మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్
MCG, The 'G
దస్త్రం:Melbourne Cricket Ground logo.png
మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ పనోరామా
2017 AFL ఫైనలుకు ముందు
Locationమెల్‌బోర్న్, ఆస్ట్రేలియా
Operatorమెల్బోర్న్ క్రికెట్ క్లబ్
Executive suites109
Capacity1,00,024[1]
Record attendance
 • 109,500 – ఎడ్ షీరన్ +–=÷× Tour[2]
 • 1,43,000 – బిల్లీ గ్రాహం క్రుసేడ్ (pre-configuration)
Field size171 మీటర్లుx 146 మీటర్లు[3]
Surfaceపచ్చిక
Construction
Opened1853; 170 సంవత్సరాల క్రితం (1853)
Renovated1992 (Southern Stand redevelopment)
2006 (Northern Stand redevelopment)
2032 (Proposed Shane Warne Stand redevelopment)
Tenants
ఆస్ట్రేలియన్ ఫుట్‌బాల్ లీగ్

Melbourne Football Club (1858–present)
Richmond Football Club (1965–present)
Collingwood Football Club (1993–present)
Essendon Football Club (1991–present)
Hawthorn Football Club (2000–present)
Carlton Football Club (2005–present)

Cricket

ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు (1877-ప్రస్తుతం)
విక్టోరియా క్రికెట్ జట్టు (1851–ప్రస్తుతం)
మెల్‌బోర్న్ స్టార్స్ (2011–ప్రస్తుతం)

రగ్బీ లీగ్

మెల్‌బోర్న్ స్టార్మ్ (2000)

సాకర్
ఆస్ట్రేలియా పురుషుల సాకర్ జట్టు (ఎంచుకున్న మ్యాచ్‌లు)
ఆస్ట్రేలియా మహిళల ఫుట్‌బాల్ జట్టు (ఎంచుకున్న మ్యాచ్‌లు)
Melbourne Victory (international friendly matches)
మైదాన సమాచారం
ఎండ్‌ల పేర్లు
West: City End (AFL);[4]
North: Members End (Cricket)

South: Southern End (Cricket);
East: Punt Road End[4] (AFL)
అంతర్జాతీయ సమాచారం
మొదటి టెస్టు1877 మార్చి 15–19:
 ఆస్ట్రేలియా v  ఇంగ్లాండు
చివరి టెస్టు2022 డిసెంబరు 26–29:
 ఆస్ట్రేలియా v  దక్షిణాఫ్రికా
మొదటి ODI1971 జనవరి 5:
 ఆస్ట్రేలియా v  ఇంగ్లాండు
చివరి ODI2022నవంబరు 22:
 ఆస్ట్రేలియా v  ఇంగ్లాండు
మొదటి T20I2008 ఫిబ్రవరి 1:
 ఆస్ట్రేలియా v  భారతదేశం
చివరి T20I2022 నవంబరు 13:
 ఇంగ్లాండు v  పాకిస్తాన్
మొదటి మహిళా టెస్టు1935 జనవరి 18–20:
 ఆస్ట్రేలియా v  ఇంగ్లాండు
చివరి మహిళా టెస్టు1949 జనవరి 28–31:
 ఆస్ట్రేలియా v  ఇంగ్లాండు
మొదటి WODI1988 డిసెంబరు 18:
 ఆస్ట్రేలియా v  ఇంగ్లాండు
చివరి WODI2014 జనవరి 23:
 ఆస్ట్రేలియా v  ఇంగ్లాండు
మొదటి WT20I2008 ఫిబ్రవరి 1:
 ఆస్ట్రేలియా v  ఇంగ్లాండు
చివరి WT20I2020 మార్చి 8:
 ఆస్ట్రేలియా v  భారతదేశం
2022 29 December నాటికి
Source: Cricinfo

మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎమ్‌సిజి), ఆస్ట్రేలియా, విక్టోరియా రాష్ట్రం,మెల్బోర్న్ నగరంలో ఉన్న క్రీడా స్టేడియం.[5] స్థానికంగా దీన్ని "ది జి" అని కూడా పిలుస్తారు.[6] మెల్బోర్న్ క్రికెట్ క్లబ్ దీన్ని నిర్మించింది. ఇది దక్షిణార్ధగోళంలో కెల్లా అతిపెద్ద స్టేడియం. ప్రపంచవ్యాప్తంగా 11వ అతిపెద్ద స్టేడియం. సామర్థ్యం ప్రకారం రెండవ అతిపెద్ద క్రికెట్ మైదానం. ఎమ్‌సిజి సిటీ సెంటర్ నుండి నడక దూరంలో ఉంది. ఇది మెల్బోర్న్ పార్క్ ప్రక్కనే ఉంది. మెల్బోర్న్ స్పోర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఆవరణలో ఇది ఒక భాగం.[7]

1853 లో నిర్మించినప్పటి నుండి, ఎమ్‌సిజిలో అనేకసార్లు పునర్నిర్మాణాలు జరిగాయి. 1956 సమ్మర్ ఒలింపిక్స్, 2006 కామన్వెల్త్ గేమ్స్, 1992, 2015 లలో జరిగిన రెండు క్రికెట్ ప్రపంచ కప్‌లకు ప్రధాన వేదికగా ఉంది. 2026 కామన్వెల్త్ క్రీడల ప్రారంభ వేడుకలు కూడా ఇక్కడే జరుగుతాయి. అంతర్జాతీయ క్రికెట్ అభివృద్ధిలో దాని పాత్ర ప్రసిద్ధి గాంచింది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ల మధ్య 1877 లో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌కు, 1971లో జరిగిన మొదటి వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌కూ ఎమ్‌సిజియే వేదిక. 1859 నుండి ఆస్ట్రేలియా నియమాల ఫుట్‌బాల్‌తో బలమైన సంబంధాలున్నాయి. ప్రపంచంలో అత్యధికంగా హాజరైన లీగ్ ఛాంపియన్‌షిప్ ఈవెంట్ AFL గ్రాండ్ ఫైనల్‌తో సహా ఆస్ట్రేలియన్ ఫుట్‌బాల్ లీగ్ (AFL) మ్యాచ్‌లకు ఇదే ప్రధాన వేదిక. 2022 T20 ప్రపంచ కప్ గ్రాండ్ ఫైనల్‌ ఇక్కడే జరిగింది.

ప్రారంభ చరిత్ర[మార్చు]

కెప్టెన్-కోచ్ టామ్ విల్స్‌తో ఆదివాసీ క్రికెట్ జట్టు, 1866 డిసెంబరు. నేపథ్యంలో 1854లో నిర్మించిన ఒరిజినల్ MCC పెవిలియన్ను చూడవచ్చు

ఎమ్‌సిజిని వురుండ్జేరి క్యాంపింగ్ గ్రౌండ్, అనేక కరరోబోరీలు ఉండే ప్రదేశంలో నిర్మించారు.[8] 1838 నవంబరులో స్థాపించబడిన మెల్బోర్న్ క్రికెట్ క్లబ్ (MCC) మెల్బోర్న్ చుట్టుపక్కల ఉన్న అనేక మైదానాల్లో ఆడిన తర్వాత 1853లో ప్రస్తుత ఎమ్‌సిజి స్థలాన్ని ఎంపిక చేసుకుంది.[9] క్లబ్ మొదటి గేమ్ విలియం, లా ట్రోబ్ వీధులు కలిసే మూలన ఓల్డ్ మింట్ సైట్‌లో ఒక సైనిక జట్టుతో జరిగింది. 1839 జనవరిలో బరియల్ హిల్ (ప్రస్తుత ఫ్లాగ్‌స్టాఫ్ గార్డెన్స్) దాని హోమ్ గ్రౌండ్‌గా మారింది. అయితే ఆ ప్రాంతం అప్పటికే బొటానికల్ గార్డెన్స్ కోసం కేటాయించబడడంతో, 1846 అక్టోబరులో క్లబ్బును దక్షిణ ఒడ్డున, ప్రస్తుతం హెరాల్డ్ & వీక్లీ టైమ్స్ భవనం ఉన్న ప్రాంతానికి మార్చారు. ఆ ప్రాంతంలో వరదలు రావడాంతో క్లబ్బును మళ్లీ తరలించాల్సి వచ్చింది. ఈసారి దాన్ని దక్షిణ మెల్‌బోర్న్‌లోని మైదానానికి తరలించారు

కొద్దికాలంలోనే, ఈసారి రైల్వే విస్తరణ కారణంగా, క్లబ్బును మళ్లీ తరలించవలసి వచ్చింది. మెల్బోర్న్ నుండి సాండ్రిడ్జ్ (ప్రస్తుతం పోర్ట్ మెల్బోర్న్ ) వరకు వేసిన విక్టోరియా రాష్ట్రపు మొదటి ఆవిరి రైలు మార్గానికి అడ్డంగా దక్షిణ మెల్బోర్న్ మైదానం ఉంది. గవర్నర్ లా ట్రోబ్ MCCకి మూడు ప్రత్యామ్నాయ స్థలాలను సూచించాడు. అవి: ఇప్పటికే ఉన్న మైదానానికి ఆనుకొని ఉన్న ప్రాంతం, ఫ్లిండర్స్, స్ప్రింగ్ వీధుల కూడలి వద్ద ఒక స్థలం లేదా పది ఎకరాల (సుమారు 4 హెక్టార్లు) రిచ్‌మండ్ పార్క్ పక్కన రిచ్‌మండ్‌లోని ప్రభుత్వ పాడాక్ విభాగం.

MCC సబ్-కమిటీ రిచ్‌మండ్ పార్కు స్థలాన్ని ఎంచుకుంది. ఎందుకంటే ఇది క్రికెట్‌కు సరిపోయేలా సమతలంగా ఉండడమే కాక, వరదలను తట్టుకునేంతటి వాలు కూడా ఉంది.

అదే సమయంలో, గవర్నమెంట్ ప్యాడాక్‌కు తూర్పు వైపున ఉన్న 6 ఎకరాల స్థలాన్ని మరో క్రికెట్ మైదానాన్ని కోసం రిచ్‌మండ్ క్రికెట్ క్లబ్‌కు ఇచ్చారు.

భూమి మంజూరు సమయంలో, ప్రభుత్వం మైదానాన్ని క్రికెట్ కోసం మాత్రమే ఉపయోగించాలని షరతు విధించింది. ఈ పరిస్థితి సాంకేతికంగా 1933 వరకు కొనసాగింది.[10][11] 1933 లో వచ్చిన మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ చట్టం దాని ఉపయోగాల పరిధిని విస్తరించింది. 1933 చట్టం స్థానంలో 1989, 2009లో వేరే చట్టాలు వచ్చాయి.[12]

స్టేడియం అభివృద్ధి[మార్చు]

1877 లో ఇంగ్లీష్ క్రికెట్ జట్టు సందర్శన సందర్భంగా నిర్మించిన గ్రాండ్‌స్టాండ్

MCGలో మొట్టమొదటి గ్రాండ్‌స్టాండ్ 1854లో నిర్మించిన ఒరిజినల్ చెక్క స్టాండు. మొదటి పబ్లిక్ గ్రాండ్‌స్టాండ్ మాత్రం 1861లో నిర్మించిన 200 మీటర్ల పొడవు 6000 సీట్ల తాత్కాలిక నిర్మాణం. 1876 లో, 1877లో జేమ్స్ లిల్లీవైట్ నేతృత్వంలో ఇంగ్లీష్ క్రికెట్ జట్టు వచ్చిన సందర్భంగా మరో 2000 మంది కూర్చునేలా మరో గ్రాండ్‌స్టాండ్‌ను నిర్మించారు. ఈ పర్యటనలోనే MCGలో ప్రపంచపు మొట్టమొదటి టెస్టు మ్యాచ్‌ జరిగింది.

MCG, ca. 1914. 1881 సభ్యుల స్టాండ్ ఎడమ వైపున ఉన్న చిన్న భవనం

20వ శతాబ్దం ప్రారంభంలో మరిన్ని స్టాండ్‌లు నిర్మించారు. 1904లో మైదానానికి దక్షిణం వైపున ఒక ఓపెన్ చెక్క స్టాండ్ ఉండేది. 2084-సీట్లున్న గ్రే స్మిత్ స్టాండును (1912 వరకు న్యూ స్టాండ్ అని పిలుస్తారు) 1906లో సభ్యుల కోసం నిర్మించారు. మైదానం దక్షిణ భాగంలో 4000-సీట్ల హారిసన్ స్టాండును 1908లో నిర్మించారు. 198000 లో 12-సీట్ల వార్డిల్ స్టాండును నిర్మించారు. 1897 తర్వాత 15 సంవత్సరాలలో గ్రౌండ్‌లో గ్రాండ్‌స్టాండ్ సామర్థ్యం దాదాపు 20,000కి పెరిగింది. అప్పటికి మైదానం పూర్తి సామర్థ్యం దాదాపు 60,000.

ఆ తరువాతి సంవత్సరాలలో కొత్త స్టాండ్ల నిర్మాణం, పాతవాటి తీసివేతలు జరుగుతూ వచ్చాయి.

MCG ఆస్ట్రేలియా లోని మొట్టమొదటి పూర్తి రంగుల వీడియో స్కోర్‌బోర్డును ఎమ్‌సిజిలో 1982 లో ఏర్పాటు చేసారు. ఇది వెస్ట్రన్ స్టాండ్‌లోని 4వ లెవెల్‌లో ఉంది. 1999లో ఇది తగలబడడంతో 2000లో మళ్ళీ నిర్మించారు. రెండవ వీడియో స్క్రీన్ 1994లో ఒలింపిక్ స్టాండ్ లెవెల్ 4లో ఏర్పాటు చేసారు. 1985లో, రాత్రి ఫుట్‌బాల్ ఆట కోసం, డే-నైట్ క్రికెట్ ఆటల కోసం లైటింగు టవర్‌లను ఏర్పాటు చేశారు.

1998 బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ సందర్భంగా గ్రేట్ సదరన్ స్టాండ్ యొక్క దృశ్యం. ఫోటోకి దిగువన ఎడమవైపున ఒలింపిక్ స్టాండ్ కనిపిస్తుంది.

1988లో, పాత సదరన్ స్టాండుకు కాంక్రీట్ క్యాన్సర్‌ వచ్చింది. దాని స్థానంలో కొత్తది నిర్మించవలసి వచ్చింది. దానికయ్యే $10 కోట్ల అంచనా వ్యయాన్ని భరించగలిగే స్థితిలో మెల్‌బోర్న్ క్రికెట్ క్లబ్ లేదు. అప్పుడు విక్టోరియన్ ఫుట్‌బాల్ లీగ్, 30 సంవత్సరాల పాటు మైదానాన్ని గ్రౌండ్‌ను పంచుకునే ఒప్పందంతో నిధులు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. కొత్త గ్రేట్ సదరన్ స్టాండు 1992 క్రికెట్ ప్రపంచ కప్ సమయానికి $15 కోట్ల ఖర్చుతో పూర్తయింది. 2022లో విక్టోరియన్ బౌలర్ షేన్ వార్న్ మరణించిన కొద్దికాలానికే దీనికి షేన్ వార్న్ స్టాండ్ అని పేరు పెట్టారు.[13]

టెస్ట్ క్రికెట్ రికార్డులు[మార్చు]

మొదటి టెస్ట్ మ్యాచ్[మార్చు]

1878లో MCG. మొదటి టెస్ట్ క్రికెట్ మ్యాచ్ 1877లో MCGలో జరిగింది

1877లో జేమ్స్ లిల్లీవైట్ నేతృత్వంలో నాల్గవ పర్యటన జరిగే వరకు, పర్యాటక జట్లు స్థానిక కలోనియల్ జట్లతో ఫస్ట్-క్లాస్ గేమ్‌లు ఆడేవి. అయితే లిల్లీవైట్ న్యూ సౌత్ వేల్స్‌పై తన జట్టు బాగా రాణించిందనీ, తాము సంపూర్ణ ఆస్ట్రేలియా జట్టుతో మ్యాచ్‌ ఆడేందుకు సిద్ధంగా ఉన్నామనీ భావించాడు.

లిల్లీవైట్ న్యూజిలాండ్‌ వెళ్తూ, తాము తిరిగి వచ్చేటప్పటికి ఆ మ్యాచ్‌ను ఏర్పాటు చేయమని మెల్‌బోర్న్ క్రికెటర్ జాన్ కాన్వేకి చెప్పాడు. కాన్వే, కాలనీల్లోని క్రికెట్ సంఘాలను పక్కనపెట్టి, స్వంతంగా తానే ఒక ఆస్ట్రేలియా జట్టును ఎంపిక చేసుకున్నాడు. నేరుగా ఆటగాళ్లతో చర్చలు జరిపాడు. అతను ఎంచుకున్న జట్టు ప్రాతినిధ్యం సందేహాస్పదంగా ఉండడం మాత్రమే కాదు, కొంతమంది ఆటగాళ్ళు వివిధ కారణాల వల్ల పాల్గొనడానికి నిరాకరించినందున అది బహుశా అంత బలమైన జట్టు కూడా కాదు. వికెట్ కీపర్ బిల్లీ మర్డోచ్‌ను ఎంపిక చేయనందున డెమోన్ బౌలర్ ఫ్రెడ్ స్పోఫోర్త్ ఆడేందుకు నిరాకరించాడు. పేస్‌మెన్ ఫ్రాంక్ అలన్ వార్నంబూల్ అగ్రికల్చరల్ షోలో ఉన్నాడు. ఆస్ట్రేలియా అత్యుత్తమ ఆల్-రౌండర్ ఎడ్విన్ ఎవాన్స్ తన ఉద్యోగం కారణాంగా ఆడలేకపోయాడు. చివరికి ఆస్ట్రేలియాలో జన్మించిన ఆటగాళ్లలో ఐదుగురిని మాత్రమే ఎంపిక చేశాడు.

లిల్లీవైట్ జట్టు పరిస్థితి కూడా ఇదేనని చెప్పవచ్చు. జట్టును కేవలం నాలుగు కౌంటీల నుండి ఎంపిక చేసిన ఆటగాళ్ళతో నింపారు. ఇంగ్లాండ్‌లోని అత్యుత్తమ ఆటగాళ్లలో కొందరు పాల్గొనలేదు. అదనంగా, బృందం టాస్మాన్ సముద్రం మీదుగా తిరిగి కఠినమైన సముద్రయానం చేయడంతో చాలా మంది సభ్యులు జబ్బుపడ్డారు. వారు వచ్చిన మరుసటి రోజు, మార్చి 15న, ఒక ఆట ఆడాల్సి ఉంది, కానీ అప్పటికి చాలా మంది ఇంకా పూర్తిగా కోలుకోలేదు. పైగా, వికెట్ కీపర్ టెడ్ పూలీ క్రైస్ట్‌చర్చ్ పబ్‌లో ఘర్షణ పడి, న్యూజిలాండ్ జైలులో పడ్డాడు.

ఆ ఆటలో ఇంగ్లండే ఫేవరిట్. మొదటి టెస్ట్ మ్యాచ్‌లో కేవలం 1000 మంది ప్రేక్షకులున్నారు. ఆస్ట్రేలియన్లు న్యూ సౌత్ వేల్స్ నుండి డేవ్ గ్రెగొరీని ఆస్ట్రేలియా మొట్టమొదటి కెప్టెన్‌గా ఎన్నుకున్నారు. టాస్ గెలిచిన అతను, బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు.

రిటైర్ అయ్యే ముందు చార్లెస్ బానర్‌మాన్ అజేయంగా 165 పరుగులు చేశాడు. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ క్యూరేటర్, నెడ్ గ్రెగొరీ, ఆస్ట్రేలియా తరపున తన ఏకైక టెస్టు ఆడుతూ టెస్ట్ క్రికెట్‌లో మొదటి డకౌట్ అయ్యాడు. ఆస్ట్రేలియా 245, 104 పరుగులు చేయగా, ఇంగ్లండ్ 196, 108 పరుగులు చేసి 45 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయం బ్యానర్‌మన్ సెంచరీపై ఆధారపడింది. టామ్ కెండాల్ ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 55 పరుగులకు 7 వికెట్లు తీసాడు.

పక్షం రోజుల తర్వాత మళ్ళీ ఆట జరిగింది. అది ఇంగ్లీష్ జట్టుకు బెనిఫిట్‌ మ్యాచ్‌. ఆస్ట్రేలియా జట్టులో స్పోఫోర్త్, మర్డోక్, TJD కూపర్‌లను చేర్చుకున్నారు. ఇంగ్లాండ్‌ నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది.

రెండు సంవత్సరాల తర్వాత లార్డ్ హారిస్ మరొక ఇంగ్లండ్ జట్టును తీసుకువచ్చాడు. MCGలో జరిగిన టెస్ట్‌లో ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో ఫ్రెడ్ స్పోఫోర్త్, టెస్ట్ క్రికెట్‌లో మొదటి హ్యాట్రిక్ సాధించాడు. ఆస్ట్రేలియా పది వికెట్లతో గెలిచింది. ఈ విజయంలో అతను 48 పరుగులకు 6 వికెట్లు, 62 పరుగులకు 7 వికెట్లు సాధించాడు.

MCGలో క్రికెట్ మ్యాచ్‌లకు హాజరు రికార్డులు
సంఖ్య జట్లు మ్యాచ్ రకం హాజరు తేదీ
1 ఆస్ట్రేలియా v న్యూజిలాండ్ 2015 క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ (ODI) 93,013 2015 మార్చి 29
2 ఆస్ట్రేలియా v ఇంగ్లాండ్ టెస్టు 91,112 2013 డిసెంబరు 26
3 ఆస్ట్రేలియా v వెస్టిండీస్ టెస్టు 90,800 1961 ఫిబ్రవరి 11
4 భారత్ వర్సెస్ పాకిస్థాన్ 2022 పురుషుల T20 ప్రపంచ కప్ (సూపర్ 12) 90,293 2022 అక్టోబరు 23
5 ఆస్ట్రేలియా v ఇంగ్లాండ్ టెస్టు 89,155 2006 డిసెంబరు 26
6 ఆస్ట్రేలియా v ఇంగ్లాండ్ టెస్టు 88,172 2017 డిసెంబరు 26
7 ఆస్ట్రేలియా v ఇంగ్లాండ్ టెస్టు 87,789 1937 జనవరి 4
8 ఇంగ్లండ్ v పాకిస్థాన్ 1992 క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ (ODI) 87,182 1992 మార్చి 25
9 భారత్ v సౌతాఫ్రికా 2015 క్రికెట్ ప్రపంచ కప్ గ్రూప్ మ్యాచ్ 86,876 2015 ఫిబ్రవరి 22
10 ఆస్ట్రేలియా v భారత్ 2020 ICC మహిళల T20 ప్రపంచ కప్ ఫైనల్ 86,174 2020 మార్చి 8

ఒలింపిక్ క్రీడలు[మార్చు]

MCG చరిత్రలో అత్యంత ప్రసిద్ధ క్షణం 1956 ఒలింపిక్ క్రీడలకు ప్రధాన స్టేడియంగా ఉండడం. ప్రారంభ, ముగింపు వేడుకలు, ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్‌లు, ఫీల్డ్ హాకీ, సాకర్‌ ఫైనల్‌లను ఇక్కడ నిర్వహించారు.[14]

కొత్తగా ఒలంపిక్ (లేదా నార్తర్న్) స్టాండ్ నిర్మించి MCG సామర్థ్యాన్ని పెంచారు. ప్రారంభ వేడుకల నాడు 1,03,000 మంది ప్రజలతో స్టేడియం నిండిపోయింది.

కామన్వెల్త్ గేమ్స్[మార్చు]

2006 కామన్వెల్త్ క్రీడల ప్రారంభ, ముగింపు వేడుకలు MCG లోనే జరిగాయి. అలాగే ఆటల సమయంలో అథ్లెటిక్స్ ఈవెంట్‌లు జరిగాయి. ఈ ఆటలు మార్చి 15న ప్రారంభమై మార్చి 26న ముగిశాయి.

సాధారణ రికార్డులు[మార్చు]

నగరంలో ఓ భవనం నుండి MCG.

క్రీడా రికార్డులు[మార్చు]

 • మొట్టమొదటి టెస్ట్ క్రికెట్ మ్యాచ్ (ఆస్ట్రేలియా v ఇంగ్లాండ్) - 1877
 • మొట్టమొదటి వన్డే అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ - 1971
 • అత్యధిక ఫస్ట్ క్లాస్ క్రికెట్ స్కోరు – 1107 (విక్టోరియా v NSW, 1926)
 • ఆస్ట్రేలియా మొదటి అంతర్జాతీయ లాక్రోస్ మ్యాచ్ (ఆస్ట్రేలియా v కెనడా, 1907, 30,000)
 • ఆస్ట్రేలియాలో జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో వేగవంతమైన బంతి, ప్రపంచంలో 3వ వేగవంతమైనది - 160.7 కిమీ/గం (షాన్ టెయిట్, ఆస్ట్రేలియా v పాకిస్థాన్, 2010 ఫిబ్రవరి 5)

హాజరు రికార్డులు[మార్చు]

MCGలో ఆల్-టైమ్ అత్యధిక హాజరు రికార్డులు
సంఖ్య హాజరు ఈవెంట్ తేదీ
1 143,000 బిల్లీ గ్రాహం, క్రూసేడ్ 1959 మార్చి 15
2 121,696 VFL గ్రాండ్ ఫైనల్, Carlton v Collingwood 1970 సెప్టెంబరు 26
3 120,000 40వ యూకారిస్టిక్ కాంగ్రెస్ 1973 ఫిబ్రవరి 25
4 119,195 VFL గ్రాండ్ ఫైనల్, Carlton v Richmond 1969 సెప్టెంబరు 27
5 118,192 VFL గ్రాండ్ ఫైనల్, Hawthorn v St Kilda 1971 సెప్టెంబరు 25
 • అత్యధిక ఆస్ట్రేలియన్ మతపరమైన ఈవెంట్ హాజరు – 143,750 (బిల్లీ గ్రాహం క్రూసేడ్, 1959) [15]
 • స్వదేశంలో జరిగే మ్యాచ్‌లో అత్యధిక VFL/AFL హాజరు – 99,256 (మెల్‌బోర్న్ v కాలింగ్‌వుడ్, 1958).[16]
 • ఫైనల్‌లో అత్యధిక VFL/AFL హాజరు, అత్యధిక 2022
 • ఆస్ట్రేలియన్ స్పోర్టింగ్ ఈవెంట్ హాజరు – 121,696 (కాలింగ్‌వుడ్ v కార్ల్టన్, 1970) [17]
 • MCGలో అత్యధిక సాకర్ ప్రేక్షకులు (క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫ్రెండ్లీ) – 99,382 ( ఇంటర్నేషనల్ ఛాంపియన్స్ కప్, మాంచెస్టర్ సిటీ v రియల్ మాడ్రిడ్, 2015 జూలై 24)
 • MCGలో అత్యధిక సాకర్ ప్రేక్షకులు (నేషనల్ టీమ్ vs నేషనల్ టీమ్) – 97,103 (ఆస్ట్రేలియా v గ్రీస్, 2006)
 • టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక సింగిల్-డే హాజరు – 91,092 (2013 బాక్సింగ్ డే టెస్ట్, డే 1 – ఆస్ట్రేలియా v ఇంగ్లాండ్)
 • అత్యధిక వన్డే అంతర్జాతీయ క్రికెట్ ప్రేక్షకులు – 93,013 ( 2015 క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్, ఆస్ట్రేలియా v న్యూజిలాండ్)
 • అత్యధిక ట్వంటీ 20 అంతర్జాతీయ క్రికెట్ ప్రేక్షకులు – 90,293 ( 2022 ICC పురుషుల T20 ప్రపంచ కప్, సూపర్ 12 రౌండ్ – భారతదేశం v పాకిస్తాన్, 2022 అక్టోబరు 23)
 • అత్యధిక ట్వంటీ20 దేశీయ క్రికెట్ ప్రేక్షకులు – 80,883 (మెల్బోర్న్ స్టార్స్ v మెల్బోర్న్ రెనెగేడ్స్, 2015–16 బిగ్ బాష్ లీగ్ సీజన్ ) [18]
 • అత్యధిక మహిళా క్రికెట్ ప్రేక్షకులు - 86,174 ( 2020 ICC మహిళల T20 ప్రపంచ కప్ ఫైనల్, ఆస్ట్రేలియా మహిళలు v India మహిళలు)
 • హయ్యస్ట్ స్టేట్ ఆఫ్ ఆరిజిన్ రగ్బీ లీగ్ ప్రేక్షకులు – 91,513 (గేమ్ II, 2015 జూన్ 17)

స్టేడియం రికార్డులు[మార్చు]

 • తక్షణ రీప్లేలతో ప్రపంచంలోని మొట్టమొదటి ఆల్ కలర్ క్రికెట్ స్కోర్‌బోర్డ్
 • ప్రపంచంలో మొట్టమొదటి ఎలక్ట్రానిక్ దృశ్య తెరలు
 • ప్రపంచంలోనే మొట్టమొదటి సూపర్ సోపర్
 • ఓవల్ ఆకారంలో ఉన్న మైదానంలో ప్రపంచంలోని మొట్టమొదటి స్క్రోలింగ్ సంకేతాలు
 • మొదటిసారిగా వన్-పీస్ పోర్టబుల్ పిచ్‌పై అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఆడబడింది, బాక్సింగ్ డే టెస్ట్, 2000
 • ప్రపంచంలోనే ఎత్తైన ఫ్లడ్‌లైట్లు [19]
మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు డాన్ బ్రాడ్‌మాన్ ఇప్పటికీ ఉంది.
జాక్ హాబ్స్ ఈ మైదానంలో 18 ఇన్నింగ్స్‌లలో 1,178 పరుగులు చేశాడు; ఆస్ట్రేలియాయేతరులలో ఇది రికార్డు.
మాథ్యూ హేడెన్ ఆరు సెంచరీలు సాధించి, తొమ్మిది సెంచరీలు సాధించిన బ్రాడ్‌మాన్ తర్వాత రెండో స్థానంలో ఉన్నాడు.

బ్యాటింగ్[మార్చు]

కెరీర్‌లో అత్యధిక పరుగులు [20]
పరుగులు ఆటగాడు కాలం
1,671 (17 ఇన్నింగ్స్) ఆస్ట్రేలియా డాన్ బ్రాడ్‌మాన్ 1928–1948
1,338 (28 ఇన్నింగ్స్) ఆస్ట్రేలియా రికీ పాంటింగ్ 1995–2011
1,284 (30 ఇన్నింగ్స్) ఆస్ట్రేలియా స్టీవ్ వా 1985–2003
1,272 (36 ఇన్నింగ్స్) ఆస్ట్రేలియా అలన్ బోర్డర్ 1978–1993
1,257 (31 ఇన్నింగ్స్) ఆస్ట్రేలియా గ్రెగ్ చాపెల్ 1971–1983
కెరీర్‌లో అత్యధిక పరుగులు (ఆస్ట్రేలియాయేతర) [21]
పరుగులు ఆటగాడు కాలం
1,178 (18 ఇన్నింగ్స్‌లు) ఇంగ్లాండ్ జాక్ హాబ్స్ 1908–1929
724 (7 ఇన్నింగ్స్) ఇంగ్లాండ్ హెర్బర్ట్ సుట్క్లిఫ్ 1925–1933
661 (15 ఇన్నింగ్స్) ఇంగ్లాండ్ కోలిన్ కౌడ్రీ 1954–1975
606 (11 ఇన్నింగ్స్) వెస్ట్ ఇండీస్ వివ్ రిచర్డ్స్ 1975–1988
505 (12 ఇన్నింగ్స్) ఇంగ్లాండ్ వాలీ హమ్మండ్ 1928–1947
అత్యధిక వ్యక్తిగత స్కోర్లు [22]
పరుగులు ఆటగాడు తేదీ
307 v. ఇంగ్లండ్ ఆస్ట్రేలియా బాబ్ కౌపర్ 1966 ఫిబ్రవరి 11
270 v. ఇంగ్లండ్ ఆస్ట్రేలియా డాన్ బ్రాడ్‌మాన్ 1937 జనవరి 1
268 v. పాకిస్తాన్ ఆస్ట్రేలియా గ్రాహం యాలోప్ 1983 డిసెంబరు 26
257 v. భారతదేశం ఆస్ట్రేలియా రికీ పాంటింగ్ 2003 డిసెంబరు 26
250 v. ఇంగ్లండ్ ఆస్ట్రేలియా జస్టిన్ లాంగర్ 2002 డిసెంబరు 26
అత్యధిక శతాబ్దాలు [23]
శతాబ్దాలు ఆటగాడు కాలం
9 (17 ఇన్నింగ్స్) ఆస్ట్రేలియా డాన్ బ్రాడ్‌మాన్ 1928–1948
6 (19 ఇన్నింగ్స్‌లు) ఆస్ట్రేలియా మాథ్యూ హేడెన్ 1996–2008
5 (18 ఇన్నింగ్స్‌లు) ఇంగ్లాండ్ జాక్ హాబ్స్ 1908–1929
4 (7 ఇన్నింగ్స్) ఇంగ్లాండ్ హెర్బర్ట్ సుట్క్లిఫ్ 1925–1933
4 (13 ఇన్నింగ్స్) ఆస్ట్రేలియా బిల్ లారీ 1962–1971
4 (14 ఇన్నింగ్స్) ఆస్ట్రేలియా స్టీవ్ స్మిత్ 2010–2021
4 (28 ఇన్నింగ్స్‌లు) ఆస్ట్రేలియా రికీ పాంటింగ్ 1995–2011
4 (31 ఇన్నింగ్స్) ఆస్ట్రేలియా గ్రెగ్ చాపెల్ 1971–1983
4 (36 ఇన్నింగ్స్) ఆస్ట్రేలియా అలన్ బోర్డర్ 1978–1993
అత్యధిక బ్యాటింగ్ సగటు (5+ ఇన్నింగ్స్) [24]
సగటు ఆటగాడు కాలం
128.53 (17 ఇన్నింగ్స్‌లు, 4 NO ) ఆస్ట్రేలియా డాన్ బ్రాడ్‌మాన్ 1928–1948
103.42 (7 ఇన్నింగ్స్, 0 NO) ఇంగ్లాండ్ హెర్బర్ట్ సుట్క్లిఫ్ 1925–1933
101.20 (5 ఇన్నింగ్స్‌లు, 0 NO) ఆస్ట్రేలియా బాబ్ కౌపర్ 1964–1968
87.00 (6 ఇన్నింగ్స్‌లు, 1 NO) ఇంగ్లాండ్ అలిస్టర్ కుక్ 2006–2017
84.72 (15 ఇన్నింగ్స్‌లు, 4 NO) ఆస్ట్రేలియా స్టీవ్ స్మిత్ 2010–2021

బౌలింగ్[మార్చు]

ఈ మైదానంలో డెన్నిస్ లిల్లీ 82 వికెట్లతో అత్యధిక వికెట్లు పడగొట్టాడు. MCG వద్ద ఉన్న విగ్రహం చిత్రం.
కెరీర్‌లో అత్యధిక వికెట్లు [25]
వికెట్లు ఆటగాడు కాలం
82 (26 ఇన్నింగ్స్) ఆస్ట్రేలియా డెన్నిస్ లిల్లీ 1972–1983
56 (21 ఇన్నింగ్స్) ఆస్ట్రేలియా షేన్ వార్న్ 1992–2006
46 (13 ఇన్నింగ్స్) ఆస్ట్రేలియా హ్యూ ట్రంబుల్ 1894–1904
45 (14 ఇన్నింగ్స్) ఆస్ట్రేలియా గ్రాహం మెకెంజీ 1962–1968
42 (22 ఇన్నింగ్స్) ఆస్ట్రేలియా గ్లెన్ మెక్‌గ్రాత్ 1995–2006
సిడ్నీ బర్న్స్ పది ఇన్నింగ్స్‌లలో 35 వికెట్లు తీశాడు; ఆస్ట్రేలియన్ కానివారిలో చాలా ఎక్కువ.
కెరీర్‌లో అత్యధిక వికెట్లు (ఆస్ట్రేలియాయేతర) [26]
వికెట్లు ఆటగాడు కాలం
35 (10 ఇన్నింగ్స్) ఇంగ్లాండ్ సిడ్నీ బర్న్స్ 1902–1912
27 (8 ఇన్నింగ్స్) ఇంగ్లాండ్ బాబీ పీల్ 1885–1895
22 (8 ఇన్నింగ్స్) ఇంగ్లాండ్ బిల్లీ బేట్స్ 1881–1885
22 (8 ఇన్నింగ్స్) ఇంగ్లాండ్ అలెక్ బెడ్సర్ 1947–1951
22 (8 ఇన్నింగ్స్) పాకిస్తాన్ సర్ఫరాజ్ నవాజ్ 1972–1983
అత్యుత్తమ ఇన్నింగ్స్ గణాంకాలు [27]
గణాంకాలు ఆటగాడు తేదీ
9/86 v. ఆస్ట్రేలియా పాకిస్తాన్ సర్ఫరాజ్ నవాజ్ 1979 మార్చి 10
9/121 v. ఇంగ్లండ్ ఆస్ట్రేలియా ఆర్థర్ మైలీ 1921 ఫిబ్రవరి 11
8/68 v. ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ విల్ఫ్రెడ్ రోడ్స్ 1904 జనవరి 1
8/71 v. వెస్ట్ ఇండీస్ ఆస్ట్రేలియా గ్రాహం మెకెంజీ 1968 డిసెంబరు 26
8/81 v. ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ లెన్ బ్రాండ్ 1904 మార్చి 5
8/143 v. ఇంగ్లండ్ ఆస్ట్రేలియా మాక్స్ వాకర్ 1975 ఫిబ్రవరి 8
ఉత్తమ మ్యాచ్ గణాంకాలు [28]
గణాంకాలు ఆటగాడు తేదీ
15/124 v. ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ విల్ఫ్రెడ్ రోడ్స్ 1904 జనవరి 1
14/102 v. ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ బిల్లీ బేట్స్ 1883 జనవరి 19
13/77 v. ఇంగ్లండ్ ఆస్ట్రేలియా మాంటీ నోబుల్ 1902 జనవరి 1
13/110 v. ఇంగ్లండ్ ఆస్ట్రేలియా ఫ్రెడ్ స్పోఫోర్త్ 1879 జనవరి 2
13/148 v. ఇంగ్లండ్ ఆస్ట్రేలియా బ్రూస్ రీడ్ 1990 డిసెంబరు 26
13/163 v. ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ సిడ్నీ బర్న్స్ 1902 జనవరి 1
13/165 v. ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా హ్యూ టేఫీల్డ్ 1952 డిసెంబరు 24
13/236 v. ఇంగ్లండ్ ఆస్ట్రేలియా ఆర్థర్ మైలీ 1921 ఫిబ్రవరి 11
అత్యల్ప స్ట్రైక్ రేట్ (4+ ఇన్నింగ్స్) [29]
స్ట్రైక్ రేటు ఆటగాడు కాలం
22.6 (6 వికెట్లు) ఆస్ట్రేలియా జాన్ హోడ్జెస్ 1877–1877
31.1 (10 వికెట్లు) ఆస్ట్రేలియా లారీ నాష్ 1932–1937
31.1 (15 వికెట్లు) భారతదేశం జస్ప్రీత్ బుమ్రా 2018–2020
32.6 (35 వికెట్లు) ఆస్ట్రేలియా బ్రూస్ రీడ్ 1985–1991
32.7 (18 వికెట్లు) వెస్ట్ ఇండీస్ మైఖేల్ హోల్డింగ్ 1976–1981
2016లో ఆస్ట్రేలియా మొత్తం 8/624తో డిక్లేర్ చేయడంతో స్టీవ్ స్మిత్ 165* పరుగులు చేశాడు.

జట్టు రికార్డులు[మార్చు]

అత్యధిక ఇన్నింగ్స్ స్కోర్లు [30]
స్కోర్ జట్టు తేదీ
8/624డి ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా v. పాకిస్తాన్ 2016 డిసెంబరు 26
604 ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా v. ఇంగ్లాండ్ 1937 ఫిబ్రవరి 26
600 ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా v. ఇంగ్లాండ్ 1925 జనవరి 1
589 ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ v. ఆస్ట్రేలియా 1912 ఫిబ్రవరి 9
578 ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా v. దక్షిణాఫ్రికా 1911 ఫిబ్రవరి 17
అత్యల్పంగా పూర్తయిన ఇన్నింగ్స్ [31]
స్కోర్ జట్టు తేదీ
36 దక్షిణాఫ్రికా దక్షిణాఫ్రికా v. ఆస్ట్రేలియా 1932 ఫిబ్రవరి 12
45 దక్షిణాఫ్రికా దక్షిణాఫ్రికా v. ఆస్ట్రేలియా 1932 ఫిబ్రవరి 12
61 ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ v. ఆస్ట్రేలియా 1902 జనవరి 1
61 ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ v. ఆస్ట్రేలియా 1904 మార్చి 5
67 భారతదేశం భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా 1948 ఫిబ్రవరి 6
అత్యధిక భాగస్వామ్యాలు [32]
పరుగులు వికెట్ ఆటగాళ్ళు మ్యాచ్ తేదీ
346 6వ డాన్ బ్రాడ్‌మాన్ (270) & జాక్ ఫింగిల్టన్ (136) ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా v.ఇంగ్లాండ్ ఇంగ్లండ్ 1937 జనవరి 1
323 1వ విల్‌ఫ్రెడ్ రోడ్స్ (179) & జాక్ హాబ్స్ (178) ఇంగ్లాండ్ ఇంగ్లండ్ v.ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా 1912 ఫిబ్రవరి 9
298 2వ బిల్ లారీ (205) & ఇయాన్ చాపెల్ (165) ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా v.వెస్ట్ ఇండీస్ వెస్ట్ ఇండీస్ 1968 డిసెంబరు 26
283 1వ హెర్బర్ట్ సట్‌క్లిఫ్ (176) & జాక్ హాబ్స్ (154) ఇంగ్లాండ్ ఇంగ్లండ్ v.ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా 1925 జనవరి 1
279 6వ ఆండ్రూ సైమండ్స్ (156) & మాథ్యూ హేడెన్ (153) ఆస్ట్రేలియాఆస్ట్రేలియా v.ఇంగ్లాండ్ ఇంగ్లండ్ 2006 డిసెంబరు 26
వికెట్ల ద్వారా అత్యధిక భాగస్వామ్యాలు [33]
పరుగులు వికెట్ ఆటగాళ్ళు మ్యాచ్ తేదీ
323 1వ విల్‌ఫ్రెడ్ రోడ్స్ (179) & జాక్ హాబ్స్ (178) ఇంగ్లాండ్ ఇంగ్లండ్ v.ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా 1912 ఫిబ్రవరి 9
298 2వ బిల్ లారీ (205) & ఇయాన్ చాపెల్ (165) ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా v.వెస్ట్ ఇండీస్ వెస్ట్ ఇండీస్ 1968 డిసెంబరు 26
249 3వ డాన్ బ్రాడ్‌మాన్ (169) & స్టాన్ మెక్‌కేబ్ (112) ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా v.ఇంగ్లాండ్ ఇంగ్లండ్ 1937 ఫిబ్రవరి 26
262 4వ విరాట్ కోహ్లీ (169) & అజింక్యా రహానే (147) భారతదేశం భారతదేశం v.ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా 2014 డిసెంబరు 26
223* 5వ డాన్ బ్రాడ్‌మాన్ (127*) & ఆర్థర్ మోరిస్ (100*) ఆస్ట్రేలియాఆస్ట్రేలియా v.భారతదేశం భారతదేశం 1948 జనవరి 1
346 6వ డాన్ బ్రాడ్‌మాన్ (270) & జాక్ ఫింగిల్టన్ (136) ఆస్ట్రేలియాఆస్ట్రేలియా v.ఇంగ్లాండ్ ఇంగ్లండ్ 1937 జనవరి 1
185 7వ గ్రాహం యాలోప్ (268) & గ్రెగ్ మాథ్యూస్ (75) ఆస్ట్రేలియాఆస్ట్రేలియా v.పాకిస్తాన్ పాకిస్తాన్ 1983 డిసెంబరు 26
173 8వ నిప్ పెల్లెవ్ (116) & జాక్ గ్రెగొరీ (100) ఆస్ట్రేలియాఆస్ట్రేలియా v.ఇంగ్లాండ్ ఇంగ్లండ్ 1920 డిసెంబరు 31
180 9వ JP డుమిని (166) & డేల్ స్టెయిన్ (76) దక్షిణాఫ్రికాదక్షిణాఫ్రికా v.ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా 2008 డిసెంబరు 26
120 10వ రెగీ డఫ్ (104) & వార్విక్ ఆర్మ్‌స్ట్రాంగ్ (45*) ఆస్ట్రేలియాఆస్ట్రేలియా v.ఇంగ్లాండ్ ఇంగ్లండ్ 1902 జనవరి 1

వన్డే రికార్డులు[మార్చు]

 • అత్యధిక ODI మొత్తం: 5/355 – ఆస్ట్రేలియా vs. ఇంగ్లాండ్, 2022 నవంబరు 22 [34]
 • అత్యధిక వ్యక్తిగత ODI స్కోరు: 180 (151) - జాసన్ రాయ్, ఇంగ్లాండ్ vs ఆస్ట్రేలియా, 2018 జనవరి 14 [35]
 • ఉత్తమ ODI ఇన్నింగ్స్ బౌలింగ్ గణాంకాలు: 6/42 – అజిత్ అగార్కర్, భారతదేశం vs. ఆస్ట్రేలియా, 2004 జనవరి 9, యుజ్వేంద్ర చాహల్, భారతదేశం vs. ఆస్ట్రేలియా, 2019 జనవరి 18 [36]
 • అత్యధిక ODI భాగస్వామ్యం: 269 (మొదటి వికెట్‌కు) – ట్రావిస్ హెడ్ & డేవిడ్ వార్నర్, ఆస్ట్రేలియా vs. ఇంగ్లాండ్, 2022 నవంబరు 22 [37]

చివరిగా 2022 డిసెంబరు 26న నవీకరించబడింది.

ట్వంటీ20 అంతర్జాతీయ రికార్డులు[మార్చు]

 • అత్యధిక ట్వంటీ20 మొత్తం: 5/186 – భారత్ vs. జింబాబ్వే, 2022 నవంబరు 6 [38]
 • అత్యధిక వ్యక్తిగత ట్వంటీ20 స్కోరు: 89 (43) – డేవిడ్ వార్నర్, ఆస్ట్రేలియా vs. దక్షిణాఫ్రికా, 2009 జనవరి 11 [39]
 • ఉత్తమ ట్వంటీ20 ఇన్నింగ్స్ బౌలింగ్ గణాంకాలు: 4/30 – జోష్ హాజిల్‌వుడ్, ఆస్ట్రేలియా vs. ఇంగ్లాండ్, 2014 జనవరి 31 [40]
 • అత్యధిక ట్వంటీ20 భాగస్వామ్యం: 113 (ఐదో వికెట్‌కు) – విరాట్ కోహ్లీ & హార్దిక్ పాండ్యా, భారతదేశం vs. పాకిస్తాన్, 2022 అక్టోబరు 23 [41]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

 1. "Biggest Stadiums in The World By Capacity". 6 February 2021. Archived from the original on 16 June 2018. Retrieved 16 June 2018.
 2. "Ed Sheeran Breaks Multiple Australian Records with MCG Concerts". Billboard.
 3. "MCG Facts and Figures". Melbourne Cricket Ground. 2009. Archived from the original on 6 January 2010. Retrieved 26 December 2009.
 4. 4.0 4.1 "MCG Reserved Seating Map - Richmond". membership.richmondfc.com.au. Archived from the original on 26 September 2018. Retrieved 14 December 2018.
 5. Mann, Chris (24 November 2009). "The 10 largest football stadiums in the world". soccerlens.com. Sports Lens. Archived from the original on 26 November 2009. Retrieved 24 November 2009.
 6. Chappell, Ian (26 December 2010). "Heroes wanted: Apply at the 'G". Herald Sun. Retrieved 29 December 2010.
 7. "Melbourne Cricket Ground". Archived from the original on 22 April 2022. Retrieved 21 April 2022.
 8. "Places for Decision" (PDF). Australian Heritage Database. Archived (PDF) from the original on 7 March 2021. Retrieved 11 October 2021.
 9. "Melbourne Cricket Ground | Australia | Cricket Grounds | ESPNcricinfo.com". Cricinfo. Archived from the original on 12 February 2020. Retrieved 25 January 2021.
 10. "Melbourne Cricket Ground". supersport.com (in ఇంగ్లీష్). Archived from the original on 28 June 2015. Retrieved 25 January 2021.
 11. Levison, Brian (2016). Remarkable Cricket Grounds. Great Britain: Pavilion Books. ISBN 9781911216056.
 12. Melbourne Cricket Ground Trust (2020). "Melbourne Cricket Ground Trust Annual Report 2019/20" (PDF). Archived (PDF) from the original on 9 October 2020. Retrieved 5 October 2020.
 13. MCG stand to be named in honour of Shane Warne Archived 5 మార్చి 2022 at the Wayback Machine Australian Financial Review 5 March 2022
 14. 1956 Summer Olympics official report.
 15. "The Age, Monday 16 March 1959, "Crusade Rally At M.C.G. Draws Huge Crowd"". Archived from the original on 7 April 2022. Retrieved 28 August 2019.
 16. See 1958 VFL Season: Notable Events
 17. "Incredible Win by Carlton in VFL". Canberra Times. 28 September 1970. Archived from the original on 3 July 2022. Retrieved 1 May 2017.
 18. "MCG attendance records". mcg.org.au. Archived from the original on 29 March 2015. Retrieved 1 April 2015.
 19. "Top 10 ICC World Cup Cricket Venues in the World". Sporty Ghost!. 16 December 2014. Archived from the original on 24 September 2015. Retrieved 21 July 2015.
 20. "Batting records | Test matches | Cricinfo Statsguru | ESPNcricinfo.com". Cricinfo. Archived from the original on 9 July 2021. Retrieved 2021-07-03.
 21. "Batting records | Test matches | Cricinfo Statsguru | ESPNcricinfo.com". Cricinfo. Archived from the original on 9 July 2021. Retrieved 2021-07-05.
 22. "Batting records | Test matches | Cricinfo Statsguru | ESPNcricinfo.com". Cricinfo. Archived from the original on 9 July 2021. Retrieved 2021-07-05.
 23. "Batting records | Test matches | Cricinfo Statsguru | ESPNcricinfo.com". Cricinfo. Archived from the original on 9 July 2021. Retrieved 2021-07-05.
 24. "Batting records | Test matches | Cricinfo Statsguru | ESPNcricinfo.com". Cricinfo. Archived from the original on 3 July 2022. Retrieved 2022-07-02.
 25. "Bowling records | Test matches | Cricinfo Statsguru | ESPNcricinfo.com". Cricinfo. Archived from the original on 9 July 2021. Retrieved 2021-07-06.
 26. "Bowling records | Test matches | Cricinfo Statsguru | ESPNcricinfo.com". Cricinfo. Archived from the original on 9 July 2021. Retrieved 2021-07-06.
 27. "Bowling records | Test matches | Cricinfo Statsguru | ESPNcricinfo.com". Cricinfo. Archived from the original on 9 July 2021. Retrieved 2021-07-06.
 28. "Bowling records | Test matches | Cricinfo Statsguru | ESPNcricinfo.com". Cricinfo. Archived from the original on 9 July 2021. Retrieved 2021-07-06.
 29. "Bowling records | Test matches | Cricinfo Statsguru | ESPNcricinfo.com". Cricinfo. Archived from the original on 3 July 2022. Retrieved 2022-07-02.
 30. "Team records | Test matches | Cricinfo Statsguru | ESPNcricinfo.com". Cricinfo. Archived from the original on 9 July 2021. Retrieved 2021-07-07.
 31. "Melbourne Cricket Ground Cricket Team Records & Stats | ESPNcricinfo.com". Cricinfo. Archived from the original on 3 July 2022. Retrieved 2021-12-29.
 32. "Partnership records | Test matches | Cricinfo Statsguru | ESPNcricinfo.com". Cricinfo. Archived from the original on 9 July 2021. Retrieved 2021-07-07.
 33. "Melbourne Cricket Ground Cricket Team Records & Stats | ESPNcricinfo.com". Cricinfo. Archived from the original on 3 July 2022. Retrieved 2021-12-28.
 34. "Team records | One-Day Internationals | Cricinfo Statsguru | ESPNcricinfo.com". Cricinfo. Retrieved 2022-12-25.
 35. "Batting records | One-Day Internationals | Cricinfo Statsguru | ESPNcricinfo.com". Cricinfo. Retrieved 2022-12-25.
 36. "Bowling records | One-Day Internationals | Cricinfo Statsguru | ESPNcricinfo.com". Cricinfo. Retrieved 2022-12-25.
 37. "Partnership records | One-Day Internationals | Cricinfo Statsguru | ESPNcricinfo.com". Cricinfo. Retrieved 2022-12-25.
 38. "Team records | Twenty20 Internationals | Cricinfo Statsguru | ESPNcricinfo.com". Cricinfo. Retrieved 2022-12-25.
 39. "Batting records | Twenty20 Internationals | Cricinfo Statsguru | ESPNcricinfo.com". Cricinfo. Retrieved 2022-12-25.
 40. "Bowling records | Twenty20 Internationals | Cricinfo Statsguru | ESPNcricinfo.com". Cricinfo. Retrieved 2022-12-25.
 41. "Partnership records | Twenty20 Internationals | Cricinfo Statsguru | ESPNcricinfo.com". Cricinfo. Retrieved 2022-12-25.