స్టీవ్ వా
స్టీవ్ వా | ||||
![]() | ||||
వ్యక్తిగత సమాచారం | ||||
---|---|---|---|---|
బ్యాటింగ్ శైలి | కుడిచేతి బ్యాట్స్‌మన్ | |||
బౌలింగ్ శైలి | కుడిచేతి మీడియంబౌలర్ | |||
కెరీర్ గణాంకాలు | ||||
Tests | ODIs | |||
మ్యాచ్‌లు | 168 | 325 | ||
పరుగులు | 10927 | 7569 | ||
బ్యాటింగ్ సగటు | 51.06 | 32.90 | ||
100లు/50లు | 32/50 | 3/45 | ||
అత్యుత్తమ స్కోరు | 200 | 120* | ||
ఓవర్లు | 1300 | 1480 | ||
వికెట్లు | 92 | 195 | ||
బౌలింగ్ సగటు | 37.44 | 34.67 | ||
ఒకే ఇన్నింగ్స్ లో 5 వికెట్లు | 3 | - | ||
ఒకే మ్యాచ్ లో 10 వికెట్లు | - | n/a | ||
అత్యుత్తమ బౌలింగ్ | 5/28 | 4/33 | ||
క్యాచ్ లు/స్టంపింగులు | 112/- | 111/- | ||
1965, జూన్ 2న జన్మించిన స్టీవ్ వా (Stephen Rodger Waugh) ఆస్ట్రేలియాకు చెందిన మాజీ క్రికెట్ ఆటగాడు. ఇతడు 1985-86 నుంచి టెస్ట్ క్రికెట్‌కు జనవరి 2004 వరకు, వన్డే క్రికెట్‌కు ఫిబ్రవరి 2002 వరకు ఆస్ట్రేలియా జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 1999 నుండి 2004 వరకు జట్టుకు నేతృత్వం కూడా వహించిన ప్రముఖ క్రీడాకారుడైన ఇతడు 168 టెస్టులకు ప్రాతినిధ్యం వహించి అత్యధిక టెస్టు మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. సహచరులచే "తుగ్గ" అని, అభిమానులచే "ఐస్‌మాన్" అని ముద్దుగా పిలుచుకొనే స్టావ్ వా ఒత్తిడి పరిస్థితుల్లోనూ ప్రశాంతంగా, నిబ్బరంగా ఉండేవాడు. 2004లో ఆస్ట్రేలియన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపైకైనాడు.
ప్రారంభ క్రీడా జీవితం[మార్చు]
స్టావ్ వా 1984-85లో తొలిసారిగా న్యూసౌత్ వేల్స్ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అడుగుపెట్టినాడు. షెఫీల్డ్ షీల్డ్ పహినల్ మ్యాచ్‌లో జట్టు ఓటమి దశలో ఉన్నప్పుడు నేర్పుతో ఆడి 71 పరుగులు సాధించాడు. 2004, జనవరి 2న భారత్‌పై తొలి టెస్ట్ ఆడి టెస్టులలో ఆరంగేట్రం చేశాడు. గణాంకాలు సరిగా లేకపోవడంతో తదుపరి న్యూజీలాండ్ పర్యటనకై జట్టులో స్థానం పొందలేకపోయాడు. మళ్ళీ 1986లో 3 టెస్టుల సీరీస్‌కై భారత పర్యటన సందర్భంగా జట్టులో స్థానం పొంది ఒక ఇన్నింగ్సులో 59 పరుగులు చేయడం మినహా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ఆ తరువాత ఇంగ్లాండుతో జరిగిన సీరీస్‌లో పెర్త్ టెస్టులో 71 పరుగులుచేయడమే కాకుండా బౌలింగ్‌లో 5 వికెట్లుకూడా సాధించాడు. ఆ తరువార అడిలైడ్ టెస్టులో 79 (నాటౌట్) పరుగులు చేసి మ్యాచ్ డ్రాకు సహకరించాడు. ఆ సీరీస్‌లో 310 పరుగులు చేయడమే కాకుండా 10 వికెట్లను పడగొట్టినాడు.
1987 ప్రపంచ కప్[మార్చు]
భారత ఉపఖండంలో జరిగిన 1987 ప్రపంచ కప్‌లో అతని ఆటతీరు క్రీడాజీవితాన్నే మార్చివేసింది. భారత్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో చివరి ఓవర్లలో పట్టుపట్టి మనిందర్ సింగ్ ను ఔట్ చేసి ఆస్ట్రేలియాకు ఒక పరుగుతో విజయాన్ని అందించాడు. న్యూజీలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో న్యూజీలాండ్‌కు చివరి ఓవర్‌లో 7 పరుగులు అవసరమై ఉండగా కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి మళ్ళీ జట్టును విజయపథంలోకి నడిపించాడు. సెమీఫైనల్‌లో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో బ్యాటింగ్ చేస్తూ 16 పరుగులు పిండుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 18 పరుగులచే గెలవడం గమనార్హం. కోల్‌కతలో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్‌లో ఇంగ్లాండుపై ఆడుతూ కీలకమైన వికెట్లు పడగొట్టి మళ్ళీ జట్టుకు విజయం చేకూర్చినాడు. ఇంగ్లాండు 254 పరుగుల లక్ష్యసాధనలో ఉండగా కీలక సమయంలో 47వ ఓవర్‌లో అలాన్ లాంబ్ ను, 49వ ఓవర్‌లో ఫిలిప్ డి ఫ్రిటాస్ వికెట్లను సాధించి ఆస్ట్రేలియాకు 7 పరుగుల విజయాన్ని సంపాదించిపెట్టి విశ్వవిజేతగా నిలిపాడు. ప్రపంచ కప్‌ను సాధించడం అదే ఆస్ట్రేలియాకు తొలి సారి. ఒత్తిడి పరిస్థితులోనూ పట్టుదలతో కృషిచేసి విజయం సంపాదించినందుకు ఈ సమయంలోనే "ఐస్‌మాన్" అనే ముద్దుపేరు వచ్చింది.
ప్రపంచ కప్ అనంతరం[మార్చు]
వన్డేలలో మాయాజాలంతో ప్రపంచ కప్‌లో ఆపత్సమయంలో అద్భుతంగా రాణించిననూ టెస్టులలో మళ్ళీ విఫలమయ్యాడు. ఆ తరువాత కూడా జట్టులో కొనసాగినాడంటే అతని బౌలింగే కారణం. 1988 పాకిస్తాన్ పర్యటనలో 18.4 సగటుతో కేవలం 92 పరుగులు మాత్రమే చేశాడు. 1988-89లో వెస్ట్‌ఇండీస్ పర్యటనలో రెండూ ఇన్నింగ్సులలో 90, 91 పరుగులు సాధించడం మినహా పెద్దగా ప్రభావితం చేయలేకపోయాడు. 1989 ఆషెష్ సీరీస్ నాటికి 26 టెస్టులలో 30.52 సగటుతో ఉన్నాడు. [1] ఎట్టకేలను లీడ్స్ టెస్టులో స్టీవ్ వా శతకాన్ని సాధించాడు. ఏకంగా 177 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి విమర్శకుల నోళ్ళుమూయించాడు. ఆ తరువాత లార్డ్స్ లో జరిగిన రెండో టెస్టులోనూ 152 పరుగులు సాధించి నాటౌట్‌గా నిల్చినాడు. మూడో టెస్టులో 43 పరుగులు సాధించే వరకూ స్టీవ్ వా ఆ సీరీస్‌లో ఔత్ కాకపోవడం గమనార్హం. అదే ప్రతిభను కనబర్చుతూ నాలుగవ టెస్టులోనూ 92 పరుగులు సాధించాడు. ఆ సీరీస్‌లో 126.5 సగటుతో 506 పరుగులు తనఖాతాలో జమచేసుకున్నాడు. ఆ తరువాత భారత పర్యటనలోను, ఆషెష్ సీరీస్‌లోనూ ప్రత్యేక బ్యాట్స్‌మెన్‌గా రంగంలోకి దిగాడు.[2] 1989-90లో స్వదేశంలో జరిగిన సీరీస్‌లో 6 టెస్టులలో 37.8 సగటుతో 378 పరుగులు సాధించాడు. శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో 134 పరుగులు చేసి నాటౌట్‌గా నిల్చినాడు. అంతకు క్రితం తొలి టెస్టులో రెండు ఇన్నింగ్సులలోనూ అర్థసెంచరీలు చేశాడు. 1990లో అతని కవల సోదరుడు మార్క్ వా కూడా అతనితో జతకల్సినాడు. వారిద్దరు న్యూసౌత్ వేల్స్ తరఫున ఆడుతూ పశ్చిమ ఆస్ట్రేలియాపై 464 పరుగుల భాగస్వామాన్ని నెలకొల్పారు. అది దేశవాళీ క్రికెట్ పోటీ అయిననూ టెస్ట్ క్రికెట్ బౌలర్లను ఎదుర్కొని ఆ రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పడం విశేషం.
1990 దశాబ్దం[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ Cricinfo.com: Statsguru.
- ↑ Egan, p 61.