ఛాంపియన్స్ లీగ్ ట్వంటీ20
ఛాంపియన్స్ లీగ్ ట్వంటీ20 | |
---|---|
200px | |
Countries | 7 countries |
Administrator | BCCI, CA, CSA |
Format | ట్వంటీ20 |
First tournament | 2009 |
Tournament format | Round-robin, knockout |
Number of teams | 10 (group stage) 12 (total) |
Current champion | ![]() |
Most successful | 4 teams with 1 title each |
Most runs | ![]() |
Most wickets | ![]() |
Website | clt20.com |
![]() |
టి20 క్రికెట్‌లో ఐపీఎల్ తర్వాత ఎక్కువ మంది వీక్షిస్తున్న పోటీలు చాంపియన్స్ లీగ్. మనదేశం నుంచి ఎక్కువ జట్లు బరిలోకి దిగడంతో పాటు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలకు చెందిన పటిష్ఠమైన టీమ్‌లు పోటీపడుతుంటాయి. ఐపీఎల్ ప్రారంభమైన (2008) మరుసటి ఏడాది నుంచి సీఎల్‌టి20 జరుగుతోంది. ఐపీఎల్ స్థాయిలో విజయవంతం కాలేకపోయినా ప్రతీ ఏడాది ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సీఎల్‌టి20 కూడా ముందంజలో ఉంది.
2013[మార్చు]
రోహిత్ శర్మ నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ చాంపియన్స్ లీగ్-2013 విజేతగా నిలిచింది. రెండు ఐపీఎల్ జట్ల మధ్య అక్టొబరు 6, 2013 ఆదివారం జరిగిన తుది పోరులో ముంబై 33 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌పై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 202 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఏ ఒక్క బ్యాట్స్‌మెనో కాకుండా జట్టు స్కోరులో అంతా సమష్టిగా చేయి వేశారు.