తమిళనాడు క్రికెట్ అసోసియేషన్
దస్త్రం:Tamil Nadu Cricket Association.png | |
ఆటలు | క్రికెట్ |
---|---|
పరిధి | తమిళనాడు |
పొట్టి పేరు | టిఎన్సిఏ |
స్థాపన | 1932 |
అనుబంధం | బిసిసిఐ |
మైదానం | ఎం.ఎ. చిదంబరం స్టేడియం |
స్థానం | చెన్నై, తమిళనాడు |
Official website | |
తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (TNCA) తమిళనాడు రాష్ట్రంలో క్రికెట్ కార్యకలాపాలను నిర్వహించే పాలకమండలి. ఇది బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియాతో అనుబంధంగా ఉంటూ తమిళనాడు క్రికెట్ జట్టును నియంత్రిస్తుంది. BCCI శాశ్వత టెస్టు కేంద్రాలలో TNCA ఒకటి. [1]
చరిత్ర
[మార్చు]1932లో మద్రాసులో రాష్ట్ర వ్యవస్థీకృత లీగ్ క్రికెట్ ప్రారంభమైనప్పుడు ఈ బోర్డు ఏర్పడింది. రెండు ప్రత్యర్థి సంస్థలైన ఇండియన్ క్రికెట్ ఫెడరేషన్, మద్రాస్ క్రికెట్ క్లబ్‌లు విలీనమై మద్రాస్ క్రికెట్ అసోసియేషన్ (MCA) గా ఏర్పడ్డాయి.[2]
MCA అధికారికంగా 1935 ఏప్రిల్ 30 న స్థాపించారు. కొంతకాలం తర్వాత భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుతో అనుబంధం ఏర్పడింది. ఈ క్రికెట్ అసోసియేషన్ ఈ ప్రావిన్స్‌లో క్రికెట్‌కు ప్రాతినిధ్యం వహిస్తుంది.[2]
1933-34 నాటికి, అసోసియేషనులో మొదటి, రెండవ డివిజన్ లీగ్‌లు ఉన్నాయి. తరువాతి సీజనులో మూడవ డివిజన్ను జోడించారు. 1939-40 నాటికి, నాల్గవ విభాగం ఏర్పడింది. [2]
1967-68 సీజన్‌లో, MCA పేరును తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (TNCA)గా మార్చారు. 2008 నాటికి, ఇందులో మొత్తం 132 జట్లు, ఐదు విభాగాలూ ఉన్నాయి.[2]
డివిజన్ లీగ్‌లు
[మార్చు]తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ జాతీయ టోర్నమెంట్‌లను నిర్వహించడంతో పాటు వివిధ లీగ్ టోర్నమెంట్‌లు, U19, U22, U25 విభాగాల్లోని వయోవర్గాల కోసం టోర్నమెంట్‌లను నిర్వహిస్తుంది. ఇది నగర అనుబంధ క్లబ్‌ల కోసం లీగ్ ఛాంపియన్‌షిప్‌ను కూడా నిర్వహిస్తుంది. [2]
మొదటి డివిజన్ నుండి ఐదవ డివిజన్ వరకు ప్రతి సంవత్సరం 726 లీగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. మొదటి, రెండవ డివిజన్లున్న ఎ జోన్‌లో 12 జట్లు ఆడతాయి. మూడవ, నాల్గవ, ఐదవ డివిజన్‌లలో వరుసగా రెండు, మూడు, నాలుగు జోన్‌లు ఉంటాయి. మూడు రోజుల వ్యవధి లీగ్ మ్యాచ్‌లు జరిగే మొదటి డివిజన్‌లోని సిటీ లీగ్ ఫార్మాట్ రంజీ ట్రోఫీ మార్గదర్శకాలను అనుసరిస్తుంది. [2]
స్వంత మైదానం
[మార్చు]చెన్నైలో ఉన్న MA చిదంబరం స్టేడియం లేదా చెపాక్ స్టేడియం టిఎన్‌సిఏకు హోమ్ గ్రౌండ్. ఈ స్టేడియంను 1916లో స్థాపించారు. ఇది దేశంలోనే అత్యంత పురాతనమైన క్రికెట్ స్టేడియం. దీనికి BCCI మాజీ అధ్యక్షుడు MA చిదంబరం పేరు పెట్టారు, ఈ స్టేడియంను గతంలో మద్రాస్ క్రికెట్ క్లబ్ గ్రౌండ్ అని పిలిచేవారు. [3] [4]
ఇది తమిళనాడు క్రికెట్ జట్టు, ఇండియన్ ప్రీమియర్ లీగ్ జట్లలో ఒకటైన చెన్నై సూపర్ కింగ్స్ లకు కూడా హోమ్ గ్రౌండ్. బంగాళాఖాతం వెంబడి మెరీనా బీచ్ నుండి కొన్ని వందల మీటర్ల దూరంలో చెపాక్ వద్ద ఈ స్టేడియం ఉంది. [3]
TNCA నుండి వచ్చిన ఇటీవలి జాతీయ క్రీడాకారులు
[మార్చు]- దినేష్ కార్తీక్ - భారత క్రికెట్ జట్టులో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్
- మురళీ విజయ్ - భారత క్రికెట్ జట్టులో మాజీ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్.
- రవిచంద్రన్ అశ్విన్ - భారత క్రికెట్ జట్టులో ఆఫ్ స్పిన్ బౌలర్.
- T. నటరాజన్ - భారత క్రికెట్ జట్టులో ఫాస్ట్ బౌలర్.
- వాషింగ్టన్ సుందర్ - భారత క్రికెట్ జట్టులో ఆల్ రౌండర్
- అభినవ్ ముకుంద్ - భారత క్రికెట్ జట్టులో మాజీ బ్యాట్స్‌మెన్.
- విజయ్ శంకర్ - భారత క్రికెట్ జట్టులో ఆల్ రౌండర్.
- వరుణ్ చక్రవర్తి - భారత క్రికెట్ జట్టులో స్పిన్ బౌలర్.
ప్రీమియర్ లీగ్
[మార్చు]TNCA తన ప్రాంతీయ ట్వంటీ20 లీగ్ తమిళనాడు ప్రీమియర్ లీగ్‌ని 2016 ఆగస్టులో ప్రారంభించింది.[5] తొలి ఏట ఎనిమిది జట్లు ఉన్నాయి. మొత్తం 31 మ్యాచ్‌లు (28 లీగ్ మ్యాచ్‌లు, రెండు సెమీ-ఫైనల్, ఫైనల్) ఆడాయి. చెన్నై, దిండిగల్ (నాథమ్), తిరునెల్వేలి వేదికలుగా ఉన్నాయి. 2020లో కోయంబత్తూర్, సేలంలలో రెండు కొత్త వేదికలను చేర్చారు.[6] తొలి ఏటి పోటీల్లో, ఆల్బర్ట్ టుటీ పేట్రియాట్స్ చెపాక్ సూపర్ గిల్లీస్‌పై 122 పరుగుల తేడాతో విజయం సాధించింది. [7]
ఇవి కూడా చూడండి
[మార్చు]- MA చిదంబరం స్టేడియం
- తమిళనాడు క్రికెట్ జట్టు
మూలాలు
[మార్చు]- ↑ "Srinivasan unanimously re-elected TNCA president". Rediff (in ఇంగ్లీష్). Retrieved 2020-03-10.
- ↑ 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "TNCA - Tamil Nadu Cricket Association". www.tnca.cricket. Archived from the original on 2019-09-09. Retrieved 2020-03-10.
- ↑ 3.0 3.1 "MA Chidambaram Stadium | India | Cricket Grounds | ESPNcricinfo.com". Cricinfo. Retrieved 2020-02-23.
- ↑ "TNCA - Tamil Nadu Cricket Association". www.tnca.cricket. Archived from the original on 2020-02-21. Retrieved 2020-03-10.
- ↑ "TNPL - Tamil Nadu Premier League". www.tnca.cricket. Archived from the original on 2018-01-26. Retrieved 2020-03-10.
- ↑ "Coimbatore, Salem on TNPL map this season". The New Indian Express. Retrieved 2020-03-10.
- ↑ "Cricket scorecard - TUTI Patriots vs Chepauk Super Gillies, Final, Tamil Nadu Premier League, 2016". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2020-03-10.