మిచెల్ మార్ష్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మిచెల్ మార్ష్
2018 లో మార్ష్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
మిచెల్ రాస్ మార్ష్
పుట్టిన తేదీ (1991-10-20) 1991 అక్టోబరు 20 (వయసు 32)
అట్టడేల్, వెస్టరన్ ఆస్ట్రేలియా
మారుపేరుబైసన్
ఎత్తు1.93[1] మీ. (6 అ. 4 అం.)
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
పాత్రఆల్ రౌండరు
బంధువులుGeoff Marsh (father)
Shaun Marsh (brother)
Melissa Marsh (sister)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 438)2014 అక్టోబరు 22 - పాకిస్తాన్ తో
చివరి టెస్టు2023 జూలై 27 - ఇంగ్లాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 190)2011 అక్టోబరు 19 - దక్షిణాఫ్రికా తో
చివరి వన్‌డే2023 సెప్టెంబరు 7 March - దక్షిణాఫ్రికా తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.8
తొలి T20I (క్యాప్ 54)2011 అక్టోబరు 16 - దక్షిణాఫ్రికా తో
చివరి T20I2023 సెప్టెంబరు 3 - దక్షిణాఫ్రికా తో
T20Iల్లో చొక్కా సంఖ్య.8
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2008/09–presentవెస్టర్న్ ఆస్ట్రేలియా
2010డెక్కన్ చార్జర్స్
2011–2013పూణే వారియర్స్
2011/12–presentపెర్త్ స్కార్చర్స్
2020సన్ రైజర్స్ హైదరాబాద్
2022–2023ఢిల్లీ క్యాపిటల్స్
2023-presentSeattle Orcas
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు టి20 FC
మ్యాచ్‌లు 35 72 48 108
చేసిన పరుగులు 1,510 2,008 1,257 5,707
బ్యాటింగు సగటు 27.45 34.62 33.97 33.57
100లు/50లు 3/4 1/15 0/8 13/23
అత్యుత్తమ స్కోరు 181 102* 92* 211
వేసిన బంతులు 3,057 2,111 264 8,999
వికెట్లు 45 54 15 165
బౌలింగు సగటు 39.77 35.42 23.20 31.11
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 1 1 0 2
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 5/46 5/33 3/24 6/84
క్యాచ్‌లు/స్టంపింగులు 18/– 31/– 23/– 57/–
మూలం: ESPNcricinfo, 1 September 2023

మిచెల్ రాస్ మార్ష్ (జననం 1991 అక్టోబరు 20) ఆస్ట్రేలియన్ అంతర్జాతీయ క్రికెటరు. T20లలో ఆస్ట్రేలియా జాతీయ క్రికెట్ జట్టుకు ప్రస్తుత కెప్టెన్. మార్ష్ 2011-12 సీజన్‌లో రంగప్రవేశం చేసాడు. క్రికెట్ మూడు రూపాల్లోనూ ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహిస్తాడు. 2015 క్రికెట్ ప్రపంచ కప్, 2021 T20 ప్రపంచ కప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టులో మార్ష్ సభ్యుడు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

మార్ష్, జియోఫ్ మార్ష్ రెండవ కుమారుడు, షాన్ మార్ష్ తమ్ముడు. వీరిద్దరూ ఆస్ట్రేలియా జాతీయ జట్టు కొరకు ఆడారు. అతని సోదరి, మెలిస్సా మార్ష్, ప్రొఫెషనల్ బాస్కెట్‌బాల్ క్రీడాకారిణి. అతను పశ్చిమ ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో పెరిగాడు, అక్కడ అతను వెస్లీ కాలేజీలో చదివాడు.

క్రికెట్‌తో పాటు మార్ష్, ప్రతిభావంతుడైన ఆస్ట్రేలియన్ రూల్స్ ఫుట్‌బాల్ ఆటగాడు కూడా. 2008 AFL అండర్ 18 ఛాంపియన్‌షిప్‌లలో వెస్ట్రన్ ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించాడు. [2]

అంతర్జాతీయ కెరీర్

[మార్చు]

2011 సెప్టెంబరులో, దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్ళిన ఆస్ట్రేలియా ట్వంటీ20 జట్టులో మార్ష్‌ని చేర్చారు. [3] గాయం కారణంగా బ్రెట్ లీ వైదొలిగిన తర్వాత అతను వన్డే ఇంటర్నేషనల్ జట్టులోకి వచ్చాడు. అతను సిరీస్‌లోని రెండవ T20I మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తరపున అద్భుతంగా రంగప్రవేశం చేసాడు. నాలుగు సిక్సర్‌లతో సహా 36 పరుగులు చేశాడు. వాటిలో మూడు ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లోనే కొట్టాడు. [4] 2014 ఆగస్టులో, హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో జరిగిన ట్రై-సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో జింబాబ్వేపై మార్ష్ 89 పరుగులు చేశాడు. గ్లెన్ మాక్స్‌వెల్‌తో కలిసి నాల్గవ వికెట్‌కు 109 పరుగులు జోడించాడు. ఆరోన్ ఫించ్, జార్జ్ బెయిలీతో కలిసి 47, 33 భాగస్వామ్యాలకు సహకరించాడు. [5] తర్వాత పోటీలో దక్షిణాఫ్రికాపై 86 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. [6]

2014 అక్టోబరు 22న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తరపున మార్ష్ తన తొలి టెస్టు మ్యాచ్‌ ఆడాడు [7]

వన్ డే ఇంటర్నేషనల్ జట్టులో క్రమం తప్పకుండా ఆడుతూ, మార్ష్ 2015 క్రికెట్ ప్రపంచ కప్ సమయంలో ఇంగ్లాండ్‌పై ఐదు వికెట్లు తీశాడు. [8] 2016లో SCG లో భారతదేశానికి వ్యతిరేకంగా తన తొలి వన్‌డే సెంచరీ సాధించాడు.[9] అయితే, దక్షిణాఫ్రికాతో జరిగిన 2016-17 సిరీస్‌లో మొదటి టెస్టు తర్వాత ఆస్ట్రేలియా టెస్టు జట్టు నుండి అతన్ని తొలగించారు. 2017లో భారత్‌తో జరిగిన సిరీస్‌లో తిరిగి జట్టులోకి వచి, రెండు టెస్టుల్లో ఆడాడు. ఆ సంవత్సరం లోనే అతను, 2017–18 యాషెస్ సిరీస్‌లో మూడో మ్యాచ్‌లో పీటర్ హ్యాండ్స్‌కాంబ్ స్థానంలో తన తొలి టెస్టు సెంచరీని సాధించాడు. అతని మొదటి ఇన్నింగ్స్ స్కోరు 181. అతని సోదరుడు షాన్ కెరీర్ బెస్టు స్కోరు 182 కంటే ఇది ఒక తక్కువ.

2018 మార్చిలో, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాల మధ్య జరిగిన రెండో టెస్టులో కగిసో రబాడా ఔట్ అయిన తర్వాత బూతులు మాట్లాడినందుకు గాను, మార్ష్‌కు మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా, ఒక డీమెరిట్ పాయింటు విధించారు. [10] [11] మరుసటి నెలలో, అతను 2018-19 సీజన్ కొరకు క్రికెట్ ఆస్ట్రేలియా జాతీయ కాంట్రాక్టు పొందాడు [12] [13] 2019 జూన్లో పాకిస్తాన్‌తో ఆస్ట్రేలియా 2019 క్రికెట్ ప్రపంచ కప్ మ్యాచ్‌కు ముందు మార్కస్ స్టోయినిస్‌కు కవర్‌గా ఎంపికయ్యాడు.[14] [15] ఆ తర్వాతి నెలలో అతను ఇంగ్లాండ్‌లో 2019 యాషెస్ సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టులో ఎంపికయ్యాడు, కానీ సిరీస్‌లోని మొదటి నాలుగు టెస్టులకు ఎంపిక కాలేదు. [16] [17] సిరీస్‌లోని ఐదవది, ఆఖరిదీ అయిన మ్యాచ్‌లో మార్ష్, టెస్టు క్రికెట్‌లో తన మొదటి ఐదు వికెట్ల పంట సాధించాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 5/46 తీసుకున్నాడు. కానీ జట్టు ఓటమి పాలైంది.[18]

2019 అక్టోబరులో, టాస్మానియాతో జరిగిన షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్‌లో మార్ష్ ఔట్ అయిన తర్వాత గోడను గుద్దడంతో అతని బౌలింగ్ చేయి విరిగింది. ఫలితంగా, అతను ఆస్ట్రేలియా టెస్టు వేసవి ప్రారంభాన్ని కోల్పోవలసి వచ్చింది. [19] 2020 ఏప్రిల్లో, అతనికి 2020-21 సీజన్‌కు ముందు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్ లభించింది.[20] [21] 2020 జూలైలో 26 మంది ఆటగాళ్లతో కూడిన ప్రిలిమినరీ స్క్వాడ్‌లో ఇంగ్లండ్ పర్యటనకు ముందు శిక్షణ ప్రారంభించడానికి ఎంపికయ్యాడు. [22] [23] ఆగస్ట్‌లో క్రికెట్ ఆస్ట్రేలియా, మ్యాచ్‌లు జరుగుతాయని, మార్ష్‌ను టూరింగ్ పార్టీలో చేర్చుకున్నట్లూ ధృవీకరించింది. [24] [25]

2021 జూలైలో, వెస్టిండీస్‌లో ఆస్ట్రేలియా పర్యటనలో మొదటి ట్వంటీ 20 అంతర్జాతీయ మ్యాచ్‌లో మార్ష్, 31 బంతుల్లో 51 పరుగులు చేసి, తన తొలి T20I అర్ధ సెంచరీని సాధించాడు. [26] అతను తన ఫామ్‌ను కొనసాగిస్తూ, తరువాతి మ్యాచ్‌లో మరో అర్ధ సెంచరీని సాధించాడు. [27] నాల్గవ T20Iలో 75 పరుగులు చేసి, అతని కెరీర్‌లో అత్యుత్తమ T20I బౌలింగ్ గణాంకాలు 3/24 సాధించాడు. [28]

2021 ఆగస్టులో, 2021 ICC పురుషుల T20 ప్రపంచ కప్ కోసం ఆస్ట్రేలియా జట్టులో మార్ష్ ఎంపికయ్యాడు. [29] 2021 నవంబరు 14 న మార్ష్, 2021 ICC పురుషుల T20 ప్రపంచ కప్‌ను గెలవడానికి ఆస్ట్రేలియాకు సహాయం చేశాడు, ఫైనల్‌లో 77 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌ని సంపాదించాడు. [30] మార్ష్ 2023 యాషెస్ టూర్‌కు ఎంపికయ్యాడు.

2023 జూలై 6 న, గాయపడిన ఆల్-రౌండర్ కామెరాన్ గ్రీన్ స్థానంలో హెడింగ్లీలో ఇంగ్లాండ్‌తో జరిగిన 3వ యాషెస్ టెస్టు కోసం మార్ష్‌ని తీసుకున్నారు. మొదటి రోజు లంచ్‌కు కొద్దిసేపటి ముందు 4 వికెట్లకు 85 పరుగుల వద్ద క్రీజులోకి వచ్చిన అతను, తన మూడో టెస్టు సెంచరీ - 118 బంతుల్లో 118 పరుగులు - చేశాడు, ఇందులో 17 ఫోర్లు, 4 సిక్సర్‌లు ఉన్నాయి. [31] ఇది 2019 తరువాత అతని మొదటి టెస్టు మ్యాచ్ ప్రదర్శన. ఆస్ట్రేలియా వెలుపల మొదటి సెంచరీ. మార్క్ టేలర్ దీనిని మార్ష్ యొక్క అత్యుత్తమ సెంచరీగా అభివర్ణించాడు. మెల్ జోన్స్, ఇన్నింగ్స్‌ గురించి వ్యాఖ్యానిస్తూ, మార్ష్ తిరుగులేని స్వభావాన్ని, క్రీజ్‌లో చూపిన దృఢత్వాన్నీ గుర్తించాడు. [32]


2023 ఆగస్టు 7న, 2024 ICC పురుషుల T20 ప్రపంచ కప్‌కు శాశ్వత ప్రాతిపదికన నాయకత్వం వహించే అవకాశం ఉన్నందున, దక్షిణాఫ్రికా పర్యటన కోసం T20 జట్టుకు మార్ష్‌ని కెప్టెన్‌గా నియమించారు. [33]

కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శనలు

[మార్చు]
బ్యాటింగ్
స్కోర్ ఫిక్చర్ వేదిక బుతువు
పరీక్ష 181 ఆస్ట్రేలియా v ఇంగ్లాండ్ WACA గ్రౌండ్, పెర్త్ 2017
వన్‌డే 102* భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా సిడ్నీ క్రికెట్ గ్రౌండ్, సిడ్నీ 2016 [34]
T20I 77* ఆస్ట్రేలియా v న్యూజిలాండ్ దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, దుబాయ్ 2021 [35]
FC 211 ఆస్ట్రేలియా ఎ వర్సెస్ ఇండియా ఎ అలన్ బోర్డర్ ఫీల్డ్, బ్రిస్బేన్ 2014 [36]
LA 104 వెస్ట్రన్ ఆస్ట్రేలియా v టాస్మానియా WACA గ్రౌండ్, పెర్త్ 2013 [37]
T20 93 * పెర్త్ స్కార్చర్స్ v బ్రిస్బేన్ హీట్ పెర్త్ స్టేడియం, పెర్త్ 2020 [38]
బౌలింగ్ (ఇన్నింగ్స్)
బొమ్మలు ఫిక్చర్ వేదిక బుతువు
పరీక్ష 5/46 ఆస్ట్రేలియా v ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు ది ఓవల్, లండన్ 2019 [39]
వన్‌డే 5/33 ఆస్ట్రేలియా v ఇంగ్లాండ్ MCG, మెల్బోర్న్ 2015 [40]
T20I 1/30 ఆస్ట్రేలియా v భారత్ MCG, మెల్బోర్న్ 2011 [41]
FC 6/84 వెస్ట్రన్ ఆస్ట్రేలియా v క్వీన్స్‌లాండ్ WACA గ్రౌండ్, పెర్త్ 2011 [42]
LA 5/33 ఆస్ట్రేలియా v ఇంగ్లాండ్ MCG, మెల్బోర్న్ 2015 [40]
T20 4/6 వెస్ట్రన్ ఆస్ట్రేలియా v న్యూ సౌత్ వేల్స్ WACA గ్రౌండ్, పెర్త్ 2010 [43]

మూలాలు

[మార్చు]
  1. "Mitch Marsh". perthscorchers.com. పెర్త్ స్కార్చర్స్. Archived from the original on 3 December 2013. Retrieved 16 February 2014.
  2. Clarke, Tim Multi-talent Marsh paves way to pro-cricket Archived 14 జూలై 2014 at the Wayback Machine; WA Today; 6 February 2009
  3. Clark, Laine (28 September 2011). "Mitch Marsh named in Aust T20 side". The Sydney Morning Herald. Retrieved 9 September 2018.
  4. "Parnell and Theron script stunning win". Retrieved 9 September 2018.
  5. "Zimbabwe fold after Marsh, Maxwell blitz". 25 August 2014. Retrieved 9 September 2018.
  6. "Anderson's blitzkrieg, and the biggest mountain of them all". www.espncricinfo.com. Retrieved 2021-07-12.
  7. "Australia tour of United Arab Emirates, 1st Test: Australia v Pakistan at Dubai (DSC), Oct 22–26, 2014". ESPN Cricinfo. Retrieved 22 October 2014.
  8. "2nd Match, Pool A (D/N), ICC Cricket World Cup at Melbourne, Feb 14 2015 - Match Summary - ESPNCricinfo". ESPNcricinfo. Retrieved 9 September 2018.
  9. Brettig, Daniel (23 January 2016). "Pandey's maiden ODI ton helps India clinch thriller". ESPNcricinfo. Retrieved 23 January 2016.
  10. "Mitch returns serve on Rabada". wwos.nine.com.au (in ఇంగ్లీష్). Retrieved 2018-03-13.
  11. "WATCH: Mitch Marsh tees off at Rabada after getting bowled". Sporting News. 2018-03-12. Retrieved 2018-03-13.
  12. "Carey, Richardson gain contracts as Australia look towards World Cup". ESPN Cricinfo. Retrieved 11 April 2018.
  13. "Five new faces on CA contract list". Cricket Australia. Retrieved 11 April 2018.
  14. "Marcus Stoinis out of Pakistan game with side strain, Mitchell Marsh flown in as cover". ESPN Cricinfo. Retrieved 11 June 2019.
  15. "Marsh joins Cup squad to cover injured Stoinis". Cricket Australia. Retrieved 11 June 2019.
  16. "Australia name 17-man Ashes squad". cricket.com.au (in ఇంగ్లీష్). 26 July 2019. Retrieved 29 July 2019.
  17. "Bancroft, Wade and Mitchell Marsh earn Ashes call-ups". ESPNcricinfo (in ఇంగ్లీష్). 26 July 2019. Retrieved 29 July 2019.
  18. "England all out for 294 as Marsh takes five wickets". Eurosport. Retrieved 13 September 2019.
  19. "Mitchell Marsh: Australia all-rounder to miss start of Test summer after punching wall & breaking hand" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2019-10-15. Retrieved 2019-10-15.
  20. "CA reveals national contract lists for 2020-21". Cricket Australia. Retrieved 30 April 2020.
  21. "Usman Khawaja and Marcus Stoinis lose Cricket Australia contracts". ESPN Cricinfo. Retrieved 30 April 2020.
  22. "Usman Khawaja and Marcus Stoinis in expanded Australia training squad for possible England tour". ESPN Cricinfo. Retrieved 16 July 2020.
  23. "Aussies name huge 26-player group with eye on UK tour". Cricket Australia. Retrieved 16 July 2020.
  24. "Riley Meredith, Josh Philippe and Daniel Sams included as Australia tour to England confirmed". ESPN Cricinfo. Retrieved 14 August 2020.
  25. "Uncapped trio make Australia's UK touring party". Cricket Australia. Retrieved 14 August 2020.
  26. "Australia lose 6 for 19 as McCoy, Walsh give West Indies 1-0 lead". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2021-07-11.
  27. "West Indies go 2-0 up as Australia fold for 140". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2021-07-12.
  28. "Mitchell Marsh's all-round brilliance and Mitchell Starc's final over earn Australia first win". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2021-07-18.
  29. "Josh Inglis earns call-up and key names return in Australia's T20 World Cup squad". ESPN Cricinfo. Retrieved 19 August 2021.
  30. "Live Cricket Scores & News International Cricket Council". www.t20worldcup.com (in ఇంగ్లీష్). Archived from the original on 2021-11-14. Retrieved 2021-11-14.
  31. "Australia vs England Scorecard 2023". ESPNCricinfo. Retrieved 7 July 2023.
  32. "The Ashes 3rd Test, Day 1, First Session". Nine Network. Archived from the original on 7 జూలై 2023. Retrieved 7 July 2023.
  33. https://www.espncricinfo.com/story/mitchell-marsh-named-australia-s-t20-captain-for-south-africa-uncapped-trio-earn-call-ups-1391248
  34. "India in Australia ODI Series, 2015–16 – Australia v India Scorecard". ESPNcricinfo. 23 January 2016. Retrieved 23 January 2016.
  35. "ESPN Cricinfo - 14 October 2021 - T20 World Cup 2021 - New Zealand v Australia". ESPNcricinfo. 14 October 2021. Retrieved 14 October 2021.
  36. "India A tour of Australia, 2014 – Australia A v India A Scorecard". ESPNcricinfo. 9 July 2014. Retrieved 1 January 2016.
  37. "Ryobi One-Day Cup, 2012/13 – WA v TAS Scorecard". ESPNcricinfo. 19 February 2013. Retrieved 1 January 2016.
  38. "Big Bash League, 2019/20 – Perth Scorchers v Brisbane Heat Scorecard". ESPNcricinfo. 11 January 2020.
  39. "West Indies tour of Australia, 2015/16 – Australia v West Indies Scorecard". ESPNcricinfo. 29 December 2015. Retrieved 3 January 2016.
  40. 40.0 40.1 "ICC Cricket World Cup, 2nd Match, 2015 – Australia v England Scorecard". ESPNcricinfo. 14 February 2015. Retrieved 3 January 2016.
  41. "India tour of Australia, 2011/12 – Australia v India Scorecard". ESPNcricinfo. 3 February 2012. Retrieved 3 January 2016.
  42. "Sheffield Shield, 2011/12 – WA v QLD Scorecard". ESPNcricinfo. 4 November 2011. Retrieved 3 January 2016.
  43. "Twenty20 Big Bash, 2009/2010 – WA v NSW Scorecard". ESPNcricinfo. 5 January 2010. Retrieved 3 January 2016.