ట్రంలో నిధుల సేకరణ కార్యక్రమంలో గుండెపోటుతో మరణించాడు.[1]

మూలాలు[మార్చు]

  1. "Australian లెజెండరీ వికెట్ కీపర్ రాడ్ మార్ష్ గుండెపోటుతో మృతి". andhrajyothy. Retrieved 4 మార్చి 2022.

ఇతర లింకులు[మార్చు]