కెప్లర్ వెస్సెల్స్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

1957, సెప్టెంబర్ 14న జన్మించిన కెప్లర్ వెస్సెల్స్ (Kepler Christoffel Wessels) ఆస్ట్రేలియా మరియు దక్షిణాఫ్రికా తరఫున ప్రాతినిధ్యం వహించిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు. వన్డే పోటీలలో రెండూ దేశాలకు ప్రాతినిధ్యం వహించిన తొలి క్రీడాకారుడు ఇతనే.[1] ఎడమచేతి ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ అయిన కెప్లర్ కుడి చేతితో ఆఫ్ స్పిన్ మరియు మీడియం పేస్ బౌలింగ్ చేసేవాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోఐతడు రకరకాల జట్టులకు ప్రాతినిధ్యం వహించాడు. తన స్వంతదేశమైన దక్షిణాఫ్రికాలోను, ఆ తరువాత ఆస్ట్రేలియాలోను, ఇంగ్లాండులో కౌంటీ క్రికెట్‌లలో ప్రాతినిధ్యం వహించాడు.

గణాంకాలు[మార్చు]

వెస్సెల్స్ మొత్తం 40 టెస్టులు ఆడి 41 సగటుతో 2788 పరుగులు సాధించాడు. అందులో 6 సెంచరీలు మరియు 15 అర్థసెంచరీలు ఉన్నాయి. టెస్ట్ క్రికెట్‌లో అతడి అత్యధిక స్కోరు 179 పరుగులు. వన్డేలలో 109 మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించి 34.35 సగటుతో 3367 పరుగులు సాధించాడు. అందులో ఒక సెంచరీ మరియు 26 అర్థసెంచరీలు ఉన్నాయి. వన్డేలలో అతడి అత్యధిక స్కోరు 107 పరుగులు. వన్డే బౌలింగ్‌లో 18 వికెట్లు కూడా సాధించాడు. అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 16 పరుగులకు 2 వికెట్లు.

మూలాలు[మార్చు]

  1. "Individuals who played for two countries" (HTML) (in english). Cricinfo. Retrieved 2007-08-27.