రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలలో బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్న జట్టు. ఈ జట్టుకు విరాట్ కోహ్లి ప్రాతినిథ్యం వహిస్తుండగా డానియల్ వెటోరీ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.

ఈ జట్టు ఇప్పటి దాకా ఏ ఐపిఎల్ ఫైనల్ గెలుచుకోలేదు కానీ 2009, 2016 సంవత్సరాల మధ్యలో మూడు సార్లు రన్నరప్ గా నిలిచింది. చెప్పుకోదగిన ఆటగాళ్ళున్నా ఇప్పటిదాకా ఒక్కసారి కూడా కప్ గెలవకపోవడం వల్ల వీళ్ళని అండర్ అచీవర్స్ గా పరిగణించబడుతున్నారు.[1][2]

ఐ.పి.ఎల్ లో అత్యధిక (263/5), అత్యల్ప (49) పరుగులు సాధించిన రెండు రికార్డులు ఈ జట్టు పేరుమీదనే ఉండటం గమనార్హం.

చరిత్ర[మార్చు]

సెప్టెంబరు 2007 లో భారత క్రికెట్ బోర్డు నియంత్రణ మండలి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఏర్పాటును ప్రకటించింది. 2008 నుంచి మొత్తం ఎనిమిది జట్ల మధ్య 20-20 ఆటల పోటీలు జరుగుతాయని ప్రకటించింది.[3] ఈ ఎనిమిది జట్లు భారతదేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల నుంది ప్రాతినిథ్యం వహిస్తాయని పేర్కొంది. ఇందులో బెంగళూరు కూడా ఒకటి. ఈ జట్ల కోసం ఫిబ్రవరి 20, 2008 న వేలం నిర్వహించగా బెంగళూరు జట్టును విజయ్ మాల్యా 111.6 మిలియన్ డాలర్లు చెల్లించి కొనుగోలు చేశాడు. ఇది రెండో అతిపెద్ద మొత్తం కాగా మొదటిది ముంబై జట్టు కోసం రిలయన్స్ చెల్లించింది.

మూలాలు[మార్చు]

  1. Veerappa, Manuja (24 August 2019). "Sanjay Bangar may be named RCB batting coach". The Times of India. Retrieved 22 November 2019.
  2. Ananthanarayanan, N (28 May 2018). "IPL 2018: Royal Challengers Bangalore aim to shed underachievers tag". Hindustan Times. Retrieved 22 November 2019.
  3. "Franchises for board's new Twenty20 league". ESPNcricinfo. 13 September 2007. Retrieved 6 June 2013.

బయటి లింకులు[మార్చు]