సయ్యద్ అబిద్ అలీ
![]() | ||||
వ్యక్తిగత సమాచారం | ||||
---|---|---|---|---|
జననం | హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం | 1941 సెప్టెంబరు 9|||
బ్యాటింగ్ శైలి | కుడిచేతి | |||
బౌలింగ్ శైలి | కుడిచేతి మీడియం ఫాస్ట్ | |||
పాత్ర | ఆల్ రౌండర్ | |||
అంతర్జాతీయ సమాచారం | ||||
జాతీయ జట్టు | భారతదేశం | |||
టెస్టు అరంగ్రేటం(cap 116) | 23 డిసెంబరు 1967 v ఆస్ట్రేలియా | |||
చివరి టెస్టు | 15 డిసెంబరు 1974 v వెస్టిండీస్ | |||
వన్డే లలో ప్రవేశం(cap 1) | 13 జూలై 1974 v ఇంగ్లాండ్ | |||
చివరి వన్డే | 14 జూన్ 1975 v న్యూజీలాండ్ | |||
దేశవాళీ జట్టు సమాచారం | ||||
సంవత్సరాలు | జట్టు | |||
1959/60–1978/79 | హైదరాబాదు క్రికెట్ జట్టు | |||
కెరీర్ గణాంకాలు | ||||
పోటీ | టెస్ట్ క్రికెట్ | అంతర్జాతీయ వన్డే | ఫస్ట్ క్లాస్ క్రికెట్ | లిస్ట్ ఏ |
మ్యాచ్‌లు | 29 | 5 | 212 | 12 |
సాధించిన పరుగులు | 1,018 | 93 | 8,732 | 169 |
బ్యాటింగ్ సగటు | 20.36 | 31.00 | 29.30 | 28.16 |
100s/50s | 0/6 | 0/1 | 13/41 | 0/1 |
ఉత్తమ స్కోరు | 81 | 70 | 173 * | 70 |
బాల్స్ వేసినవి | 4,164 | 336 | 25,749 | 783 |
వికెట్లు | 47 | 7 | 397 | 19 |
బౌలింగ్ సగటు | 42.12 | 26.71 | 28.55 | 19.31 |
ఇన్నింగ్స్ లో 5 వికెట్లు | 1 | 0 | 14 | 0 |
మ్యాచ్ లో 10 వికెట్లు | 0 | 0 | 0 | 0 |
ఉత్తమ బౌలింగ్ | 6/55 | 2/22 | 6/23 | 3/20 |
క్యాచులు/స్టంపింగులు | 32/– | 0/– | 190/5 | 5/– |
Source: క్రిక్ ఆర్కైవ్, 30 సెప్టెంబరు 2008 |
సయ్యద్ అబిద్ అలీ (జననం 9 సెప్టెంబరు 1941) తెలంగాణకు చెందిన మాజీ ఆల్ రౌండర్ భారత క్రికెటర్. క్రికెట్ లో లోయర్ ఆర్డర్ బ్యాట్స్ మాన్, మీడియం పేస్ బౌలర్ గా రాణించాడు.
తొలి జీవితం[మార్చు]
అబిద్ 1941, సెప్టెంబరు 9న తెలంగాణలోని హైదరాబాదులో జన్మించాడు. హైదరాబాదులోని సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్, ఆల్ సెయింట్స్ హైస్కూల్ లో విద్యను అభ్యసించాడు.[1] 1956లో హైదరాబాదు పాఠశాలల తరపున క్రికెట్ అడడానికి ఎంపికయ్యాడు. ఫీల్డింగ్‌తో ఆకట్టుకోవడమేకాకుండా కేరళ జట్టుపై 82 పరుగులు చేశాడు, ఉత్తమ ఫీల్డర్ బహుమతిని కూడా అందుకున్నాడు. కొన్ని సంవత్సరాల తరువాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాదు క్రికెట్ జట్టును ఏర్పాటు చేసినప్పుడు, అతనికి అక్కడ ఉద్యోగం వచ్చింది. బౌలర్ కావడానికి ముందు వికెట్ కీపర్‌గా తన కెరీర్ ను ప్రారంభించాడు.
క్రీడారంగం[మార్చు]
1958–59లో హైదరాబాదు జూనియర్ జట్టు తరపున ఆడిన అబిద్, మరుసటి సంవత్సరంలో రాష్ట్ర రంజీ ట్రోఫీ జట్టులో చేరాడు. మొదటి కొన్ని సంవత్సరాలలో అరుదుగా బౌలింగ్ చేశాడు, 1967 వరకు తన మొదటి రంజీ సెంచరీ చేయలేదు. ఆ సంవత్సరం ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ పర్యటనలకు వెళ్ళే జట్టుకు ఎంపికయ్యాడు.
ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో కెప్టెన్ ఎంఎకె పటౌడి స్థానంలో ఆడి, రెండు ఇన్నింగ్స్‌లలో 33 పరుగులు చేశాడు, 55 పరుగులకు 6 వికెట్లు తీశాడు.[2] మూడో టెస్టులో ఓపనింగ్ బ్యాటింగ్ కు వెళ్ళి 47 పరుగులు చేశాడు. ఆ తర్వాత తుది టెస్టులో 81, 78 పరుగులు చేశాడు.
1971లో జరిగిన పోర్ట్ ఆఫ్ స్పెయిన్ టెస్టులో వెస్టిండీస్‌పై సునీల్ గవాస్కర్ టీంను గెలిపించినపుడు, అబిద్ నాన్-స్ట్రైకర్ లో ఉన్నాడు. సిరీస్ చివరి టెస్టులో వెస్టిండీస్ గెలుస్తుందనుకున్న సమయంలో అబిద్ వరుస రెండు బంతుల్లో రోహన్ కన్హాయ్, గ్యారీ సోబర్స్ లను బౌల్డ్ చేశాడు. కొన్ని నెలల తరువాత, ఓవల్‌లో ఇంగ్లాండ్‌పై నాలుగు వికెట్ల తేడాతో గెలిచినప్పుడు అబిద్ విజేత బౌండరీని సాధించాడు.[3] అదే సిరీస్‌లోని మాంచెస్టర్ టెస్టులో మొదటి రోజు భోజనానికి ముందు 19 పరుగులకు మొదటి నాలుగు వికెట్లు తీశాడు.
మరో తొమ్మిది టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన అబిద్, 1975 ప్రపంచ కప్‌లో న్యూజిలాండ్‌పై 70 పరుగులు చేశాడు. మరో నాలుగు సంవత్సరాలపాటు ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు. రంజీ ట్రోఫీలో హైదరాబాదు క్రికెట్ జట్టు తరఫున అబిద్ అలీ 2000 పరుగులు చేసి వంద వికెట్లు తీశాడు. 1968-69లో అత్యధిక వ్యక్తిగత స్కోరు కేరళపై 173 నాటౌట్, 1974లో ఓవల్‌లో సర్రేపై ఉత్తమ బౌలింగ్ 23 పరుగులకు 6 వికెట్లు తీశాడు.
కోచింగ్ కెరీర్[మార్చు]
1980లో కాలిఫోర్నియాకు వెళ్ళడానికి ముందు అబిద్ కొన్ని సంవత్సరాలపాటు హైదరాబాదు జూనియర్ జట్టుకు శిక్షణ ఇచ్చాడు. 1990ల చివరలో మాల్దీవులకు, 2001-02లో రంజీ ట్రోఫీలో సౌత్ జోన్ లీగ్ గెలిచిన ఆంధ్ర జట్టుకు, 2002-2005 మధ్యకాలంలో యుఎఇకి శిక్షణ ఇచ్చాడు. అతను ప్రస్తుతం కాలిఫోర్నియాలో నివసిస్తున్న అబిద్, అక్కడ అతను స్టాన్ఫోర్డ్ క్రికెట్ అకాడమీలో యువకులకు శిక్షణ ఇస్తున్నాడు.[3]
వ్యక్తిగత జీవితం[మార్చు]
1990ల ప్రారంభంలో అబిద్ అలీకి హార్ట్ బైపాస్ సర్జరీ జరిగింది.[3] అతనికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు.
మూలాలు[మార్చు]
- ↑ Siddiqui, Ahmed Mohiuddin (December 13, 2015). "All Saints' High School — 160 Glorious Years of Academic Excellence!". The Moroccan Times. Archived from the original on 2019-08-31. Retrieved 2021-07-28.
- ↑ "1st Test: Australia v India at Adelaide, Dec 23-28, 1967". espncricinfo. Retrieved 2021-07-28.
- ↑ 3.0 3.1 3.2 V. V. Subrahmanyam, Abid needs help, Sportstar, 4 March 2006
- సుజిత్ ముఖర్జీ, సరిపోలిన విజేతలు, ఓరియంట్ లాంగ్మన్ (1996), పే 76-90
- క్రిస్టోఫర్ మార్టిన్-జెంకిన్స్, హూస్ హూ ఆఫ్ టెస్ట్ క్రికెటర్లు