మన్సూర్ అలీ ఖాన్ పటౌడి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మన్సూర్ అలీ ఖాన్ పటౌడి( Mansoor Ali Khan Pataudi) 1941, జనవరి 5న భోపాల్ లో జన్మించాడు. టైగర్ అనే ముద్దు పేరు కలిగిన ఇతడు భారత మాజీ టెస్ట్ క్రికెట్ క్రీడాకారుడు. సెప్టెంబరు 22, 2011న మరణించాడు.

టెస్ట్ క్రికెట్[మార్చు]

1961 నుంచి 1975 వరకు భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించి 46 టెస్టులు ఆడినాడు. 34.91 సగటుతో 2793 పరుగులు సాధించాడు. ఇందులో 6 సెంచరీలు మరియు 16 అర్థసెంచరీలు ఉన్నాయి. టెస్ట్ క్రికెట్‌లో అతని అత్యధిక స్కోరు 203 నాటౌట్.

టెస్ట్ కెప్టెన్‌[మార్చు]

1962లో 21 సంవత్సరాల వయస్సులోనే భారత క్రికెట్ జట్టుకు నాయకత్వం వహించాడు. 40 టెస్టులకు నేతృత్వం వహించి 9 మ్యాచ్‌లలో విజయం సాధించాడు. విదేశాలలో భారత్‌కు తొలి టెస్ట్ విజయం 1967లో న్యూజీలాండ్ పై ఇతని సారథ్యంలోనే లభించింది.

రాజకీయాలు[మార్చు]

1971లో పటౌడి గుర్గాన్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి విశాల్ హర్యానా పార్టీ తరఫున పోటీచేశాడు. [1]

అవార్డులు[మార్చు]

1964లో ఇతనికి అర్జున అవార్డు లభించింది.

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. http://www.hinduonnet.com/2001/10/14/stories/1314128g.htm