ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్
ఆటలుక్రికెట్
పరిధిఆంధ్రప్రదేశ్
పొట్టి పేరుACA
స్థాపన1953 (1953)
అనుబంధంబిసిసిఐ
ప్రాంతీయ అనుబంధంSouth
మైదానంACA-VDCA అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, విశాఖపట్నం
స్థానంవిశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
India

ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ACA) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రికెట్ పాలక మండలి. ఇది అసోసియేషన్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI)కి అనుబంధంగా ఉంటూ ఆంధ్రా క్రికెట్ జట్టును నియంత్రిస్తుంది. ఈ సంఘాన్ని 1953 లో స్థాపించారు. అప్పటి నుండి BCCIకి అనుబంధంగా ఉంది. ACA విశాఖపట్నంలోని ACA-VDCA అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంను నిర్వహిస్తోంది. ఇది అంతర్జాతీయ స్థాయి టెస్టు, ODI, T20 క్రికెట్ మ్యాచ్‌లను నిర్వహిస్తుంది. అసోసియేషన్ ప్రధాన కార్యాలయం విశాఖపట్నంలో ఉంది. భారత క్రికెట్ జట్టు మొదటి కెప్టెన్ అయిన సి.కె.నాయుడు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏర్పాటులో కీలకపాత్ర పోషించాడు. దాని వ్యవస్థాపక అధ్యక్షుడు కూడా అతనే. [1] [2] ఆంధ్రా క్రికెట్ జట్టుకు తొలి కెప్టెన్ కూడా నాయుడే. [3] [4]

చరిత్ర

[మార్చు]

1951 లో గుంటూరు రిక్రియేషన్ క్లబ్ మద్రాస్ క్రికెట్ అసోసియేషన్‌కు అనుబంధంగా ఏర్పడినప్పటి నుండి సంస్థకు పునాదులు ఏర్పడ్డాయి. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చివరికి [2] 1953 లో ఏర్పడింది.

భారత క్రికెట్ జట్టు తొలి కెప్టెన్ సీకే నాయుడు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఏర్పాటులో కీలకపాత్ర పోషించాడు. [2] [1] అతను ACA వ్యవస్థాపక అధ్యక్షుడు. [3] [4] సికె నాయుడు, అతని సోదరుడు సిఎస్ నాయుడు గుంటూరులో ఆడారు. స్థానిక క్రికెటర్లకు మార్గదర్శకులుగా ఉన్నారు. [4] 1953-54 సీజన్‌లో మైసూరుతో జరిగిన తొలి రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో 58 ఏళ్ల సికె నాయుడు, ఆంధ్ర జట్టుకు నాయకత్వం వహించాడు. [1] ఆ మ్యాచ్‌లో అతను జట్టుకు తొలి అర్ధశతకం కూడా సాధించాడు. [5]

అంతర్జాతీయ క్రీడాకారులైన MSK ప్రసాద్, వేణుగోపాలరావులు ACA నుండి వచ్చినవారే. ACA నుండి చాలా మంది ఆటగాళ్ళు D శివకుమార్, జ్ఞానేశ్వరరావు (భారత U19కి కెప్టెన్), GVS ప్రసాద్, బోడపాటి సుమంత్, ఇటీవల రికీ భుయ్‌లు భారత U-19 జట్టులో ఆడారు.

మైదానాలు

[మార్చు]
వేదిక నగరం స్థాపన కెపాసిటీ గమనికలు
అంతర్జాతీయ మైదానం
ACA-VDCA అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం విశాఖపట్నం 2003 35,000 [6]
దేశీయ మైదానాలు
డాక్టర్ PVG రాజు ACA స్పోర్ట్స్ కాంప్లెక్స్ విజయనగరం 2013 n/a [7]
ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఉమెన్స్ క్రికెట్ అకాడమీ గ్రౌండ్ గుంటూరు 2011 n/a
CSR శర్మ కళాశాల మైదానం ఒంగోలు 2012 n/a
కందుల శ్రీనివాస రెడ్డి మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ గ్రౌండ్ కడప 2012 n/a
పోర్ట్ ట్రస్ట్ డైమండ్ జూబ్లీ స్టేడియం విశాఖపట్నం 1993 n/a 2005లో ఆఫ్రో-ఆసియా అండర్-19 కప్‌ను నిర్వహించింది
రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ స్టేడియం అనంతపురం 2003 5,000
వైఎస్ రాజారెడ్డి స్టేడియం కడప 2011 15,000
పోలీస్ పరేడ్ గ్రౌండ్ అనంతపురం 1962 2008 లో అంతర్రాష్ట్ర మహిళల పోటీ, 2008-09 లో సీనియర్ మహిళ లిస్ట్ ఎ మ్యాచ్‌లను ఇక్కడ నిర్వహించారు
శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ గ్రౌండ్ తిరుపతి 1984 1984, 1992 లో రంజీ మ్యాచ్‌లు జరిగాయి
విజ్జీ స్టేడియం విజయనగరం 1995 5000
ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఏలూరు

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 "The land of Vizzy & C K Nayudu finally to host a test match". The Times of India. 2016-11-16. ISSN 0971-8257. Retrieved 2023-04-24. "It was February 1953 when Col CK Nayudu, the first captain of the Indian team, became the founder president of ACA," local cricketologist Prof Prasanna Kumar told TOI. "He was 58-years-old when he led Andhra in their first Ranji match against Mysuru and coming to bat in the middle, smote a huge six off pacer Kasturirangan," Prof Kumar reminisced."Col Nayudu and his brother CS Nayudu played in Guntur and taught the boys discipline, from how to don the flannels to doing their laces; they instilled the quintessence of cricket in Andhra boys," he added.
  2. 2.0 2.1 2.2 "History of ACA". Andhra Cricket Association. Archived from the original on 2023-08-01. Retrieved 2023-04-24.
  3. 3.0 3.1 Guha, Ramachandra (1992). Wickets in the East: An Anecdotal History (in ఇంగ్లీష్). Oxford University Press. p. 155. ISBN 978-0-19-562809-8.
  4. 4.0 4.1 4.2 A. Prasanna Kumar (October 2010). "International Cricket at Vizag" (PDF). p. 9, 16. Retrieved 25 April 2023.
  5. "Mysore v Andhra 1953-54". Cricinfo. Retrieved 28 February 2021.
  6. "Dr. Y.S. Rajasekhara Reddy ACA-VDCA Cricket Stadium | India | Cricket Grounds | ESPN Cricinfo". Cricinfo. Retrieved 9 October 2016.
  7. "P.V.G. Raju Sports Complex opened". The Hindu. 16 June 2013. Retrieved 9 October 2016.

వెలుపలి లంకెలు

[మార్చు]