జావెలిన్ త్రో

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జావెలిన్ త్రో
జావెలిన్ ను విసురుతున్న క్రీడాకారుడు.

జావెలిన్ త్రో అనేది ఒక విధమైన క్రీడ. ఈ క్రీడలో జావెలిన్ అనే ఒక ఈటె లేదా బల్లెము వంటి పొడుగైన వస్తువును దూరంగా విసరడం. ఎవరు ఎక్కువ దూరం విసిరితే వారు గెలిచినట్లుగా భావిస్తారు. ఈ జావెలిన్ లోహాలతో గాని, ఫైబర్ గ్లాస్ తో గాని లేదా కార్బన్ తో గాని తయారుచేస్తారు.

చాలా దేశలలో ప్రస్తుతం ఒక క్రీడగా మాత్రమే ప్రాచుర్యంలో ఉన్న జావెలిన్ త్రో ప్రాచీన కాలం నుండి వేట, యుద్ధాలలో ఉపయోగంలో ఉన్నాయి.

జావెలిన్ ను శంకరనారాయణ తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు ప్రకారం తెలుగులో బల్లెకోల అంటారు.

ఒలింపిక్ క్రీడలలో జావెలిన్

[మార్చు]

జావెలిన్ త్రో క్రీడను వేసవి ఒలింపిక్ క్రీడలులో 1906 నుండి ప్రవేశపెట్టినారు.

జావెలిన్ త్రో యూరపులోని స్కాండినేవియా దేశాలైన నార్వే, స్వీడన్, ఫిన్లాండ్ లలో ప్రాచీనకాలం నుండి సాంప్రదాయంగా నిలిచింది. ఇప్పటి వరకు ప్రదానంచేసిన 66 ఒలింపిక్ పతకాలలో 30 పతకాలు ఈ దేసస్థులే కైవసం చేసుకున్నారు. ఫిన్లాండ్ రెండు సార్లు, 1920, 1932 ఒలింపిక్ క్రీడలలో అన్ని పతకాలు గెలుచుకొని రికార్డు సాధించింది.

బయటి లింకులు

[మార్చు]