Jump to content

తిలక్ వర్మ

వికీపీడియా నుండి
తిలక్‌ వర్మ
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
నంబూరి ఠాకూర్‌ తిలక్‌ వర్మ
పుట్టిన తేదీ (2002-11-08) 2002 నవంబరు 8 (వయసు: 23)
హైదరాబాద్, భారతదేశం
బ్యాటింగుఎడమ చేతి
బౌలింగురైట్ - ఆర్మ్ ఆఫ్ బ్రేక్
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2018 - ప్రస్తుతంహైదరాబాద్[1] [2]
కెరీర్ గణాంకాలు
పోటీ ఫస్ట్ లిస్ట్ ఏ టీ20
మ్యాచ్‌లు 1 6 3
చేసిన పరుగులు 39 213 50
బ్యాటింగు సగటు 19.50 35.50 25.00
100s/50s 0/0 0/2 0/0
అత్యధిక స్కోరు 34 83 40 నాటౌట్
వేసిన బంతులు 30
వికెట్లు 1
బౌలింగు సగటు 37.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 1/19
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 4/– 1/–
మూలం: Cricinfo, 6 మే 2020

నంబూరి ఠాకూర్‌ తిలక్‌ వర్మ భారతదేశానికి చెందిన క్రికెట్ క్రీడాకారుడు. ఆయన 2020లో అండర్‌-19 ప్రపంచ కప్ లో భారత్ తరపున ప్రాతినిధ్యం వహించాడు.[3][4]

జననం

[మార్చు]

నంబూరి ఠాకూర్‌ తిలక్‌ వర్మ 2002 నవంబరు 8న హైదరాబాద్‌లో నంబూరి నాగరాజు, గాయత్రీదేవి దంపతులకు జన్మించాడు.[5][6]

క్రీడా జీవితం

[మార్చు]

తిలక్‌ వర్మ చందాన‌గ‌ర్ పీజేఆర్ స్టేడియంలో కోచ్ స‌లాం శిక్ష‌ణ‌లో తీసుకున్నాడు. ఆయన ప్రస్తుతం లింగంప‌ల్లిలోని లేగ‌ల క్రికెట్ అకాడ‌మీలో శిక్ష‌ణ పొందుతున్నాడు.[7] తిలక్‌ వర్మ 2018-19 రంజీ ట్రోఫీలో హైద‌రాబాద్ త‌ర‌పున ఫ‌స్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు. ఆయన అండర్‌-19 ప్రపంచకప్‌ 2020లో రన్నరప్‌గా నిలిచిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. 2022 జనవరి 31 నాటికీ లిస్ట్-ఏ లో 16 మ్యాచ్‌లు ఆడి 784 పరుగులు చేశాడు.[8]

ఐపీఎల్‌

[మార్చు]

తిల‌క్ వ‌ర్మ ఐపీఎల్‌ -2022 మెగా వేలంలో 20 లక్షల బేస్ ప్రైజ్‌తో తిల‌క్ వ‌ర్మ వేలంలోకి రాగా మొద‌ట సన్ రైజర్స్ హైదరాబాద్ బిడ్ చేసింది. అనంత‌రం రాజస్తాన్ రాయల్స్ కూడా పోటీ ప‌డ‌టంతో తిల‌క్ వ‌ర్మ ధ‌ర 50 ల‌క్షలు దాటింది. ఇక్కడ హైద‌రాబాద్ త‌ప్పుకోగా, రాజ‌స్తాన్‌కు పోటీగా చెన్నై సూపర్ కింగ్స్ వేలం రేసులోకి వ‌చ్చింది. కాసేప‌టికి రాజ‌స్తాన్ త‌ప్పుకోగా, ముంబై ఇండియన్స్ రేసులోకి రావడంతో ముంబై, చెన్నై తీవ్రంగా పోటీ ప‌డ‌గా చివ‌ర‌కు కోటి 70 లక్షలకు ముంబై ఇండియన్స్ జట్టు కొనుగోలు చేసింది.[9][10]

మూలాలు

[మార్చు]
  1. "హైదరాబాద్‌ కెప్టెన్‌గా తిలక్‌ వర్మ". Eenadu. 9 October 2025. the original నుండి 9 October 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 October 2025.
  2. "తిలక్ వర్మ - జీవిత చరిత్ర, ప్రారంభ జీవితం, ఐపీఎల్, కెరీర్, విజయాలు". www.teluguvaaditv.com(Telugu Vaadi TV). 5 October 2025.
  3. Sakshi (2020-02-13). "అయినా... గెలుస్తామనుకున్నాం!". the original నుండి 2022-02-16 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2022-02-16.
  4. "తిలక్‌ కౌంటీ అరంగేట్రం అదుర్స్‌". Eenadu. 25 June 2025. the original నుండి 25 June 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 25 June 2025.
  5. Sakshi (2022-02-14). "తండ్రి ఫెయిలైన ఎలక్ట్రిషియన్‌.. తెలుగుతేజం తిలక్‌వర్మ కథేంటి". the original నుండి 2022-02-17 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2022-02-17.
  6. Andhra Jyothy (2023-07-07). "ఉద్వేగంతో అమ్మానాన్న ఏడ్చేశారు". the original నుండి 2023-07-07 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-07-07.
  7. V6 Velugu (2019-12-03). "జూనియర్ క్రికెట్ లో అదరగొడుతున్న హైదరాబాదీ" (in ఇంగ్లీష్). the original నుండి 2022-02-17 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2022-02-17.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  8. HMTV (2022-02-14). "ఐపీఎల్ వేలంలో అదరగొట్టిన హైదరాబాద్ కుర్రాడు". the original నుండి 2022-02-17 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2022-02-17.
  9. Eenadu (2022-02-14). "అంత ధర ఊహించలేదు: హైదరాబాదీ తిలక్‌వర్మ". the original నుండి 2022-02-17 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2022-02-17.
  10. The Hindu (2022-02-13). "Mumbai Indians signs Tilak Varma" (in Indian English). the original నుండి 2022-02-17 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2022-02-17.