Jump to content

గ్రెగ్ డయ్యర్

వికీపీడియా నుండి
గ్రెగ్ డయ్యర్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
గ్రెగరీ చార్లెస్ డయ్యర్
పుట్టిన తేదీ (1959-03-16) 1959 మార్చి 16 (వయసు 65)
పర్రామట్టా, న్యూ సౌత్ వేల్స్, ఆస్ట్రేలియా
బ్యాటింగుకుడిచేతివాటం
పాత్రవికెట్ కీపర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 339)1986 డిసెంబరు 12 - ఇంగ్లండ్ తో
చివరి టెస్టు1988 ఫిబ్రవరి 12 - శ్రీలంక తో
తొలి వన్‌డే (క్యాప్ 94)1986 సెప్టెంబరు 24 - ఇండియా తో
చివరి వన్‌డే1988 ఫిబ్రవరి 4 - ఇంగ్లండ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1983/84–1988/89న్యూ సౌత్ వేల్స్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్ట్ వన్ డే ఇంటర్నేషనల్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ లిస్ట్ ఎ క్రికెట్
మ్యాచ్‌లు 6 23 51 45
చేసిన పరుగులు 131 174 1,671 408
బ్యాటింగు సగటు 21.83 15.81 28.81 20.40
100లు/50లు 0/1 0/0 1/10 0/1
అత్యుత్తమ స్కోరు 60 45* 106 52*
క్యాచ్‌లు/స్టంపింగులు 22/2 24/4 123/18 39/9
మూలం: CricketArchive, 2013 జనవరి 14

గ్రెగరీ చార్లెస్ డయ్యర్ (జననం 1959 మార్చి 16) మాజీ న్యూ సౌత్ వేల్స్, ఆస్ట్రేలియా జట్ల వికెట్ కీపర్. డయ్యర్ 1986 నుండి 1988 వరకు ఆరు టెస్టులు, 23 వన్డేలు ఆడాడు. 1987 ప్రపంచ కప్ ఫైనల్‌ గెలుపు కూడా ఉంది. అతను 1986లో బ్యాకప్ కీపర్‌గా భారత్‌లో పర్యటించాడు.

1987-88లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో జరిగిన ఒక వివాదాస్పద సంఘటనతో పాటు, ఇయాన్ హీలీ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టడం కలగలసి అతని అంతర్జాతీయ కెరీర్ త్వరగానే ముగిసిపోయింది. డయ్యర్ కొన్ని టెస్టులకు మాత్రమే టిమ్ జోహ్రేర్ బదులుగా ఆడాడు. న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ ఆండ్రూ జోన్స్‌ని క్యాచ్ అవుట్ విషయం వివాదాస్పదమైంది. గ్రెగ్ డయ్యర్ ఇది సరైన క్యాచ్ అని అపీల్ చేయగా అలానే అవుట్ ఇచ్చారు. అయితే, టెలివిజన్ రీప్లేలు డయ్యర్ చేతిలో క్యాచ్ అయ్యే ముందు బంతి నేలను తాకినట్లు చూపించాయి.[1] అతను రెండు మ్యాచ్‌ల తర్వాత జట్టు నుండి తొలగించబడ్డాడు. కొంతకాలం తర్వాత ఫస్ట్-క్లాస్ క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు. [2]

అతను స్టీవ్ వాతో కలిసి ఆస్ట్రేలియా జట్టులో వన్ డేల్లో 7వ వికెట్‌కు అత్యుత్తమ భాగస్వామ్య రికార్డును స్థాపించాడు.

2011లో డయ్యర్ ఆస్ట్రేలియన్ క్రికెటర్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఎంపికయ్యాడు.[3][4][5]

  1. Grant, Trevor (28 December 1987), Row breaks out over Dyer's catch that wasn't, The Age, retrieved 31 January 2015
  2. "Greg Dyer: World Cup winner whose career ended following a fraudulent claim" (in అమెరికన్ ఇంగ్లీష్). 16 March 2013. Retrieved 2016-07-23.
  3. "Dyer takes over as ACA president". Retrieved 2016-07-23.
  4. "'Miss this opportunity and it'll put cricket back five years'". Retrieved 2016-07-23.
  5. Hanlon, Peter (2015-12-25). "How Greg Dyer did himself out of a job with the ICC". The Age. Retrieved 2016-07-23.