జగన్ మోహన్ రావు అరిశనపల్లి
స్వరూపం
జగన్ మోహన్ రావు అరిశనపల్లి | |
---|---|
జననం | జనవరి 10 ,1973 రంగారెడ్డి జిల్లా దండుమైలారం తెలంగాణ, భారతదేశం |
నివాస ప్రాంతం | హైదరాబాద్, తెలంగాణ |
వృత్తి | విద్యావేత్త, వ్యాపారవేత్త |
ప్రసిద్ధి | హైదరాబాదు క్రికెట్ సంఘం అధ్యక్షుడు |
పిల్లలు | కుమార్తె, కొడుకు |
వెబ్‌సైటు | |
jaganmohanrao.in |
జగన్ మోహన్ రావు అరిశనపల్లి ఒక ప్రముఖ విద్యావేత్త, వ్యాపారవేత్త, క్రీడా వేత్త. ఇతను ఇండ్ వెల్ గ్రూప్ [1] సంస్థలను స్థాపించారు, అలాగే అక్షర ఇంటర్నేషనల్ స్కూల్స్[2] చైర్మన్ గా ఉన్నారు. క్రీడా రంగంలో, మీడియా రంగంలో, వాయురంగంలో [3] వీరు వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. విద్యారంగంలో, క్రీడా రంగ అభివృద్ధికి కృషి చేస్తున్నారు.[4]
జీవితం
[మార్చు]జగన్ మోహన్ రావు అరిశనపల్లి జన్మస్థలం దండుమైలారం, రంగారెడ్డి జిల్లా. వీరు నారాయణ రావు, లక్ష్మి దంపతులకు 1973 జనవరి 10 న జన్మించారు.
వ్యక్తిగత వివరాలు
[మార్చు]పేరు: జగన్ మోహన్ రావు అరిశనపల్లి చదువు: ఎంబీఏ జననం: 1973 జనవరి 10 పుట్టిన ఉరు: దండుమైలారం, రంగారెడ్డి జిల్లా భార్య: సరిత అరిశనపల్లి పిల్లలు: కుమార్తె, కొడుకు నివాసం: హైదరాబాద్, తెలంగాణ వృత్తి: విద్యావేత్త, వ్యాపారవేత్త
హైదరాబాదు క్రికెట్ సంఘం అధ్యక్షునిగా ఎన్నిక
[మార్చు]2023 అక్టోబరు 20 న జరిగిన హైదరాబాదు క్రికెట్ సంఘం ఎన్నికల్లో జగన్ మోహన్ రావు అరిశనపల్లి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. 2023 అక్టోబరు 25 న హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రింద మైదానం ప్రాంగణంలోని హైదరాబాదు క్రికెట్ సంఘం కార్యాలయంలో వీరు అధ్యక్షునిగా ప్రమాణస్వీకారం చేసారు
ప్రస్థానం
[మార్చు]జగన్ మోహన్ రావు అరిశనపల్లి 2010 సంవత్సరంలో అక్షర ఇంటర్నేషనల్ స్కూల్స్ స్థాపించారు. తెలంగాణ రాష్ట్రంలో 8 స్కూల్స్ ద్వారా నాణ్యతమైన విద్యాబోధన ఈ సంస్థ చేస్తున్నది.
ఆసరా ఫౌండేషన్ ద్వారా జగన్ మోహన్ రావు అరిశనపల్లి అనేక సేవ కార్యక్రమాలను చేసారు. దండుమైలారం గ్రామంలో ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలను ఈ ఫౌండేషన్ ద్వారా అభివృద్ధి చేసారు.
2001 సంవత్సరంలో ఏస్ మీడియా సంస్థను స్థాపించారు. ఈ సంస్థ తెలంగాణ ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలను, తెలంగాణ శాసనసభ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.
ఇండ్ వెల్ గ్రూప్ [1] అనే సంస్థకు ఫౌండర్, చైర్మన్ గా ఉన్నారు. ఈ సంస్థ అనేక రంగాలలో తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నది. వాయరంగంలో, లాజిస్టిక్స్ రంగంలో, హాస్పిటాలిటీ రంగంలో, సమాచార, సాంకేతిక రంగంలో సేవలు అందిస్తున్నది .
మూలాలు
[మార్చు][1] [5] [6] [7] [8] [9] [10] [11] [12] [13]
- ↑ 1.0 1.1 1.2 https://www.thenewsminute.com/article/now-take-aerial-tour-hyderabad-telangana-organises-helicopter-joyride-61724
- ↑ https://www.akshara.edu.in/
- ↑ https://www.thehindu.com/life-and-style/travel/i-am-on-the-top-of-the-world/article18419572.ece
- ↑ jaganmohanrao.in
- ↑ https://www.newindianexpress.com/states/telangana/2023/oct/21/jagan-mohan-rao-elected-hyderabad-cricket-association-president-2625928.html
- ↑ https://telanganatoday.com/jagan-mohan-rao-elected-as-hca-president
- ↑ https://twitter.com/ANI/status/1717171213133639777
- ↑ https://en.bharatpedia.org/wiki/Handball_Federation_of_India
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2023-09-02. Retrieved 2023-09-02.
- ↑ https://telanganatoday.com/tag/arishnapally-jagan-mohan-rao
- ↑ https://www.ntnews.com/sports/telugu-man-and-handball-federation-of-india-president-jagan-mohan-rao-in-indian-olympic-association-election-race-200932
- ↑ https://sportstar.thehindu.com/other-sports/hfi-a-jagan-mohan-rao-elected-handball-federation-of-india-presidet/article32997496.ece
- ↑ https://www.manatelangana.news/jagan-mohan-rao-puts-an-end-to-crisis-in-national-handball-association/