హైదరాబాదు క్రికెట్ సంఘం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హైదరాబాద్ క్రికెట్ అసోషియన్
ఉప్పల్‌, హైదరాబాదులోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం
జట్టు సమాచారం
స్థాపితం1934
స్వంత మైదానంరాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం
అధికార వెబ్ సైట్hycricket.org

హైదరాబాదు క్రికెట్ సంఘం (ఆంగ్లం: Hyderabad Cricket Association) అనేది హైదరాబాదు, తెలంగాణ రాష్ట్రంలోని ఇతర జిల్లాలు, హైదరాబాదు క్రికెట్ జట్టు కార్యకలాపాలకు పాలకమండలి. ఇది బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియాకు అనుబంధంగా పనిచేస్తుంది. ఇది 1934లో స్థాపించబడింది.

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంను నిర్వహిస్తుంది, ఇది అంతర్జాతీయ స్థాయి టెస్ట్, ODI, T20 క్రికెట్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తుంది.

2022 సెప్టెంబరు 25న ఉప్పల్‌ స్టేడియంలో భారత్‌-ఆస్ట్రేలియా మధ్య టీ-20 మ్యాచ్‌ జరగనున్న నేపథ్యంలో టికెట్ల విక్రయాలు చేపట్టిన హెచ్‌సీఏకు చేదు అనుభవం ఎదురైంది. సికింద్రాబాద్‌లోని జింఖానా మైదానంలో టికెట్ల విక్రయ కేంద్రం వద్ద అంచనాలకు మించి అభిమానులు ఒక్కసారిగా తోసుకుని రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వాళ్లను నియంత్రించేందుకు పోలీసులు లాఠీఛార్జ్‌ చేయడంతో తొక్కిసలాటకు దారితీసింది. 2022 సెప్టెంబరు 22న జరిగిన ఈ ఘటనలో పలువురు స్పృహ తప్పి పడిపోయారు. ఈ తొక్కిసలాటకు హెచ్‌సీఏ నిర్లక్ష్యమే కారణమని అజారుద్దీన్‌, హెచ్‌సీఏ నిర్వాహకులపై బేగంపేట పోలీస్‌స్టేషన్‌లో అభిమానులు ఫిర్యాదు చేశారు.[1]

తెలంగాణ టి20 ప్రీమియర్ లీగ్[మార్చు]

2017 డిసెంబరులో రాష్ట్రవ్యాప్తంగా కాకా T20 టోర్నమెంట్‌ను నిర్వహించడంతో హెచ్‌సీఏ తెలంగాణ T20 ప్రీమియర్ లీగ్‌ని ప్రారంభించింది.

ప్రస్తుత పాలక మండలి[మార్చు]

  • అధ్యక్షుడు : అజారుద్దీన్
  • వైస్ ప్రెసిడెంట్: జాన్ మనోజ్
  • కార్యదర్శి: విజయానంద్
  • ఉమ్మడి కార్యదర్శి: నరేష్ శర్మ
  • కోశాధికారి: సురేందర్ అగర్వాల్

మూలాలు[మార్చు]

  1. "Hyderabad: అజారుద్దీన్‌, హెచ్‌సీఏ నిర్వాహకులపై బేగంపేట పీఎస్‌లో ఫిర్యాదు". web.archive.org. 2022-09-23. Archived from the original on 2022-09-23. Retrieved 2022-09-23.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

వెలుపలి లంకెలు[మార్చు]