పాల్ రీఫెల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పాల్ రీఫెల్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
పాల్ రోనాల్డ్ రీఫెల్
పుట్టిన తేదీ (1966-04-19) 1966 ఏప్రిల్ 19 (వయసు 57)
బాక్స్ హిల్, విక్టోరియా, ఆస్ట్రేలియా
మారుపేరుపిస్టల్
ఎత్తు187 cm (6 ft 2 in)
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్-మీడియం
పాత్రఆల్ రౌండరు, umpire
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 352)1992 ఫిబ్రవరి 1 - ఇండియా తో
చివరి టెస్టు1998 మార్చి 6 - ఇండియా తో
తొలి వన్‌డే (క్యాప్ 108)1992 జనవరి 14 - ఇండియా తో
చివరి వన్‌డే1999 జూన్ 20 - పాకిస్తాన్ తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.4
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1987/88–2001/02విక్టోరియా
2000నాటింగ్‌హామ్‌షైర్
అంపైరుగా
అంపైరింగు చేసిన టెస్టులు62 (2012–2023)
అంపైరింగు చేసిన వన్‌డేలు79 (2009–2022)
అంపైరింగు చేసిన టి20Is27 (2009–2022)
అంపైరింగు చేసిన మటెస్టులు1 (2008)
అంపైరింగు చేసిన మవన్‌డేలు3 (2004–2011)
అంపైరింగు చేసిన మటి20Is7 (2012–2014)
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 35 92 168 158
చేసిన పరుగులు 955 503 3,690 882
బ్యాటింగు సగటు 26.52 13.97 24.76 14.00
100లు/50లు 0/6 0/1 0/18 0/1
అత్యుత్తమ స్కోరు 79* 58 86 58
వేసిన బంతులు 6,403 4,732 32,772 7830
వికెట్లు 104 106 545 166
బౌలింగు సగటు 26.96 29.20 26.40 31.04
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 5 0 16 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 2 0
అత్యుత్తమ బౌలింగు 6/71 4/13 6/57 4/13
క్యాచ్‌లు/స్టంపింగులు 15/– 25/– 77/– 44/–
మూలం: ESPNcricinfo, 14 June 2023

పాల్ రోనాల్డ్ రీఫెల్ (జననం 1966 ఏప్రిల్ 19) ఆస్ట్రేలియా మాజీ క్రికెటరు. అతను 1992 నుండి 1999 వరకు 35 టెస్టులు, 92 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు.[1] అతను 1999 ప్రపంచ కప్ విజేతలైన ఆస్ట్రేలియా జట్టులో సభ్యుడు. రిటైర్మెంట్ తర్వాత ఫస్ట్ క్లాస్ క్రికెట్ అంపైర్ అయ్యాడు. [2] అతను ప్రస్తుతం ఐసిసి అంపైర్ల ఎలైట్ ప్యానెల్ సభ్యుడు. 1999 క్రికెట్ ప్రపంచ కప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టులో రీఫెల్ ఒక భాగం.

ఆటగాడిగా[మార్చు]

రీఫిల్ కెరీర్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు 6/71 1993లో ఎడ్జ్‌బాస్టన్‌లో వచ్చాయి. కెరీర్ మొత్తంలో అతను 35 టెస్టుల్లో 26.96 సగటుతో 104 వికెట్లు తీశాడు. ఒక ఇన్నింగ్స్‌లో 5 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు ఐదుసార్లు తీసుకున్నాడు. సీమ్ బౌలింగ్ ప్రధాన దాడి ఆయుధంగా ఉన్న ఖచ్చితమైన బౌలర్, [1] రీఫిల్ బ్యాటరుగా కూడా పనికొస్తాడు. షాట్‌మేకింగ్ సామర్థ్యం అతనిలో పరిమితమే ఐనప్పటికీ, అతనికి పటిష్ఠమైన రక్షణాత్మక సామర్థ్యం ఉంది. 1999 క్రికెట్ ప్రపంచ కప్ వన్‌డే గెలిచిన జట్టు, 1994/95 ఫ్రాంక్ వోరెల్ ట్రోఫీ సిరీస్‌లో వెస్టిండీస్‌ను ఓడించిన టెస్ట్ జట్టులో సభ్యుడుగా ఉండటం అతని ఆస్ట్రేలియన్ ఆట జీవితంలో రెండు ముఖ్యమైన విజయాలు. [3] 2001 లో రీఫెల్ విక్టోరియన్ క్రికెట్ కెప్టెన్‌గా ఉండగా, మైఖేల్ క్లింగర్ 99 నాటౌట్‌ వద్ద ఉన్నపుడు విక్టోరియన్ ఇన్నింగ్స్‌ను ముగించినట్లు డిక్లేర్ చేయడంతో అపఖ్యాతి పాలయ్యాడు. [4]

అంపైరింగ్ కెరీర్[మార్చు]

2002లో మెల్‌బోర్న్ గ్రేడ్ క్రికెట్‌లో మొదటి అంపైరింగ్ చేసిన తర్వాత రీఫెల్ 2004/2005 సీజన్‌లో తన ఫస్ట్ క్లాస్ అంపైరింగ్ రంగప్రవేశం చేశాడు. రీఫెల్ 2005/2006 సీజన్‌లో క్రికెట్ ఆస్ట్రేలియా నేషనల్ అంపైర్స్ ప్యానెల్‌లో చేరాడు. [5] [6] 2008లో, అతను ఐసిసి అంపైర్ల అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ ప్యానెల్‌లో సభ్యుడయ్యాడు, [7] అది సాధించిన మొదటి మాజీ ఆస్ట్రేలియన్ టెస్ట్ క్రికెటరతను. [8] 2009 ఫిబ్రవరి 6న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ల మధ్య జరిగిన వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో తన అంతర్జాతీయ ఆన్-ఫీల్డ్ అంపైరింగ్ రంగప్రవేశం చేసాడు.[9] అతను 2012 జూలై-ఆగస్టుల్లో వెస్టిండీస్-న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్‌లోని రెండు టెస్టులకు కూడా అంపైర్‌గా ఉన్నాడు.

2019 ఏప్రిల్లో, అతను 2019 క్రికెట్ ప్రపంచ కప్‌లో మ్యాచ్‌లలో నిలిచిన పదహారు మంది అంపైర్‌లలో ఒకరిగా ఎంపికయ్యాడు. [10] [11]

ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు తొలి రోజున ఫీల్డర్ భువనేశ్వర్ కుమార్ విసిరిన బంతి రీఫిల్ తలకు తగిలింది. మైదానం వీడి వెళ్లిన అతను కొన్ని ముందు జాగ్రత్త పరీక్షలు చేయించుకోగా పెద్దగా గాయాలు ఏమీ లేవని తేలింది. అయితే రీఫిల్ మ్యాచ్‌లో పాల్గొనకూడదని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నిర్ణయించింది. థర్డ్ అంపైర్‌గా ఉన్న మరాయిస్ ఎరాస్మస్ అతని స్థానంలో అంపైరింగు చేసాడు. [12]

2013 జూన్లో, రీఫిల్‌ను ఐసిసి అంపైర్ల ఎలైట్ ప్యానెల్‌కు పదోన్నతి ఇచ్చారు. 2015 క్రికెట్ ప్రపంచ కప్ సమయంలో మ్యాచ్‌లలో నిలిచిన ఇరవై మంది అంపైర్లలో ఒకడుగా అతను ఎంపికయ్యాడు. [13]

కుటుంబం[మార్చు]

రీఫిల్ తండ్రి, రాన్ రీఫిల్, రిచ్‌మండ్ ఫుట్‌బాల్ క్లబ్‌కు ఆడాడు. అతని తాత, లౌ రీఫెల్ కూడా ఆస్ట్రేలియన్ రూల్స్ ఫుట్‌బాల్ ఆటగాడు. అతను మెల్‌బోర్న్, సౌత్ మెల్‌బోర్న్ రెండింటికీ ఆడాడు. [14]

2018 డిసెంబరులో తన తండ్రి మరణించిన తర్వాత, ఆ తర్వాతి నెలలో న్యూజిలాండ్‌లో శ్రీలంక పర్యటన సందర్భంగా రీఫెల్ అధికారిక విధుల నుండి వైదొలిగాడు.

మూలాలు[మార్చు]

 1. 1.0 1.1 "Players and Officials – Paul Reiffel". Cricinfo. Retrieved 2009-03-04.
 2. "International cricketers turned umpires". International Cricket Council. Retrieved 7 April 2018.
 3. Polack J (2002) No more of Mr Nice Guy as Reiffel depart, CricInfo, 24 January 2002. Retrieved 22 August 2019.
 4. Ahmed, Nabila (7 November 2005). "Klinger takes four years to finish century". The Age. Retrieved 2009-03-04.
 5. "Reiffel picked on national umpire's panel". Cricinfo. 12 May 2005. Retrieved 2009-03-04.
 6. Daffey, Paul (27 October 2002). "Reiffel's right decision". The Age. Retrieved 2009-03-04.
 7. "Reiffel continues rise through umpiring ranks". The Sydney Morning Herald. 24 October 2008. Retrieved 2009-03-04.
 8. "Dhaka Bolshy but brilliant". ESPN Cricinfo. 19 April 2005. Retrieved 20 April 2017.
 9. Australia v New Zealand, Cricinfo, 6 February 2009.
 10. "Match officials for ICC Men's Cricket World Cup 2019 announced". International Cricket Council. Retrieved 26 April 2019.
 11. "Umpire Ian Gould to retire after World Cup". ESPN Cricinfo. Retrieved 26 April 2019.
 12. "Reiffel sent to hospital after blow to head". ESPN Cricinfo. Retrieved 8 December 2016.
 13. "ICC announces match officials for ICC Cricket World Cup 2015". ICC Cricket. 2 December 2014. Archived from the original on 30 March 2015. Retrieved 12 February 2015.
 14. Holmesby, Russell; Main, Jim (2007). The Encyclopedia of AFL Footballers. BAS Publishing. ISBN 978-1-920910-78-5.