డెన్నిస్ లిల్లీ
1949, జూలై 18న జన్మించిన డెన్నిస్ లిల్లీ (Dennis Keith Lillee) ఆస్ట్రేలియాకు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు. అతని కాలంలో ప్రముఖ ఫాస్ట్ బౌలర్‌గా పేరుసంపాదించాడు.[1] 1984లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిష్క్రమించే నాటికి టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యధిక వికెట్లు సాధిమ్చిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు.[2] 2004 నుండి 2015 వరకు లిల్లీ, వెస్టర్న్ ఆస్ట్రేలియా క్రికెట్ అసోసియేషను ప్రెసిడెంటుగా పనిచేసాడు.[3][4]
టెస్ట్ క్రికెట్
[మార్చు]20 సంవత్సరాల ప్రాయంలోనే 1969-70లో లిల్లీ పశ్చిమ ఆస్ట్రేలియా తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో పాల్గొన్నాడు. ఈ సీజన్ చివరిలో ఆస్ట్రేలియన్ రెండో జట్టు తరఫున న్యూజీలాండ్ పర్యటించి 16.44 పరుగుల సగటుతో 18 వికెట్లు తీశాడు.[5] తదుపరి సీజన్‌లో లిల్లీ అడిలైడ్ టెస్టుతో టెస్ట్ క్రికెట్‌లో రంగప్రవేశం చేశాడు. తొలి సాధన లోనే 83 పరుగులకు 5 వికెట్లు సాధించాడు. 1971-72లో పెర్త్ లో గారీ సోబర్స్, క్లైవ్ లాయిడ్, రోహన్ కన్హాయ్, సునీల్ గవాస్కర్ లాంటి హేమాహేమీలు ఉన్న ప్రపంచ ఎలెవన్ (World XI) పై ఆడుతూ 29 పరుగులకే 8 వికెట్లు పడగొట్టినాడు. 1972లో ఇంగ్లాడు పర్యటనలో కూడా ఇదే ప్రతిభను కొనసాగించి తనకు తానే గొప్ప బౌలర్‌గా విశ్వసం ప్రకటించుకున్నాడు.[6] ఆ సీరీస్ 2-2 తో డ్రాగా ముగిసిననూ 17.67 సగటుతో 31 వికెట్లు సాధించి తన సత్తా చూపించాడు. ఈ ప్రతిభ మూలంగా 1973లో విజ్డెన్ అవార్డులు పొందిన 5 క్రికెటర్లలో ఇతని పేరు కూడా ఎన్నుకోబడింది.[7]
మొత్తంపై లిల్లీ 70 టెస్టులు ఆడి 23.92 సగటుతో 355 వికెట్లు పడగొట్టినాడు. ఒకే ఇన్నింగ్సులో 5 వికెట్లను 23 సార్లు, ఒకే టెస్టులో 10 వికెట్లను 7 సార్లు సాధించాడు. టెస్టులలో అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 83 పరుగులకు 7 వికెట్లు. బ్యాటింగ్‌లో 905 పరుగులు కూడా చేశాడు. అందులో ఒక అర్థసెంచరీ ఉంది. టెస్టులలో అతని అత్యధిక స్కోరు 73 నాటౌట్.
వన్డే క్రికెట్
[మార్చు]లిల్లీ 63 వన్డేలు ఆడి 20.82 సగటుతో 103 వికెట్లు సాధించాడు. వన్డేలలో అతడి అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 34 పరుగులకు 5 వికెట్లు. వన్డే బ్యాటింగ్‌లో అతడి అతుఅధిక స్కోరు 42 నాటౌట్.
మూలాలు
[మార్చు]- ↑ BBC Sport: Ashes legends - Dennis Lillee. Retrieved 18 September 2007.
- ↑ MCG.org: Dennis Lillee. Archived 2007-08-31 at the Wayback Machine Retrieved 18 September 2007.
- ↑ Lillee honoured by WACA presidency (30 September 2004)
- ↑ Townsend, John (3 September 2015). "What made Dennis Lillee walk from the WACA". Archived from the original on 4 February 2016. Retrieved 29 January 2016.
- ↑ Cricinfo: Australia in New Zealand 1969–70 tour statistics.
- ↑ Cricinfo.com: Massie's mystery, Lillee's menace. Retrieved 18 September 2007.
- ↑ Wisden, 1973 edition: Cricketer of the Year Dennis Lillee