సన్ రైజర్స్ హైదరాబాద్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
సన్ రైజర్స్ హైదరాబాద్
సన్ రైజర్స్ హైదరాబాద్ లొగొ.png
Captain: శిఖర్ ధావన్
Coach: Australia టామ్‍మూడీ
City: హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్
Colours: SRH
Founded: 2012
Home ground: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ మైదానం
(సామర్ధ్యం: 55,000)
Owner: కళానిధిమారన్
IPL wins: 0
CLT20 wins: 0
Official website: sunrisershyderabad.in

సన్ రైసెర్స్ హైదరాబాద్ 2012 నుండి ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలలో హైదరాబాదు కు ప్రాతినిథ్యం వహిస్తున్న జట్టు. రద్దయిన డెక్కన్ చార్జర్స్ జట్టు స్థానంలో 25 ఆక్టోబరు, 2012 న కొత్తగా వచ్చిన జట్టు. దీనిని సన్ నెట్‍వర్క్ వారు కొనుగోలు చేసారు.

జట్టు వివరాలు[మార్చు]

2013[మార్చు]

వరుస సంఖ్య. ఆటగాడి పేరు పౌరసత్వం పుట్టినరోజు బంతి కొట్టే వాటం బంతి విసిరే వాటం వివరాలు
బంతి కొట్టే ఆటగాళ్ళు
06 భరత్ చిప్లి India (1983-01-27) 27 జనవరి 1983 (age 31) కుడిచేయి వాటం కుడిచేయి వేగంగా
07 కామెరాన్ వైట్ Australia (1983-08-18) 18 ఆగష్టు 1983 (age 30) కుడిచేయి వాటం కుడిచేయి నెమ్మది విదేశీ ఆటగాడు
12 అభిషేక్ జున్‍జున్‍వాలా India (1982-12-01) 1 డిసెంబరు 1982 (age 31) కుడిచేయి వాటం కుడిచేయి నెమ్మది
21 జె. పి. డుమిని South Africa (1984-04-14) 14 ఏప్రిల్ 1984 (age 30) ఎడమచేయి వాటం కుడిచేయి నెమ్మది విదేశీ ఆటగాడు
25 శిఖర్ ధావన్ India (1985-12-15) 15 డిసెంబరు 1985 (age 28) ఎడమచేయి వాటం కుడిచేయి నెమ్మది
27 అక్షత్ రెడ్డి India (1991-02-11) 11 ఫిబ్రవరి 1991 (age 23) కుడిచేయి వాటం కుడిచేయి నెమ్మది
50 క్రిస్ లిన్ Australia (1990-04-10) 10 ఏప్రిల్ 1990 (age 24) కుడిచేయి వాటం ఎడమచేయి అతి నెమ్మది విదేశీ ఆటగాడు
69 ద్వారకా రవితేజ India (1987-09-05) 5 సెప్టెంబరు 1987 (age 26) కుడిచేయి వాటం కుడిచేయి నెమ్మది
బంతి విసరగలిగే మరియు కొట్టగలిగే ఆటగాళ్ళు
14 ఆశిశ్ రెడ్డి India (1991-02-24) 24 ఫిబ్రవరి 1991 (age 23) కుడిచేయి వాటం కుడిచేయి వేగము/మధ్యస్థము
52 బిప్లబ్ సమర్థ్‍రాయ్ India (1988-12-14) 14 డిసెంబరు 1988 (age 25) కుడిచేయి వాటం కుడిచేయి వేగము/మధ్యస్థము
వికెట్ల వెనక బంతి సంరక్షకులు
11 కుమార సంగక్కర Sri Lanka (1977-10-27) 27 అక్టోబరు 1977 (age 36) ఎడమచేయి వాటం కుడిచేయి నెమ్మది విదేశీ ఆటగాడు
42 పార్థివ్ పటేల్ India (1985-03-09) 9 మార్చి 1985 (age 29) ఎడమచేయి వాటం కుడిచేయి నెమ్మది
బంతి విసిరే ఆటగాళ్ళు
01 ఇశాంత్ శర్మ India (1988-09-02) 2 సెప్టెంబరు 1988 (age 25) కుడిచేయి వాటం కుడిచేయి వేగము/మధ్యస్థము
02 జువాన్ ధెరాన్ South Africa (1985-06-24) 24 జూన్ 1985 (age 28) ఎడమచేయి వాటం కుడిచేయి వేగము/మధ్యస్థము విదేశీ ఆటగాడు
05 అంకిత్ శర్మ India (1991-04-20) 20 ఏప్రిల్ 1991 (age 22) ఎడమచేయి వాటం ఎడమచేయి అతి నెమ్మది
08 డేల్ స్టెయిన్ South Africa (1983-06-27) 27 జూన్ 1983 (age 30) కుడిచేయి వాటం కుడిచేయి వేగము విదేశీ ఆటగాడు
09 ఆనంద్ రాజన్ India (1987-04-17) 17 ఏప్రిల్ 1987 (age 27) కుడిచేయి వాటం కుడిచేయి వేగము
72 వీర్ ప్రతాప్ సింగ్ India (1992-05-03) 3 మే 1992 (age 21) కుడిచేయి వాటం కుడిచేయి వేగము
99 అమిత్ మిశ్రా India (1982-11-24) 24 నవంబరు 1982 (age 31) కుడిచేయి వాటం కుడిచేయి నెమ్మది

2013 ఛాంపియన్స్ లీగ్ ట్వంటీ20[మార్చు]

అర్హత పోటీ 1: చాంపియన్స్ లీగ్‌లో హైదరాబాద్ సన్‌రైజర్స్ తొలి విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. సీఎల్‌టి20 అర్హత మ్యాచుల్లో భాగంగా 2013 సెప్టెంబరు17, మంగళవారం జరిగిన పోరులో సన్‌రైజర్స్ ఎనిమిది వికెట్ల తేడాతో కందురతా మారూన్స్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కందురతా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 168 పరుగులు చేసింది.

అర్హత పోటీ 2:పీసీఏ స్టేడియంలో 2013 సెప్టెంబరు 18, బుధవారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు 7 వికెట్ల తేడాతో ఫైసలాబాద్ వోల్వ్స్‌పై నెగ్గింది. టాస్ గెలిచిన సన్‌రైజర్స్ ఫీల్డింగ్ ఎంచుకోగా.. ఫైసలాబాద్ వోల్వ్స్ జట్టు 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 127 పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్లు అమ్మర్ (31), అలీ (16) 48 పరుగులు జోడించి శుభారంభాన్నిచ్చినా... మిగిలిన బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. కెప్టెన్ మిస్బావుల్ హక్ (40 బంతుల్లో 56 నాటౌట్; 1 ఫోర్, 5 సిక్సర్లు) ఒంటరి పోరాటంతో కనీసం ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. సన్‌రైజర్స్ బౌలర్లంతా సమష్టిగా రాణించారు.

అర్హత పోటీ 3: సన్‌రైజర్స్ జోరుకు పగ్గాలు వేస్తూ 2013 సెప్టెంబరు 20 ,శుక్రవారం మొహాలీలో జరిగిన చివరి మ్యాచ్‌లో ఒటాగో వోల్ట్స్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ రెండు జట్లు ఇప్పటికే ప్రధాన మ్యాచ్‌లకు అర్హత సాధించడంతో ఎలాంటి ప్రాధాన్యత లేని ఈ మ్యాచ్‌లో రైజర్స్ విఫలమైంది. ఈ గెలుపుతో క్వాలిఫయింగ్‌లో వోల్ట్స్ ఆడిన మూడు మ్యాచుల్లోనూ నెగ్గినట్లయింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 143 పరుగులు చేయగా, ఒటాగో 16.2 ఓవర్లలో 5 వికెట్లకు 144 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ఫామ్‌లో ఉన్న కెప్టెన్ ధావన్ (10 బంతుల్లో 12; 1 సిక్స్)తో పాటు పార్థివ్ (12 బంతుల్లో 12; 2 ఫోర్లు), సమంత్రే (8) వెంట వెంటనే వెనుదిరగడంతో రైజర్స్ 45 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది.

2014 ఇండియన్ ప్రీమియర్ లీగ్[మార్చు]

బయటి లంకెలు[మార్చు]