Jump to content

టి నటరాజన్

వికీపీడియా నుండి
టి నటరాజన్
2019–20 విజయ్ హజారే ట్రోఫీలో ఆడిన నటరాజన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
తంగరసు నటరాజన్
పుట్టిన తేదీ (1991-05-27) 1991 మే 27 (వయసు: 35)
చిన్నప్పంపట్టి, సేలం జిల్లా, తమిళనాడు[1]
బ్యాటింగుఎడమ చేతి బ్యాట్స్ మ్యాన్
బౌలింగుఎడమ చేతి మీడియం
పాత్రబౌలర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 300)2021 జనవరి 15 - ఆస్ట్రేలియా తో
తొలి వన్‌డే (క్యాప్ 232)2020 డిసెంబరు 2 - ఆస్ట్రేలియా తో
చివరి వన్‌డే2021 మార్చి 28 - ఇంగ్లాండ్ తో
తొలి T20I (క్యాప్ 83)2020 డిసెంబరు 4 - ఆస్ట్రేలియా తో
చివరి T20I2021 మార్చి 20 - ఇంగ్లాండ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2015 – ప్రస్తుతంతమిళనాడు క్రికెట్ జట్టు
2017కింగ్స్‌ XI‌ పంజాబ్
2018 – ప్రస్తుతంసన్‌రైజర్స్ హైదరాబాద్
కెరీర్ గణాంకాలు
పోటీ వన్‌డేలు టీ20ఐ లి.ఎ T20s
మ్యాచ్‌లు 2 4 17 42
చేసిన పరుగులు 1 7 5
బ్యాటింగు సగటు 5.00
100లు/50లు 0/0 0/0 0/0 0/0
అత్యుత్తమ స్కోరు 0* 7* 3*
వేసిన బంతులు 120 96 807 876
వికెట్లు 3 7 19 42
బౌలింగు సగటు 47.66 17.42 33.47 26.21
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 2/70 3/30 3/22 3/4
క్యాచ్‌లు/స్టంపింగులు 0/0 0/0 2/0 13/0
మూలం: Cricinfo, 28 మార్చి 2021

టి నటరాజన్ భారత క్రికెట్ జట్టు క్రికెటర్. ఆయన 2020లో తొలిసారి భారత జట్టు తరపున ఆడాడు. నటరాజన్ తమిళనాడు క్రికెట్ జట్టు, ఐ.పి.ఎల్ లో కింగ్స్‌ XI‌ పంజాబ్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడాడు.[2] ఆయన 2020-2021లో ఆస్ట్రేలియా పర్యటనలో అరంగేట్ర సిరీస్‌లోనే భారత తరపున అన్ని ఫార్మాట్లలో ఆడిన తొలి భారతీయ క్రికెటర్ గా రికార్డు సృష్టించాడు.[3]

జననం

[మార్చు]

నటరాజన్ 1991, మే 27న తమిళనాడులోని సేలం జిల్లా, చిన్నప్పంపట్టి గ్రామంలోజన్మించాడు.[4] నటరాజన్ తండ్రి పేరు తంగరసు, తల్లి శాంత. తండ్రి పవర్‌లూమ్‌లో పనిచేసే నేత కార్మికుడు, అతని తల్లి ఫాస్ట్ ఫుడ్ స్టాల్ నడుపుతోంది. ఐదుగురు పిల్లలలో నటరాజన్ పెద్దవాడు.[5][6] 2020, నవంబరులో నటరాజన్ భార్య ఒక ఆడ శిశువుకు జన్మనిచ్చింది.[7][8]

క్రీడా జీవితం

[మార్చు]

నటరాజన్ 2014–15లో తొలిసారిగా తమిళనాడు జట్టు తరపున రంజీ ట్రోఫీ లో ఆడాడు.[9] 2016–17లో అంతర్ రాష్ట్ర టోర్నమెంట్ లో టీ-20 పోటీలలో అరంగ్రేటం చేశాడు.[10] 2018–19 విజయ్ హజారే ట్రోఫీ తమిళనాడు తరఫున లిస్ట్ ఎ తరపున అరంగేట్రం చేశాడు. [11]

నటరాజన్ 2020 డిసెంబరు 2న భారత్ తరఫున ఆస్ట్రేలియాతో తన వన్డే అరంగేట్రం చేశాడు [12] ఆ మ్యాచ్ లో మార్నస్ లాబుస్చాగ్నే అవుట్ చేసి, తన మొదటి అంతర్జాతీయ వికెట్ తీసుకొన్నాడు.[13] 2020, డిసెంబరు 4న ఆస్ట్రేలియాతో జరిగిన టి20లో అరంగేట్రం చేశాడు.[14] ముప్పై పరుగులకు మూడు వికెట్లు తీశాడు.[15] 2020, డిసెంబరు 30న ఆస్ట్రేలియాతో జరిగిన మూడో మ్యాచ్‌కు ముందు నటరాజన్‌ను భారత టెస్ట్ జట్టులో చేర్చారు.[16] 2021, జనవరి 15 న ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ లో అరంగేట్రం చేశాడు. మాథ్యూ వాడేను ఔట్ చేసి, తన మొదటి అంతర్జాతీయ టెస్ట్ వికెట్ సాధించాడు.[17] [18]

మూలాలు

[మార్చు]
  1. "From Salem and TNPL, IPL exploits to India cap - The inspirational journey of T Natarajan | Latest News & Updates at DNAIndia.com". DNA India. Retrieved 2 ఏప్రిల్ 2021.
  2. "List of players sold and unsold at IPL auction 2017". ESPN Cricinfo. Retrieved 2 ఏప్రిల్ 2021.
  3. "Natarajan becomes first Indian to make international debut in 3 formats on same tour". The Hindu. PTI. 15 జనవరి 2021. ISSN 0971-751X. Retrieved 2 ఏప్రిల్ 2021.{{cite news}}: CS1 maint: others (link)
  4. Dinakar, S. (2 డిసెంబరు 2020). "Natarajan's rise — a triumph of the spirit". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2 ఏప్రిల్ 2021.
  5. Choudhary, Vidhi (25 జూలై 2017). "Thangarasu Natarajan's rocky road to the IPL". mint. Retrieved 2 ఏప్రిల్ 2021.
  6. Kaveri, Megha (5 డిసెంబరు 2020). "How T Natarajan overcame poverty and suspect bowling action rise fame". thenewsminute. Retrieved 2 ఏప్రిల్ 2021.
  7. Bindiya, Shefali (8 నవంబరు 2020). "SRH's yorker specialist Natarajan blessed with newborn on the eve of clash against DC. Team showers blessings". insidesport. Archived from the original on 2021-09-27. Retrieved 2 ఏప్రిల్ 2021.
  8. Sakshi (14 అక్టోబరు 2020). "యార్కర్‌ కింగ్‌." Sakshi. Archived from the original on 13 జూలై 2021. Retrieved 13 జూలై 2021.
  9. "Ranji Trophy, Group A: Bengal v Tamil Nadu at Kolkata, Jan 5-8, 2015". ESPN Cricinfo. Retrieved 2 ఏప్రిల్ 2021.
  10. "Inter State Twenty-20 Tournament, South Zone: Karnataka v Tamil Nadu at Chennai, Jan 29, 2017". ESPN Cricinfo. Retrieved 2 ఏప్రిల్ 2021.
  11. "Elite, Group C, Vijay Hazare Trophy at Chennai, Sep 20 2018". ESPN Cricinfo. Retrieved 2 ఏప్రిల్ 2021.
  12. "3rd ODI (D/N), Canberra, Dec 2 2020, India tour of Australia". ESPN Cricinfo. Retrieved 2 ఏప్రిల్ 2021.
  13. World, Republic. "T Natarajan trumps Marnus Labuschagne for maiden wicket in Indian colours; watch video". Republic World. Retrieved 2 ఏప్రిల్ 2021.
  14. "1st T20I (N), Canberra, Dec 4 2020, India tour of Australia". ESPN Cricinfo. Retrieved 2 ఏప్రిల్ 2021.
  15. "T Natarajan shines on T20I debut to hand India victory". International Cricket Council. Retrieved 2 ఏప్రిల్ 2021.
  16. "T Natarajan to make Test debut, KL Rahul to return; India pondering multiple changes in SCG". Times Now. Retrieved 2 ఏప్రిల్ 2021.
  17. "Brisbane Test: T Natarajan, Washington Sundar make Test debuts as injury-hit India make 4 changes". ఇండియా Today. Retrieved 2 ఏప్రిల్ 2021.
  18. T Natarajan maiden Test wicket (15 జనవరి 2021). "AUS vs IND 4th Test Day 1: T Natarajan removes Matthew Wade for maiden Test wicket | Cricket News – India TV". www.indiatvnews.com. Retrieved 2 ఏప్రిల్ 2021.{{cite web}}: CS1 maint: url-status (link)