వకార్ యూనిస్
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | వకార్ యూనిస్ మైట్లా | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | వేహారీ, పంజాబ్, పాకిస్తాన్ | 1971 నవంబరు 16|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మారుపేరు | టో క్రషర్[1] | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 6 అ. (183 cమీ.)[2] | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడీచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఫాస్ట్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బౌలరు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 111) | 1989 నవంబరు 15 - ఇండియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2003 జనవరి 2 - దక్షిణాఫ్రికా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 71) | 1989 అక్టోబరు 14 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2003 మార్చి 4 - జింబాబ్వే తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వన్‌డేల్లో చొక్కా సంఖ్య. | 99 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1987/88–1997/98 | ముల్తాన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1988/89—1996/97 | యునైటెడ్ బ్యాంక్ లిమిటెడ్ క్రికెట్ జట్టు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1990–1993 | సర్రే కౌంటీ క్రికెట్ క్లబ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1997–1998 | గ్లామోర్గాన్ కౌంటీ క్రికెట్ క్లబ్బు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1998/99 | కరాచీ క్రికెట్ జట్టు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1978 | రావల్పిండి క్రికెట్ జట్టు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1999/2000 | రెడ్‌కో పాకిస్థాన్ లిమిటెడ్ క్రికెట్ జట్టు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2000/01 | లాహోర్ క్రికెట్ జట్టు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2001/02–2002/03 | నేషనల్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ క్రికెట్ జట్టు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2003 | వార్విక్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2003/04 | అలైడ్ బ్యాంక్ లిమిటెడ్ క్రికెట్ టీమ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNCricinfo, 2012 21 April |
వకార్ యూనిస్ మైత్లా (జననం 1971 నవంబరు 16) పాకిస్తానీ క్రికెట్ కోచ్, వ్యాఖ్యాత, పాకిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టుకు నాయకత్వం వహించిన క్రికెటర్. కుడిచేతి ఫాస్ట్ బౌలరైన వకార్‌ను, క్రికెట్‌లోని గొప్ప బౌలర్లలో ఒకరిగా పరిగణిస్తారు.[3] అతను పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్‌గా పనిచేసాడు. [4]
2021 నాటికి యూనిస్, అతి పిన్న వయస్కుడైన పాకిస్తాన్ టెస్ట్ కెప్టెన్, చరిత్రలో నాల్గవ అతి పిన్న వయస్కుడైన కెప్టెన్ (22 సంవత్సరాల 15 రోజులు). [5] అతను 1989 నుండి 2003 వరకు తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో 87 టెస్టులు, 262 వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడాడు.[6]
బంతిని అధిక వేగంతో రివర్స్ స్వింగ్ చేయగల సామర్థ్యం వకార్ ట్రేడ్‌మార్క్.[7] అతను తన కెరీర్‌లో 373 టెస్ట్ వికెట్లు, 416 వన్డే అంతర్జాతీయ వికెట్లు తీశాడు. బౌలింగ్ భాగస్వామి వసీం అక్రమ్‌తో కలిసి, అతను ప్రపంచంలోనే అత్యంత భయానకమైన బౌలింగ్ దాడుల్లో ఒకటిగా నిలిచాడు.[8] 350కి పైగా టెస్టు వికెట్లు తీసిన బౌలర్లలో డేల్ స్టెయిన్ తర్వాత వకార్‌కు అత్యుత్తమ స్ట్రైక్ రేట్ ఉంది.[9] వన్డే క్రికెట్‌లో 400 వికెట్లు తీసిన అతి పిన్న వయస్కుడైన బౌలరతను.[10]
వకార్ 2006 నుండి 2007 వరకు పాకిస్తాన్ జాతీయ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా పనిచేశాడు.[11] 2010 మార్చి 3 న పాకిస్తాన్ క్రికెట్ జట్టు కోచ్‌గా నియమితుడయ్యాడు.[12][13] 2011 ఆగస్టు 19 న వ్యక్తిగత కారణాలతో కోచ్ పదవికి రాజీనామా చేశాడు.[14][15] ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2013 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు బౌలింగ్ కోచ్‌గా చేరాడు. [16]
2019 సెప్టెంబరు 4 న వకార్‌ను 3 సంవత్సరాల కాంట్రాక్ట్‌పై పాకిస్తాన్ కొత్త బౌలింగ్ కోచ్‌గా పిసిబి నియమించింది.[17] ICC ప్రపంచ కప్ 2019 టోర్నమెంట్‌లో పాకిస్తాన్ ప్రదర్శన నిరాశపరచడంతో తొలగించబడిన అజర్ మహమూద్ స్థానంలో వకార్ చేరాడు.
ప్రారంభ జీవితం
[మార్చు]యూనిస్ పాకిస్తాన్ పంజాబ్‌లోని వెహారి జిల్లా బురేవాలాలో పంజాబీ ముస్లిం జాట్ కుటుంబంలో జన్మించాడు. అతను పాకిస్తాన్‌లోని బహావల్‌పూర్‌లోని సాదిక్ పబ్లిక్ స్కూల్‌లో, షార్జాలోని పాకిస్తాన్ ఇస్లామియా పాఠశాలలో, బురేవాలాలోని ప్రభుత్వ కళాశాలలో చదివాడు. అతను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని షార్జాలో పెరిగాడు. అక్కడ అతని తండ్రి కాంట్రాక్ట్ కార్మికుడు. వకార్ యుక్తవయస్సులో పాకిస్తాన్‌కు తిరిగి వచ్చి క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. అతను క్రికెట్ ఆడేందుకు బూరేవాలాకు వెళ్లేవాడు. అది అతనికి బూరేవాలా ఎక్స్‌ప్రెస్ అనే మారుపేరు తెచ్చిపెట్టింది.[18]
అతని పాఠశాల, కళాశాల రోజులలో, అతనే స్వయంగా చెప్పుకున్నట్లు ఆల్ రౌండ్ అథ్లెట్ గా ఉండేవాడూ. రన్నర్, జావెలిన్ త్రోయర్, హైజంపర్, పోల్-వాల్టర్‌గా వివిధ పోటీలలో ఆడేవాడు. పేస్ బౌలింగ్‌ను ఎంచుకునే ముందు లెగ్ స్పిన్నర్‌గా ఆడేవాడు. [19]
2000 లో వకార్, ఆస్ట్రేలియా న్యూ సౌత్ వేల్స్‌లోని క్యాజిల్ హిల్‌లో నివసిస్తున్న ఫార్యాల్ అనే పాకిస్థానీ-ఆస్ట్రేలియన్ వైద్యురాలిని పెళ్ళి చేసుకున్నాడు. [20] [21] వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
వకార్ ఆస్ట్రేలియాలోని నైన్ నెట్‌వర్క్‌కు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని టెన్ స్పోర్ట్స్‌కు టెలివిజన్‌కూ స్పోర్ట్స్ వ్యాఖ్యాతగా పనిచేశాడు.
కెరీర్
[మార్చు]వకార్ తన క్రికెట్ కెరీర్‌ను 1987/88 లో పాకిస్తాన్‌లో ప్రారంభించాడు. అనేక ఫస్ట్-క్లాస్ క్రికెట్ క్లబ్‌లకు ఆడాడు. ఒకసారి అతను కాలువలోకి దూకినపుడు, గాయం కావడంతో ఎడమ చేతి చిటికెన వేలును కత్తిరించి తొలగించారు.[22] ఈ ప్రమాదం నుండి కోలుకున్నాక, క్రీడా జీవితాన్ని కొనసాగించాడు. పాకిస్తాన్ మాజీ కెప్టెన్, ఇమ్రాన్ ఖాన్ అతని ప్రతిభను గుర్తించి, జాతీయ జట్టులో భాగంగా ఎంపిక చేసాడు. [23] పాకిస్తాన్ జట్టుకు ఎంపికయ్యే నాటికి అతను కేవలం ఆరు ఫస్ట్-క్లాస్ గేమ్‌లు మాత్రమే ఆడాడు. వకార్ మాట్లాడుతూ, "ఆ సమయంలో ఇమ్రాన్ ఆరోగ్యం బాగోలేక, శిబిరంలో లేరని నాకు గుర్తుంది. అదృష్టవశాత్తూ సూపర్ విల్స్ కప్ జరుగుతోంది. యునైటెడ్ బ్యాంక్, ఢిల్లీ XI మధ్య మ్యాచ్ జరిగింది. సలీమ్ జాఫర్ గాయపడ్డంతో నాకు ఆ గేమ్ ఆడే అవకాశం వచ్చింది. ఇమ్రాన్ నన్ను టీవీలో చూసి, ఆట ముగిసే సమయానికి గ్రౌండ్‌కి వచ్చాడు. మరుసటి రోజు, అతను నన్ను కలుసుకుని, వచ్చే నెలలో నేను షార్జా వెళ్ళాలని చెప్పాడు. ఆ సమయంలో ఇమ్రాన్‌ను కలవడమే నాకు గొప్ప, కానీ అతను నా ఎంపిక గురించి నాకు తెలియజేయడం నాకు లోకాతీతమైన అనుభవంగా ఉండిపోయింది."
దేశీయంగా
[మార్చు]1990ల ప్రారంభంలో అతను సర్రే కోసం ఆడినప్పటికే ఆంగ్ల ప్రేక్షకులకు వకార్ ప్రతిభ గురించి తెలుసు. 1991లో సర్రే తరపున 582 ఓవర్లలో 113 వికెట్లు, ఒక్కొక్కటి కేవలం 14.65 (దీని ద్వారా సీజన్ ఫస్ట్-క్లాస్ బౌలింగ్ సగటులలో అగ్రస్థానంలో నిలిచాడు) సగటుతో తీసాడు.[24] ఓ మోస్తరుగా ఉండే ఆ కౌంటీ బౌలింగు దాడిని తన భుజాలపై మోసి, ఆనాటి అత్యుత్తమ బౌలర్లలో తాను ఒకణ్ణని ప్రకటించుకున్నాడు.[25] అక్కడ అతను అద్భుతమైన క్రికెట్ ప్రదర్శనలను ప్రదర్శించి, క్రీడాకారుల దృష్టిని ఆకర్షించాడు. 1997 లో గ్లామోర్గాన్ జట్టుతో ఆడి, ఇంగ్లీష్ కౌంటీ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్నాడు. 1997 జూన్ 21 న లివర్‌పూల్‌లో లాంకషైర్‌తో జరిగిన మ్యాచ్‌లో వకార్, 25 పరుగులకు 7 వికెట్లు తీశాడు. ఇందులో ఓ హ్యాట్రిక్‌ను తృటిలో కోల్పోయిన తర్వాత సాధించిన హ్యాట్రిక్ కూడా ఉంది.[26] [27] ఆ సీజన్‌లో 68 వికెట్లు పడగొట్టాడు. [28]
అంతర్జాతీయ
[మార్చు]1989 నవంబరు 16 న భారత బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్ ఆడిన తొలి మ్యాచ్ లోనే భారత్‌పై యూనిస్ కూడా తన తొలి అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. డ్రాగా ముగిసిన ఆ మ్యాచ్‌లో టెండూల్కర్, కపిల్ దేవ్‌ల వికెట్లతో సహా వకార్ 4 వికెట్లు తీశాడు. [29] అతను తన వేగంతో వెంటనే ముద్ర వేసాడు. క్రికెట్ మీడియాలో "వికీ" లేదా "బురేవాలా ఎక్స్‌ప్రెస్"గా పేరు పొందాడు. [30] వసీం అక్రమ్‌తో కలిసి వకార్, పాకిస్తాన్‌కు క్రమం తప్పకుండా బౌలింగ్ దాడిని ప్రారంభించేవాడు. ఈ జంట చేసే బౌలింగు దాడి భయంకరమైన, శక్తివంతమైన దాడిగా మారింది.[31] 1994లో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో హ్యాట్రిక్ సాధించాడు.[32] 2000 ప్రారంభ కాలంలో, తన బౌలింగ్ భాగస్వామి, కెప్టెన్ అయిన అక్రమ్‌తో విభేదాల కారణంగా సస్పెన్షన్‌కు గురై కొంతకాలం పాటు పాకిస్తాన్ జట్టుకు దూరంగా ఉన్నాడు. [33] [34]
పాకిస్తాన్ కెప్టెన్‌గా వకార్, క్రికెట్‌కి తిరిగి వచ్చాడు. [35] అయితే, అతను బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు, అనేక వివాదాలను ఎదుర్కోవలసి వచ్చింది. 2000 జూలైలో బాల్ టాంపరింగ్ కారణంగా వకార్ అంతర్జాతీయ మ్యాచ్‌లో ఆడకుండా నిషేధించబడ్డాడు. అతని మ్యాచ్ ఫీజులో 50% జరిమానా విధించారు.[36] ఈ నేరానికి గాను మ్యాచ్‌లో ఆడకుండా నిషేధానికి గురైన తొలి క్రికెటరు వకార్.[37] 2003 ప్రపంచ కప్ మ్యాచ్‌ల సమయంలో అతను మరింత వివాదంలో చిక్కుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన ఓపెనింగ్ మ్యాచ్‌లో, ఆండ్రూ సైమండ్స్ కు బీమర్‌ను బౌలింగ్ చేసిన తర్వాత వకార్ ఆ మ్యాచ్‌లో మరి బౌలింగు చేయకుండా నిషేధించారు. అంతర్జాతీయ మ్యాచ్‌లో ఈ శిక్ష పొందిన మొదటి బౌలరు అతడే.[38] అసోసియేట్ సభ్య జట్లపై రెండు మ్యాచ్‌లు మాత్రమే గెలిచిన తర్వాత పాకిస్థానీలు గ్రూప్ దశ నుండి నిష్క్రమించారు. ఆ టోర్నమెంటు తర్వాత అతను కెప్టెన్సీని వదులుకున్నాడు. అంతర్జాతీయ జట్టులో స్థానం కూడా కోల్పోయాడు.[39] దాదాపు 15 సంవత్సరాల కెరీర్ తర్వాత వకార్, 2004 ఏప్రిల్‌లో క్రికెట్ నుండి పూర్తిగా రిటైర్మెంట్ ప్రకటించాడు.[8] కెరీర్ ముగిసే సమయానికి వకార్, 373 వికెట్లతో టెస్ట్ క్రికెట్‌లో పాకిస్థాన్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు. [40]
కోచింగ్ కెరీర్
[మార్చు]2006 మార్చిలో వకార్‌ను పాకిస్తాన్‌కు బౌలింగ్ కోచ్‌గా నియమించారు.[41] తదుపరి జరిగే ఐదు వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల సిరీస్‌కు కాకుండా, దక్షిణాఫ్రికాతో జరిగే టెస్ట్ సిరీస్ వరకు మాత్రమే అతనిని కొనసాగించాలనే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్ణయానికి నిరసనగా అతను 2007 జనవరి 6 న కోచ్ పదవికి రాజీనామా చేశాడు.[42] [43] బౌలింగ్ కోచ్ పదవికి కెప్టెన్ ఇంజమామ్-ఉల్-హక్ తనకు బదులుగా ముస్తాక్ అహ్మద్‌ను సమర్థించడాన్ని కూడా అతను తప్పుపట్టాడు.[44] అతను 2009 డిసెంబరులో ఆస్ట్రేలియా పర్యటనలో పాకిస్తాన్ బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్‌గా వకార్‌ను తిరిగి నియమించారు.[45] 2010 ఫిబ్రవరిలో, ఆ సంవత్సరం ప్రారంభంలో ఆస్ట్రేలియా పర్యటనలో జాతీయ జట్టు తక్కువ స్థాయి ప్రదర్శనల కారణంగా ఇంతిఖాబ్ ఆలమ్‌ను కోచ్‌గా తొలగించిన తర్వాత యూనిస్ పాకిస్తాన్ ప్రధాన కోచ్‌గా నియమితులయ్యాడు.[46]
2010 ICC వరల్డ్ ట్వంటీ20 లో యూనిస్ ఖాన్, మహ్మద్ యూసుఫ్, షోయబ్ మాలిక్ లు లేని పాకిస్తాన్ జట్టుకు నాయకత్వం వహించడం కోచ్‌గా వకార్ మొదటి పని. మొహమ్మద్ అమీర్, మహ్మద్ ఆసిఫ్‌ల రూపంలో ఇద్దరు అగ్రశ్రేణి బౌలర్లు మాత్రం ఆ జట్టులో ఉన్నారు.[47][48] ఆ టోర్నమెంట్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌లైన పాకిస్తాన్‌ను సెమీ-ఫైనల్ వరకు నడిపించాడు. పాకిస్తాన్ జట్టు ఆస్ట్రేలియా చేతిలో ఎలిమినేట్ అయింది.[49]
ప్రపంచ ట్వంటీ 20 తరువాత 2010 ఆసియా కప్ జరిగింది. దీనిలో పాకిస్తాన్ టాప్ ఆర్డర్ కుప్పకూలడంతో స్వల్ప తేడాతో శ్రీలంక చేతిలో ఓడిపోయింది. షాహిద్ అఫ్రిది చేసిన 109 పరుగులు పాకిస్తాన్‌ను విజయానికి నడిపించడంలో విఫలమయ్యాయి. [50] ఆ తర్వాతి మ్యాచ్‌లో ఆఖరి ఓవర్ మూడో బంతికి హర్భజన్ సింగ్ సిక్సర్ బాదడంతో భారత్‌పై పాకిస్థాన్ తృటిలో ఓడిపోయింది. [51] తరువాతిది ఫలితంపై ఏ మాత్రం ప్రభావం చూపని మ్యాచ్. పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో ఆఫ్రిది మరొక సెంచరీ చేసాడు. పాకిస్తాన్ 385 పరుగులు చేసి, మ్యాచ్‌ను 139 పరుగుల తేడాతో సునాయాసంగా గెలుచుకుంది. [52]
ఆస్ట్రేలియాతో రెండు ట్వంటీ-20లు, రెండు టెస్ట్ మ్యాచ్‌లతో ఇంగ్లాండ్ పర్యటన జరిగింది. రెండు ట్వంటీ-20లను పాకిస్తాన్ సునాయాసంగా గెలుచుకుంది. మొదటి టెస్టులో పాకిస్తాన్ 154 పరుగుల తేడాతో ఓడిపోయింది. రెండో టెస్టులో పుంజుకున్న పాకిస్థాన్ 15 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఆస్ట్రేలియాను టెస్ట్ మ్యాచ్‌లో ఓడించింది. అంతకుముందు 1995లో సాధించిన విజయంలో వకార్ యూనిస్ అద్భుతమైన బౌలింగ్ చేసాడు. [53]
ఈ పర్యటన తర్వాత వివాదాస్పదమైన ఇంగ్లండ్ పర్యటన జరిగింది. ఆ సిరీస్‌ను 2-2తో సమం చేయడానికి పాకిస్థాన్ చివరి టెస్ట్ మ్యాచ్‌లో విజయం సాధించాల్సిన అవసరం ఉంది. మహ్మద్ అమీర్, మహ్మద్ ఆసిఫ్, కెప్టెన్ సల్మాన్ బట్ స్పాట్ ఫిక్సింగ్‌లో పాల్గొన్నారని న్యూస్ ఆఫ్ ది వరల్డ్ వార్తలను ప్రచురించింది. [54] ఆ ముగ్గురు ఆటగాళ్లను తాత్కాలికంగా సస్పెండ్ చేసారు.[55] పాకిస్తాన్ ఇన్నింగ్స్ 225 పరుగుల తేడాతో ఓడిపోయింది. చరిత్రలో వారికి అది అతిపెద్ద ఓటమి. [56] జట్టు నైతికత అథమ స్థాయిలో ఉన్న ఆ సమయంలో తర్వాతి రెండు T20 మ్యాచ్‌లను ఇంగ్లండ్ సునాయాసంగా గెలుచుకుంది. ఆ తర్వాత జరిగిన ODI సిరీస్‌ను కూడా ఇంగ్లాండ్ 3-2తో గెలుచుకుంది. [57]
2013 మార్చిలో, అతను ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2013 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ కోచ్‌గా చేరనున్నట్లు ప్రకటించబడింది. [58]
2014 మేలో, 2014 జూన్ నుండి ప్రారంభమయ్యే రెండు సంవత్సరాల కాలానికి పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా వకార్ తిరిగి నియమితుడై, ఆ హోదాలో రెండవసారి పనిచేశాడు.[59]
2016 ఏప్రిల్ 4 న ప్రధాన కోచ్ పదవికి వకార్ రాజీనామా చేశాడు. తన సిఫార్సులపై క్రికెట్ బోర్డు పనిచేయకపోవడం, వరల్డ్ టీ20 తర్వాత రహస్య నివేదిక లీక్ కావడం తన రాజీనామాకు కారణాలని వకార్ చెప్పాడు. [60] అతను పాకిస్థాన్ సూపర్ లీగ్ మూడో సీజన్‌లో ముల్తాన్ సుల్తాన్‌లకు ప్రధాన కోచ్‌గా వ్యవహరించాడు. [61] 2017 నవంబరు 16 న వకార్, 2017 కొరకు బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లోని సిల్హెట్ సిక్సర్స్ జట్టుకు మెంటార్‌గా నియమితుడయ్యాడు.[62] 2018 మార్చి 15 నాటికి బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ [63] తదుపరి రెండు ఎడిషన్‌లకు కూడా వారి ప్రధాన కోచ్‌గా నియమితుడయ్యాడు.
2019 క్రికెట్ ప్రపంచ కప్ తర్వాత వకార్, నాల్గవ సారి పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా నియమితుడయ్యాడు. [64]
శైలి
[మార్చు]రివర్స్ స్వింగ్ బౌలింగ్ చేయడంలో విజయం సాధించిన సర్ఫరాజ్ నవాజ్‌తో మొదలుపెట్టి అనేక మంది పాకిస్తానీ ఫాస్ట్ బౌలర్‌లలో వకార్ ఒకడు. అతని కెరీర్ ప్రారంభంలో ఇమ్రాన్ ఖాన్ రిటైర్ అయ్యే వరకూ అతన్ని ఓల్డ్-బాల్ బౌలర్‌గా వాడడం దీనికి ఒక కాత్రణం.[7][65][66] అక్రమ్‌తో భాగస్వామ్యంలో, యూనిస్ 1990లలో పాకిస్థాన్ బౌలింగ్ దాడికి తెరతీశాడు. క్రికెట్ విమర్శకులు, పండితులు వకార్, అక్రమ్‌లను క్రికెట్ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన ఫాస్ట్ బౌలింగ్ భాగస్వామ్యాలలో ఒకటిగా లెక్కించారు. వారు బంతిని అధిక వేగంతో స్వింగ్ చేయగలరు. రివర్స్ స్వింగ్ సామర్థ్యం, అతని వేగం ఆధునిక క్రికెట్‌లో అత్యంత ప్రతిభావంతులైన బౌలర్లలో ఒకడుగా మారడానికి దారితీసింది. [23] [31]
పాత బంతిని తగువిధంగా మార్చుకుని, రివర్స్ స్వింగ్ చేయగల తన సామర్థ్యాన్ని వకార్ వివరించాడు; ఒక వైపు మెరిసే, ఒక వైపు గరుకైన బంతి సంప్రదాయ స్వింగ్‌కు వ్యతిరేక దిశలో కదులుతుంది. [7] ఇది క్రికెట్ పిచ్‌లో ఇన్‌స్వింగర్‌లు, అవుట్‌స్వింగర్‌లను బౌలింగ్ చేయగల సామర్థ్యాన్ని వకార్ కలిగించింది. ఫలితంగా వకార్, అక్రమ్ లిద్దరూ స్వింగ్ బౌలింగ్‌లో ఈ వైవిధ్యం ద్వారా వికెట్లు తీయడంలో విజయవంతమయ్యారు. [65] [67] [68] క్రికెట్‌లో అతని వేగవంతమైన డెలివరీ 153 కిమీ/గం. 1993లో దక్షిణాఫ్రికాకు వ్యతిరేకంగా ఈ డెలివరీ వేసాడు. వెన్నులో తీవ్రమైన గాయాల కారణంగా అతని బౌలింగ్ వేగాన్ని తగ్గించాక వేసిన బంతి అది. [69] [70] అతను బౌన్సర్లు లేదా షార్ట్ పిచ్ డెలివరీలను వెయ్యడంలో కూడా ప్రభావవంతుడు. పాకిస్థాన్‌లోని షేక్‌పురాలో దక్షిణాఫ్రికాపై వకార్ బౌలింగ్, షార్ట్ పిచ్ డెలివరీని సమర్థవంతంగా ఉపయోగించుకున్నందుకు గుర్తుండిపోతుంది.
1992లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్ సిరీస్‌లో పాకిస్థాన్ విజయం సాధించిన తర్వాత, రివర్స్ స్వింగ్ డెలివరీపై ఇంగ్లీష్ మీడియా అనుమానం వ్యక్తం చేసింది. ఆ కాలంలో క్రికెట్ ప్రపంచానికి ఇది అంతగా తెలియదు. విమర్శకులు దీనిపై ఫౌల్ ప్లే అని ఆరోపణలు చేసారు. అయితే క్రికెట్ అధికారులకు ఫౌల్ ప్లేకి ఎటువంటి ఆధారాలు లభించలేదు. రివర్స్ స్వింగ్ డెలివరీ నైపుణ్యం క్రికెట్‌లో అంగీకరించబడింది.[71][72][73][74]
ప్రపంచకప్ చరిత్రలో రెండు హ్యాట్రిక్‌లు సాధించిన తొలి బౌలర్‌గా నిలిచిన శ్రీలంక ఫాస్ట్ బౌలర్, లసిత్ మలింగ, పాకిస్థాన్ దిగ్గజ జంట వసీం అక్రమ్, వకార్ యూనిస్‌లను చూసి తన ప్రాణాంతకమైన యార్కర్లను బౌలింగ్ చేయడం నేర్చుకున్నానని చెప్పాడు. [75] [76] సంవత్సరాలుగా అనేక మంది బౌలర్లు రివర్స్ స్వింగ్ నైపుణ్యాన్ని నేర్చుకుని, ప్రావీణ్యం సంపాదించారు. అయితే ఇంకా కొన్ని పద్ధతులు అన్వేషించబడలేదు, ఉదా బనానా స్వింగ్. వకార్ యూనిస్‌కు బనానా స్వింగ్ బౌలర్ అనే బిరుదు ఉంది. బంతి నేలను తాకడానికి ముందు చాలా ఎక్కువ వేగంతో గాలిలో స్వింగ్ చేసే సాంకేతికత అతని ప్రత్యేకత. అందుకే అతనికి ఆ పేరు వచ్చింది. అతని చాలా హ్యాట్రిక్‌లలో అతను బనానా స్వింగ్ బంతులను వేసాడు. బ్యటర్లు వాటిని ఆడలేరు. [73]
ఫాస్ట్ బౌలర్‌గా మంచి లక్షణాలు ఎన్ని ఉన్నప్పటికీ, కొన్ని సమయాల్లో అతను బాగా పరుగులు ఇచ్చేవాడు. వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ కర్ట్లీ ఆంబ్రోస్, ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్ గ్లెన్ మెక్‌గ్రాత్ వంటి బౌలర్లకు ఉన్న స్థిరత్వం అతనికి లేదు. దూకుడుకు, వేగానికీ ప్రాధాన్యత ఇచ్చే అతని మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ మనస్తత్వం దీనికి కొంత కారణం కావచ్చు. [23]
అవార్డులు రికార్డులూ
[మార్చు]- వకార్, టెస్ట్ మ్యాచ్ క్రికెట్‌లో 10,000 బంతులకు పైగా వేసిన బౌలర్లలో రెండవ అత్యుత్తమ స్ట్రైక్ రేట్ కలిగిన బౌలరు. టెస్ట్ మ్యాచ్ క్రికెట్‌లో 16224 బంతులు వేసిన తర్వాత అతని స్ట్రైక్ రేటు 43.4. అతని కంటే మెరుగైన స్ట్రైక్ రేటు కలిగిన బౌలరు డేల్ స్టెయిన్ ఒక్కడే - 17707 బంతులలో 42.0 స్ట్రైక్ రేటు
- 1992లో విస్డెన్ క్రికెటర్స్ ఆఫ్ ది ఇయర్ [25] [77] క్రీడా విజయాల కోసం వకార్ పేరు పొందాడు. వరుసగా 3 వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో ఒక్కో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన ఏకైక బౌలర్ కూడా. బౌలింగ్ చేసిన డెలివరీల పరంగా, అతను వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో అత్యంత వేగంగా 300, 350, 400 వికెట్లు తీసుకున్నాడు.
- ప్రాథమికంగా ఫాస్ట్ బౌలర్ అయినప్పటికీ, వకార్ తన కెరీర్‌లో 1010 టెస్ట్ మ్యాచ్ పరుగులు చేశాడు. 2005 సెప్టెంబరు నాటికి, అతను ఒక్క అర్ధ శతకం కూడా చేయకుండానే వెయ్యి పరుగులు సాధించిన ఏకైక నాన్-బ్యాట్స్‌మన్. [78] [79] 350కి పైగా టెస్టు వికెట్లు తీసిన బౌలర్లలో అత్యుత్తమ స్ట్రైక్ రేట్ రికార్డు వకార్ సృష్టించాడు. [9]
- వకార్ యూనిస్‌కు వన్‌డేల్లో కెప్టెన్‌గా అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలున్నాయి (7/36). వన్‌డేఇన్నింగ్స్‌లో 7 వికెట్లు తీసిన మొదటి కెప్టెన్ కూడా. [80]
- అతను 10వ నంబరు (478) వద్ద బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కెరీర్‌లో అత్యధిక వన్‌డే పరుగులు చేసిన రికార్డును కూడా కలిగి ఉన్నాడు [81]
- అతను వన్‌డే ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన అతి పిన్న వయస్కుడైన బౌలర్ (18 సంవత్సరాల 164 రోజుల వయస్సులో) [82]
- అతను వన్‌డే క్రికెట్‌లో అత్యధికంగా ఒక ఇన్నింగ్సులో 4+ వికెట్లు తీసిన రికార్డు (27) [83]
- అతను వరుసగా మూడు ఇన్నింగ్సుల్లో ఐదు వికెట్లు తీసిన రికార్డు సృష్టించాడు. అతను 3 సార్లు ఈ మైలురాయిని సాధించిన ఏకైక ఆటగాడు.[84]
- కెరీర్‌లో మూడుసార్లు వన్‌డే ఇన్నింగ్స్‌లో వరుసగా వరసగా 3 మ్యాచ్‌లలో 4+ వికెట్లు తీసుకున్న ఏకైక బౌలర్ [85]
ఒక ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు
[మార్చు]వకార్ యూనిస్ టెస్ట్ క్రికెట్‌లో 22 సందర్భాలలో ఒక ఇన్నింగ్స్‌లో ఐదు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టాడు. [86] వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో, అతను అత్యధికంగా ఐదు వికెట్లు (13 సందర్భాలలో) తీసుకున్నాడు. [87]
ICC హాల్ ఆఫ్ ఫేమ్
[మార్చు]యూనిస్‌ను 2013 డిసెంబరు 9 న ICC హాల్ ఆఫ్ ఫేమ్‌లో చేర్చారు. అతను హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి ప్రవేశించిన 70వ వ్యక్తి. స్వదేశీయుడు హనీఫ్ మొహమ్మద్, జహీర్ అబ్బాస్‌లతో పాటు అతని మాజీ సహచరులు ఇమ్రాన్ ఖాన్, జావేద్ మియాందాద్, వసీం అక్రమ్‌లతో పాటు చేరాడు. తన ప్రవేశంపై అతను ఇలా అన్నాడు: "ఇది నాకు చాలా గొప్ప గౌరవం, అటువంటి గౌరవానికి నన్ను అర్హులుగా భావించిన వ్యక్తులకు నేను నిజంగా కృతజ్ఞుడను." [88] [89] [90] [91]
వివాదాలు
[మార్చు]ICC టోర్నమెంట్‌లో ( 2021 T20 WC ) పాకిస్తాన్ మొదటిసారి భారత్‌ను ఓడించిన తర్వాత, ' రిజ్వాన్ హిందువుల ముందు నమాజ్ చేయడాన్ని చూడటం చాలా ప్రత్యేకమైనది' అని వకార్ చెప్పాడు. ఇది పాకిస్తాన్, భారతదేశం రెండింటిలో కలకలం సృష్టించింది. ఆ తరువాత అతను తన వ్యాఖ్యకు క్షమాపణలు చెప్పాడు. [92]
మూలాలు
[మార్చు]- ↑ "Keep calm and celebrate like a #Prince – The story behind Islamabad United nicknames". www.geo.tv (in ఇంగ్లీష్). Retrieved 2023-04-03.
- ↑ Bill Ricquier, The Pakistani Masters, Tempus (2006), p. 161 : "He was not as tall as Wasim, about six feet, compact and sturdy."
- ↑ "Waqar Younis Profile – ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz. Retrieved 25 April 2018.
- ↑ "Pakistan head coach Misbah-ul-Haq and bowling coach Waqar Younis step down from roles". BBC Sport. Retrieved 6 September 2021.
- ↑ "Records / Test matches / Individual records (captains, players, umpires) / Youngest captains". ESPNcricinfo. 21 April 2012. Retrieved 15 June 2021.
- ↑ "Waqar Younis". ESPNcricinfo. 21 April 2012. Retrieved 21 April 2012.
- ↑ 7.0 7.1 7.2 "The king of reverse swing". ESPNcricinfo. 8 April 2004. Retrieved 22 April 2012.
- ↑ 8.0 8.1 "Waqar brings down the curtain". ESPNcricinfo. 12 April 2004. Retrieved 21 April 2012.
- ↑ 9.0 9.1 "Records / Test matches / Bowling records / Best career strike rate". ESPNcricinfo. 21 April 2012. Retrieved 21 April 2012.
- ↑ "Ask Steven – Youngest to reach wickets' milestiones". ESPN Cricinfo. Retrieved 11 October 2016.
- ↑ "Waqar Younis appointed bowling and fielding coach". ESPNcricinfo. 9 December 2009. Retrieved 21 April 2012.
- ↑ "Waqar Younis signs as Pakistan coach". ESPNcricinfo. 3 March 2010. Retrieved 21 April 2012.
- ↑ "PCB confirms Waqar as coach". ESPNcricinfo. 6 March 2010. Retrieved 21 April 2012.
- ↑ "Waqar Younis resigns as Pakistan coach". ESPNcricinfo. 20 August 2011. Retrieved 21 April 2012.
- ↑ "Waqar Younis resigns as Pakistan coach". espnstar.com. 20 August 2011. Archived from the original on 18 September 2011. Retrieved 21 April 2012.
- ↑ "Waqar joins Sunrisers as bowling coach". Wisden India. 8 March 2013. Archived from the original on 8 May 2014. Retrieved 8 March 2013.
- ↑ "Misbah-ul-Haq named Pakistan head coach and chief selector". The News. 4 September 2019. Retrieved 8 September 2019.
- ↑ "Happy birthday Waqar: Burewala Express turns 46 – Cricket". Dunya News.
- ↑ Naveed, Shoaib (28 August 2012). "Exclusive: "I picked you to bowl fast"". Dawn News. Retrieved 5 February 2020.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Waqar swings in for new life on the Hill", The Sydney Morning Herald, 28 January 2005, retrieved 22 April 2012
- ↑ Earle, Richard (31 October 2014). "Waqar Younis tells of how he plotted Australia's downfall from his Sydney home". The Advertiser. Abu Dhabi, United Arab Emirates: News Corp Australia. Retrieved 15 June 2021.
- ↑ "World Cup 2006/07 – Fingers optional as Oram pursues dream". ESPNcricinfo. Retrieved 28 February 2007.
- ↑ 23.0 23.1 23.2 "The two W's – Wasim and Waqar". cricages.com. 21 April 2012. Retrieved 21 April 2012.
- ↑ "First Class Season 1991 - Leading Bowling Averages". ESPNcricinfo. Retrieved 5 October 2021.
- ↑ 25.0 25.1 "CRICKETER OF THE YEAR 1992 – Waqar Younis". ESPNcricinfo. Retrieved 21 April 2012.
- ↑ "Lancashire v Glamorgan at Liverpool, 18–21 Jun 1997 Report". The Electronic Telegraph. Cricinfo. Retrieved April 26, 2018.
- ↑ "Lancashire v Glamorgan at Liverpool, 18–21 June 1997 Scorecard". Wisden CricInfo. Retrieved April 26, 2018.
- ↑ "1997 First-Class Bowling – Most Wickets". Cricinfo. Retrieved April 26, 2018.
- ↑ "Champions Trophy – 2nd match". ESPNcricinfo. 14 October 1989. Retrieved 21 April 2012.
- ↑ "Cricket World Cup 2003 – Waqar Younis". BBC Sport. 15 January 2007. Retrieved 21 April 2012.
- ↑ 31.0 31.1 "Greatest Partnerships – Deadly duos". ESPNcricinfo. 15 December 2011. Retrieved 21 April 2012.
- ↑ "Mandela Trophy – 11th match". ESPNcricinfo. 19 December 1994. Retrieved 21 April 2012.
- ↑ "Mudassar: Wasim and Waqar rivalry undermined Pakistan cricket". ESPNcricinfo. 15 September 2003. Retrieved 21 April 2012.
- ↑ "The days of Waqar vs Wasim". PakPassion. 21 June 2008. Retrieved 21 April 2012.
- ↑ "Waqar Younis appointed captain through World Cup 2003". ESPNcricinfo. 2 October 2002. Retrieved 21 April 2012.
- ↑ "Waqar suspended for ball-tampering". BBC. 1 July 2007. Retrieved 22 April 2012.
- ↑ "Waqar Younis the first bowler to be banned for ball-tampering". BBC. 1 July 2007. Retrieved 22 April 2012.
- ↑ "ICC Cricket World Cup 2003 – Australia v Pakistan". ESPNcricinfo. 11 February 2003. Retrieved 21 April 2012.
- ↑ Eight from the World Cup squad sacked, ESPNcricinfo, 20 March 2003, retrieved 21 April 2012
- ↑ "Most Wickets in Test Cricket". InningsBreak. 13 October 2022.
- ↑ Waqar Younis appointed bowling coach, ESPNcricinfo, 15 January 2007, retrieved 22 April 2012
- ↑ Waqar quits Pakistan coach role, BBC News, 15 June 2007, retrieved 22 April 2012
- ↑ Waqar resigns as bowling coach, ESPNcricinfo, 15 January 2007, retrieved 22 April 2012
- ↑ multisupi (25 March 2009). "Waqar Younis's Controversial Retirement (1)" (in ఉర్దూ). Archived from the original on 2016-03-09. Retrieved 25 April 2018 – via YouTube.
- ↑ Waqar Younis appointed bowling and fielding coach, ESPNcricinfo, 12 December 2009, retrieved 22 April 2012
- ↑ "I've left my ego back in Australia, says Waqar". International – The News. Retrieved 28 March 2010.[permanent dead link]
- ↑ "Rana, Malik get one-year bans, Younis and Yousuf axed from teams". ESPNcricinfo. 10 March 2010. Retrieved 22 April 2012.
- ↑ "Top Pakistan players face fines, bans". ESPNcricinfo. 8 March 2010. Retrieved 22 April 2012.
- ↑ "Michael Hussey stuns Pakistan". ESPNcricinfo. 14 March 2010. Retrieved 22 April 2012.
- ↑ "Malinga helps super Sri Lanka survive Afridi". ESPNcricinfo. 21 June 2010. Retrieved 22 April 2012.
- ↑ "Pakistan eliminated in cliffhanger". ESPNcricinfo. 19 June 2010. Retrieved 22 April 2012.
- ↑ "Afridi's century flattens Bangladesh". ESPNcricinfo. 21 June 2010. Retrieved 22 April 2012.
- ↑ "Pakistan prevail in thrilling finale". ESPNcricinfo. 24 July 2010. Retrieved 22 April 2012.
- ↑ "Pakistan spot-fixing scandal: the key figures". BBC. 1 September 2010. Retrieved 22 April 2012.
- ↑ "ICC suspend trio under anti-corruption code". ESPNcricinfo. 2 September 2010. Retrieved 22 April 2012.
- ↑ "Pakistan slump to massive defeat amid huge scandal". ESPNcricinfo. 26 August 2010. Retrieved 22 April 2012.
- ↑ "Pakistan tour of England, 2010 / Results". ESPNcricinfo. Retrieved 22 April 2012.
- ↑ "Waqar joins Sunrisers as bowling coach". Wisden India. 8 March 2013. Archived from the original on 8 May 2014. Retrieved 8 March 2013.
- ↑ "Waqar Younis haven given his second term on". ESPNcricinfo. 6 May 2014. Retrieved 8 May 2014.
- ↑ Sport, Dawn (2016-04-04). "Waqar Younis resigns as Pakistan coach". www.dawn.com. Retrieved 2016-04-04.
- ↑ "Multan Sultans reunite Wasim, Waqar for PSL". Retrieved 25 April 2018.
- ↑ Independent, The. "Waqar to act as mentor of Sylhet Sixers". Archived from the original on 1 డిసెంబరు 2017. Retrieved 25 April 2018.
- ↑ "Waqar Younis to coach BPL franchise Sylhet Sixers". Retrieved 25 April 2018.
- ↑ "Waqar Younis reappointed bowling coach of Pakistan". Retrieved 9 November 2019.
- ↑ 65.0 65.1 "Swing and seam bowling". BBC. 19 August 2005. Retrieved 22 April 2012.
- ↑ TALhi Sports (2016-12-28), Waqar Younis Reverse Swing, Fast Bowling Masterclass Tips – Pakistan Vs Australia 2016/17 HD, archived from the original on 2019-07-11, retrieved 2017-01-09
- ↑ "Reverse swing – a rough guide". ESPNcricinfo. 2000. Retrieved 22 April 2012.
- ↑ "The advent of reverse swing". ESPNcricinfo. 7 August 2010. Retrieved 22 April 2012.
- ↑ "Fire fight gets hotter". BBC. 13 April 2002. Retrieved 22 April 2012.
- ↑ "Records / All cricket records (including minor cricket) / Miscellaneous records / Bowling speeds (1)". ESPNcricinfo. Retrieved 22 April 2012.
- ↑ "WISDEN: Subtle law change would free Waqar and co from controversy, 1993 – Pakistani bowling – fair or foul?". ESPNcricinfo. Retrieved 22 April 2012.
- ↑ "ENGLAND v PAKISTAN 1992". ESPNcricinfo. Retrieved 22 April 2012.
- ↑ 73.0 73.1 Smyth, Rob (11 February 2009). "The Joy of Six: great England batting collapses". The Guardian. London. Retrieved 22 April 2012.
- ↑ "An oriental art comes full circle". ESPNcricinfo. 21 August 2005. Retrieved 22 April 2012.
- ↑ "I learnt a lot from watching Waqar and Wasim – Malinga". ESPNcricinfo. 1 March 2011. Retrieved 22 April 2012.
- ↑ "I learned from Waqar, Wasim – Lasith". The Guardian. 3 March 2011. Retrieved 22 April 2012.
- ↑ "Wisden's five Cricketers of the Year". ESPNcricinfo. 16 May 2005. Retrieved 22 April 2012.
- ↑ "Pakistan / Players / Waqar Younis". ESPNcricinfo. Retrieved 22 April 2012.
- ↑ Lynch, Steven (21 March 2005). "Luckless tossers and 1000 runs without a fifty". ESPNcricinfo. Retrieved 9 April 2010.
- ↑ "Best figures in a innings by a captain in ODI history". cricinfo.
- ↑ "Most career ODI runs when batting at each positions". howstat.
- ↑ "Records / One-Day Internationals / Bowling records / Youngest player to take five-wickets-in-an-innings". cricinfo.
- ↑ "Records / One-Day Internationals / Bowling records / Most four-wickets-in-an-innings in a career". cricinfo.
- ↑ "Records / One-Day Internationals / Bowling records / Most consecutive five-wickets-in-an-innings in a career". cricinfo.
- ↑ "Records / One-Day Internationals / Bowling records / Most consecutive four-wickets-in-an-innings in a career". cricinfo.
- ↑ "Test matches: Bowling Records – Most five-wickets-in-an-innings in a career". ESPNcricinfo. Retrieved 30 September 2011.
- ↑ "One-Day Internationals: Bowling Records – Most five-wickets-in-an-innings in a career". ESPNcricinfo. Retrieved 30 September 2011.
- ↑ "Waqar Younis inducted into the ICC Cricket Hall of Fame". ICC Cricket. 11 December 2013. Archived from the original on 7 November 2015. Retrieved April 25, 2018.
- ↑ "Waqar, Gilchrist to be inducted into ICC Hall of Fame". The Hindu. PTI. 9 December 2013. Retrieved 30 December 2013.
- ↑ "Waqar, Gilchrist inducted into ICC's Hall of Fame". Dawn.com. 9 December 2013. Retrieved 30 December 2013.
- ↑ The Captive (9 December 2013). "Gilchrist, Waqar to enter ICC Hall of Fame – Cricket News". TVNZ. Retrieved 30 December 2013.
- ↑ Hindol Basu (Oct 28, 2021). "Waqar Younis apologises for 'namaz in front of Hindus' remark | Cricket News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-11-14.