అంబటి రాయుడు
![]() | ||||
అంబటి రాయుడు | ||||
వ్యక్తిగత సమాచారం | ||||
---|---|---|---|---|
పూర్తి పేరు | అంబటి తిరుపతి రాయుడు | |||
జననం | గుంటూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా | 1985 సెప్టెంబరు 23|||
ఇతర పేర్లు | అంబ | |||
ఎత్తు | [convert: needs a number] | |||
బ్యాటింగ్ శైలి | కుడి చేతి బ్యాట్స్ మన్ | |||
బౌలింగ్ శైలి | రైట్ ఆర్మ్ , ఆఫ్ స్పిన్ | |||
పాత్ర | బ్యాట్స్ మన్ | |||
దేశవాళీ జట్టు సమాచారం | ||||
సంవత్సరాలు | జట్టు | |||
2001/02–2009/10 | హైదరాబాద్ | |||
2005/06 | ఆంధ్రా క్రికెట్ టీమ్ | |||
2010/11–present | బరోడా క్రికెట్ టీమ్ | |||
2007/08 | హైదరాబాద్ హార్సెస్ | |||
2010-2017 | ముంబై ఇండియన్స్ | |||
2017-2019 | సన్ రైజర్స్ హైదరాబాద్ | |||
2018-Present | చెన్నై సూపర్ కింగ్స్ | |||
కెరీర్ గణాంకాలు | ||||
పోటీ | FC | List A | T20 | |
మ్యాచులు | 63 | 45 | 50 | |
సాధించిన పరుగులు | 3754 | 1335 | 1128 | |
బ్యాటింగ్ సగటు | 42.17 | 32.56 | 24.52 | |
100 పరుగులు/50 పరుగులు | 9/19 | 1/11 | 0/8 | |
ఉత్తమ స్కోరు | 210 | 117 | 75* | |
వేసిన బాల్స్ | 660 | 216 | – | |
వికెట్లు | 9 | 8 | – | |
బౌలింగ్ సగటు | 47.88 | 25.25 | – | |
ఇన్నింగ్స్ లో వికెట్లు | 0 | 0 | – | |
మ్యాచులో 10 వికెట్లు | 0 | n/a | n/a | |
ఉత్తమ బౌలింగు | 4/43 | 4/45 | – | |
క్యాచులు/స్టంపింగులు | 48/– | 19/– | 26/3 | |
Source: Cricinfo, 10 October 2011 |
1985, సెప్టెంబర్ 23న ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరులో సాంబశివరావు, విజయలక్ష్మి దంపతులకు జన్మించిన అంబటి రాయుడు (Ambati Thirupathi Rayudu) క్రికెట్ క్రీడాకారుడు. 2001-02లో రంజీ ట్రోఫిలో హైదరాబాదు తరఫున ప్రాతినిధ్యం వహించాడు. 2002-03 సీజన్‌లో రాయుడు ఆంధ్రప్రదేశ్ జట్టుపై ఒకే మ్యాచ్‌లో డబుల్ సెంచరీ, సెంచరీ పూర్తిచేశాడు. 2005-06 సీజన్‌లో ఒకసారి ఆంధ్రప్రదేశ్ జట్టు తరఫున కూడా ఆడినాడు.
రాయుడు 2002లో అండర్-19 భారత క్రికెట్ జట్టు తరఫున ఇంగ్లాండు పర్యటించి అక్కడ మూడవ వన్డేలో 177 పరుగులు సాధించి 305 పరుగుల పక్ష్యఛేధనలో భారత జట్టు విజయానికి దోహదపడ్డాడు. అంతకు క్రితం మ్యాచ్‌లో 80 పరుగులు సాధించి అందులోనూ భారత జట్టు లక్ష్యసాధనకు తోడ్పడ్డాడు. 2003-04 లో జరిగిన అండర్-19 ప్రపంచ కప్ పోటీలో రాయుడు భారత జట్టుకు నేతృత్వం వహించాడు. 2015 ఫిబ్రవరి 14 నుండి ప్రారంభమయ్యే ప్రపంచ కప్ క్రికెట్ పోటీలకు ఎంపికైన భారతజట్టులో స్థానం సంపాదించుకున్నాడు.[1][2]ఆయన ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో 2010 నుండి చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్నాడు. [3]
జననం[మార్చు]
అంబటి రాయుడు 1985, సెప్టెంబర్ 23న ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరులో సాంబశివరావు, విజయలక్ష్మి దంపతులకు జన్మించాడు.అయన తన విద్యాభాసాన్ని హైదరాబాద్ సైనిక్ పూరి లోని శ్రీ రామకృష్ణ విద్యాలయంలో పూర్తి చేశాడు. రాయుడు తన స్నేహితురాలు చెన్నుపల్లి విద్యను 2009 ఫిబ్రవరి 14 న వివాహం ఆడాడు.[4]
మూలాలు[మార్చు]
- ↑ ఎడిటర్ (2015-01-07). "ప్రపంచకప్పుకు అంబటిరాయుడు ఎంపిక". సాక్షి. Archived from the original on 13 సెప్టెంబరు 2015. Retrieved 7 January 2015.
- ↑ ఈనాడు, తాజావార్తలు (23 September 2019). "అంబటి రాయుడా.. నీవెక్కడ? - EENADU". www.eenadu.net (in ఇంగ్లీష్). Archived from the original on 23 సెప్టెంబరు 2019. Retrieved 23 September 2019.
- ↑ Namasthe Telangana (1 May 2021). "IPL 2021: రాయుడు 27 బంతుల్లో 72..చెన్నై స్కోర్ 218". Archived from the original on 1 మే 2021. Retrieved 1 May 2021.
- ↑ .thenationalbiography.in (21 April 2019). "The National Biography". www.thenationalbiography.in. Archived from the original on 30 ఆగస్టు 2019. Retrieved 30 August 2019.