Jump to content

హైదరాబాదు క్రికెట్ జట్టు

వికీపీడియా నుండి
(హైదరాబాదు క్రికెట్ టీం నుండి దారిమార్పు చెందింది)
హైదరాబాదు క్రికెట్ టీం
వ్యక్తిగత సమాచారం
కెప్టెన్తన్మయ్ అగర్వాల్
కోచ్జె. అరుణ్ కుమార్
యజమానిహైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్
జట్టు సమాచారం
స్థాపితం1934
స్వంత మైదానంరాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం
సామర్థ్యం55,000
చరిత్ర
రంజీ ట్రోఫీ విజయాలు2 (1937/38,1986/87)
ఇరానీ ట్రోఫీ విజయాలు1 (1986/87)
విజయ్ హరారే ట్రోఫీ విజయాలు0
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ విజయాలు0
అధికార వెబ్ సైట్హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్
2021–22 హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సీజన్

హైదరాబాదు క్రికెట్ టీం అనేది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ద్వారా నిర్వహించబడుతున్న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలో ఉన్న దేశీయ క్రికెట్ టీం. రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్‌లో భాగంగా ఉన్న ఈ టీం, రంజీ ట్రోఫీలో అనేక సంవత్సరాలుగా విజయాలను సాధిస్తున్నది. రంజీ ట్రోఫీలో రెండుసార్లు గెలిచి, మూడుసార్లు రన్నరప్‌గా నిలిచింది. ఇరానీ ట్రోఫీలో కూడా ఒకసారి ఆడింది.

పోటీ చరిత్ర

[మార్చు]
1937–38 రంజీ ట్రోఫీ గెలిచిన హైదరాబాద్ క్రికెట్ టీం సభ్యులు

1937/38 టోర్నమెంట్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ నవనగర్‌ను ఒక వికెట్‌తో ఓడించి రంజీ ట్రోఫీని గెలుచుకున్న హైదరాబాద్ జట్టు టోర్నమెంట్‌ను గెలుచుకున్న మూడవ జట్టుగా నిలిచింది. ఆ తరువాత 1943 వరకు ఫైనల్‌కు రాలేదు. 1943లో బరోడా టీంతో జరిగిన మ్యచ్ లో పరాజయం పొందింది. 1965లో ముంబై క్రికెట్ టీంతో ఓడిపోయింది. 1987లో ఢిల్లీని మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ఓడించింది. 2000 ఫైనల్‌లో మరోసారి ముంబై చేతిలో ఓడిపోయింది.

1987లో ఇరానీ ట్రోఫీలో రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టుతో తలపడింది. మ్యాచ్ డ్రా కావడంతో హైదరాబాదు 27 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో విజయం సాధించింది. ఇది రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టు తరపున స్లో ఓవర్ రేట్ కోసం 16-పెనాల్టీ పరుగులు లభించిన తర్వాత జరిగింది. స్కోర్‌కార్డ్ చూడండి

విజయాలు

[మార్చు]
  • ఇరానీ కప్
    • విజేతలు: 1987–88
  • సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ
    • రన్నర్స్-అప్ (1): 2009–10

2013-14 సీజన్ ముగిసే వరకు అన్ని ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లలో, హైదరాబాద్ 389 సార్లు ఆడగా, ఇందులో 135 విజయాలు, 74 ఓటములు, 180 డ్రాలు ఉన్నాయి.[1]

ప్రసిద్ధ క్రీడాకారులు

[మార్చు]

టెస్ట్ అరంగేట్రం చేసిన సంవత్సరంతోపాటు భారతదేశం తరపున టెస్ట్ క్రికెట్ ఆడిన తెలంగాణ ఆటగాళ్ళు:

అంతర్జాతీయ వన్డేలలో అరంగేట్రం చేసిన సంవత్సరంతోపాటుగా, భారతదేశం తరపున వన్డే మ్యాచ్‌లు ఆడి, టెస్ట్ క్రికెట్ ఆడని తెలంగాణ ఆటగాళ్ళు:

ప్రస్తుత ఆటగాళ్ళు

[మార్చు]

అంతర్జాతీయ క్యాప్‌లు ఉన్న ఆటగాళ్లు బోల్డ్‌ అక్షరాలతో జాబితా చేయబడ్డారు.

పేరు పుట్టిన తేదీ బ్యాటింగ్ శైలి బౌలింగ్ శైలి గమనికలు
బ్యాట్స్‌మెన్
తన్మయ్ అగర్వాల్ (1995-05-03) 1995 మే 3 (వయసు 29) ఎడమచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్ కెప్టెన్
తిలక్ వర్మ (2002-11-08) 2002 నవంబరు 8 (వయసు 22) ఎడమచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్ ఐపిఎల్ లో ముంబై ఇండియన్స్ కోసం
రాహుల్ బుద్ధి (1997-09-20) 1997 సెప్టెంబరు 20 (వయసు 27) ఎడమచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్ ఐపిఎల్ లో ముంబై ఇండియన్స్ కోసం
హిమాలయ్ అగర్వాల్ (1993-10-09) 1993 అక్టోబరు 9 (వయసు 31) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం-ఫాస్ట్
అక్షత్ రెడ్డి (1991-02-11) 1991 ఫిబ్రవరి 11 (వయసు 33) కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్
చందన్ సహాని (1998-01-29) 1998 జనవరి 29 (వయసు 26) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం-ఫాస్ట్
రోహిత్ రాయుడు (1994-07-29) 1994 జూలై 29 (వయసు 30) ఎడమచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్
అభిరత్ రెడ్డి (1996-09-29) 1996 సెప్టెంబరు 29 (వయసు 28) కుడిచేతి వాటం
బవనక సందీప్ (1992-04-25) 1992 ఏప్రిల్ 25 (వయసు 32) ఎడమచేతి వాటం
ఆల్ రౌండర్లు
మిక్కిల్ జైస్వాల్ (1998-05-10) 1998 మే 10 (వయసు 26) కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్
హనుమ విహారి (1993-10-13) 1993 అక్టోబరు 13 (వయసు 31) కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్
వికెట్ కీపర్లు
ప్రతీక్ రెడ్డి (2000-11-28) 2000 నవంబరు 28 (వయసు 24) కుడిచేతి వాటం
కొల్లా సుమంత్ (1992-04-24) 1992 ఏప్రిల్ 24 (వయసు 32) కుడిచేతి వాటం
ప్రగ్నయ్ రెడ్డి (1999-12-18) 1999 డిసెంబరు 18 (వయసు 24) కుడిచేతి వాటం
స్పిన్ బౌలర్లు
తనయ్ త్యాగరాజన్ (1995-11-15) 1995 నవంబరు 15 (వయసు 29) ఎడమచేతి వాటం
త్రిశాంక్ గుప్తా (2001-09-24) 2001 సెప్టెంబరు 24 (వయసు 23) కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్
మెహదీ హసన్ (1990-02-03) 1990 ఫిబ్రవరి 3 (వయసు 34) ఎడమచేతి వాటం
పేస్ బౌలర్లు
రవితేజ (1994-10-19) 1994 అక్టోబరు 19 (వయసు 30) ఎడమచేతి వాటం కుడిచేతి మీడియం-ఫాస్ట్
చామ మిలింద్ (1994-09-04) 1994 సెప్టెంబరు 4 (వయసు 30) ఎడమచేతి వాటం ఎడమచేతి మీడియం-ఫాస్ట్ ఐపిఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోసం
రక్షన్ రెడ్డి (2000-09-29) 2000 సెప్టెంబరు 29 (వయసు 24) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం-ఫాస్ట్
బి పున్నయ్య (2003-05-12) 2003 మే 12 (వయసు 21) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం-ఫాస్ట్
కార్తికేయ కాక్ (1996-10-04) 1996 అక్టోబరు 4 (వయసు 28) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం-ఫాస్ట్
మహ్మద్ సిరాజ్ (1994-03-13) 1994 మార్చి 13 (వయసు 30) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం-ఫాస్ట్ ఐపిఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోసం

కోచింగ్ సిబ్బంది

[మార్చు]
  • ప్రధాన కోచ్: జె. అరుణ్‌కుమార్[2]
  • అసిస్టెంట్ కోచ్: నరేందర్ పాల్ సింగ్
  • ఫిజియో: భీష్మ్ ప్రతాప్ సింగ్
  • ట్రైనర్: ఎ. నవీన్ రెడ్డి
  • వీడియో విశ్లేషకుడు: సంతోష్ బిఎం
  • కన్సల్టెంట్: వివిఎస్ లక్ష్మణ్, వెంకటపతి రాజు

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Hyderabad playing record
  2. "Hyderabad cricket Association -HYDERABAD TEAM FOR RANJI TROPHY". Archived from the original on 2022-03-31. Retrieved 2022-08-20.